ఆ రోజుల్లో మా స్కూలు జీవితం…

ఒక్కో సారి తలుచుకుంటే మేము చదువుకున్న రోజులు ఓ అందమైన అద్భుతం లా అనిపిస్తుంది. ఎందుకంటే, ఇప్పట్లా అప్పుడు టీవీ మొబైల్ ఇంటర్నెట్ జీవితం ఉండేది కాదు. సాయంత్రం 4 30 కి ఇల్లు చేరామంటే… స్కూల్ బుక్స్ ని ఓ మూల పడేసి… ఆడుకోటానికి పరుగు పెట్టె వాళ్ళం, మళ్ళీ ఏ 8 కి ఇంటి ముఖం చూసే వాళ్ళం. నేను 6 వ క్లాసు కి. 1976 లో డైరెక్ట్ గ చేరిన రోజులు. sixth C లో చేరాను. రూం నెంబర్ ౩ లో. separate గా ఉండేది. రాజేశ్వరి madam మా క్లాసు టీచర్. సురేంద్ర నాకు పరిచయమైన బెస్ట్ ఫ్రెండ్. ఇప్పటికి తను, నేను అంతే క్లోజ్. ఎన్నో సార్లు గొడవ పడ్డ… మళ్ళీ కలిసి పోతాము .. ఇప్పటికి కూడా. ఇంటర్వల్ లో నేను, తను, రఘురాం (తను U .S లో ఉన్నాడు) స్కూల్ పక్కనే ఉన్న శరత్ వాళ్ళ ఇంటికి నీళ్ళు తాగటానికి వీళ్ళే వాళ్ళం. వాళ్ళ నాన్న కి నేనంటే చాల ఇష్టం. నన్ను ఎప్పుడూ లతా కేఫ్ లో చూసి ఆప్యాయం గా మాట్లాడే వారు. కొన్ని బంధాలు… కడ వరకు ఉండి పోతాయి… తను నేను అంతే.. ఇప్పటికి చిత్తూర్ వెల్లానంటే తన ఇంటి కి వెళ్లక పోతే ఊరుకోడు. తన భార్య కోమతి కూడా ఓ స్వంత అన్నయ్య లాగా చూస్తుంది. సూరి 7th తప్ప, మిగతా అన్ని classes లోను నా సెక్షన్ లో ఉండేవాడు. తన లో నాకు నచ్చే విషయం ఏంటంటే… ఎప్పుడు సంతోషం గా ఉంటాడు… ( అఫ్ కోర్సు… అప్పుడప్పుడు నా లా b p తెచ్చుకున్నప్పుడు తప్ప) తను కొత్త పల్లి నుంచి వచ్చే వాడు కాబట్టి, అందరు ఆ ఊరి పేరు పెట్టి తనని పిలిచేవాళ్ళు. తను దేనికి సీరియస్ అవ్వడు. నేను టెన్త్ లో బీ. జెడ్ స్కూల్ కి వెళ్ళిన కూడా, తను నన్ను తరచు కలిసే వాడు. నా సంతోషం లోను.. దుఃఖ సమయాల్లో కూడా నా వెన్నంటి ఉన్న మిత్రుడు సూరి… ఇప్పటికి తనని మనసార తిట్టగలను… మరు క్షణం లో మళ్ళీ కలిసి పోగల మిత్రుడు సూరి. మన అందరి ఫ్రెండ్స్ తోను నిత్యం టచ్ లో ఉంటూ ఇప్పుడు మన అసోసియేషన్ కి సెక్రటరీ గా ఉండి మన అందరి బంధాన్ని ధృఢ పరచగలడు సూరి.. నేను సెవెంత్ c లో ఉన్న సమయం లో ఓ తుంటరి రాజంపేట నుంచి వచ్చాడు… తన గురించి తెలుసుకోవాలంటే ఓ విరామం తీసుకోవాల్సిందే…

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

3 Responses to ఆ రోజుల్లో మా స్కూలు జీవితం…

 1. kalaivani says:

  ee budda babu peru k.k. prasad
  inka evaraina unnara kanukkovadaniki?
  bye and cheers

 2. kalaivani says:

  mottam vishayalu sekarinchaka
  why can’t you give it for publishing?
  It’s very nice and definitely remaining
  who will read this get inspiration.

  bye and cheers,
  Have a nice day and
  Happy belated Rakhi Pournami

 3. thanks a lot. That’s a good idea…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s