రాజం పేట చిన్నోడి గురించి..

ఏడవ తెరగతి లో 4 sections ఉండేవి. నేను C లో ఉన్నాను. మా సెక్షన్ లో కలై వాణి బాగా చదివే అమ్మాయి. తనకి teaching చేయటం, బోర్డు మీద రాయటం చాల ఇష్టం. ఇప్పుడు కూడ తను teaching లైన్ లోనే settlle అయ్యింది. ఈ విషయాన్ని ప్రసన్న కూడా గుర్తు చేసుకుంటూ.. తను సెవెంత్ లో ఓసారి స్కూల్ మిస్ అయ్యిన రోజుల notes ని కలై వాణి రాసి ఇచ్చిందని చెప్పాడు. ఇంకో విషయం …. కలై వాణి చేతి రాత ఎంత బాగుంటుందో…. ప్రసన్న రాత అంత ….. (ఈ వాక్యం పూర్తి చేస్తే ప్రసన్న తంతాడు కాబట్టి పూర్తి చేయను..)

పరమేశ్వరి madam మా క్లాసు టీచర్. kk , బాల సుబ్రహ్మణ్యం. ప్రసన్న కుమార్ వరలక్ష్మి క్లాసు లో ఉన్న కొంత మంది. అకాడెమిక్ ఇయర్ మధ్య లో రాజం పేట నుండి ఓ సిస్టర్ అండ్ బ్రదర్ చేరారు. … గాయత్రి , రామ చంద్ర. అతి కొద్ది కలం లోనే మంచి ఫ్రెండ్ అయ్యాడు తను. ఏప్రిల్ 1 న నా షర్టు పై ఇంకు పోసాడని ఎనిమి కొట్టాను. అప్పట్నుంచి మేము అలా enemy కొట్టుకోటం, మళ్ళీ మధ్యవర్తుల ద్వార (ఎనిమి లు మళ్ళీ కలవాలంటే , ఒకరి పేరు ఒకరు చెప్పాలి. అదీ లెక్క.. )కలుసుకొనే వాళ్ళం. మేమిద్దరం ఓ సారి పాటల పోటి లో పాల్గొని… ఒక్క ముక్క కూడా పాడకుండా వచ్చేశాం … ఐన కూడా… మాకే మైన ప్రైజ్ వస్తున్ దేమోననే (దు) ఆశ తో వెయిట్ చేసాం. ఇద్దరం ఓ సారి సిరిసిరి మువ్వ సినిమా లో ” రా.. దిగి రా..” అనే పాట పాడి క్లాసు ని రంజింప చేసాం (???)

మా జీవితాలు చాల సమాంతరం గ ఉండేవి. భిన్నత్వం లో ఏకత్వం లాగా… ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో.. ఒకే మాట పలుకుతుంది వేరు వేరు గుండెల్లో… అనే పాట మాకు సరిపోతుంది. ఇప్పటికి తను నాకు అన్ని విషయాలలో తోడు ఉంటాడు. తను ఇప్పుడు తిరుపతి లో పౌల్ట్రీ మేడిసిన్స్ వ్యాపారంలో ఉన్నాడు. ఇద్దరు అమ్మాయిలు… హారిక అండ్ మేఘన.
తన లో నాకు నచ్చే గుణం… ఎన్ని కష్టాలున్న చెరగని చిరు నవ్వు… ఎంతటి సీరియస్ విషయం ఐన తేలిక గ తీసుకో గలగటం. తను ఎక్కడుంటే అక్కడ నవ్వులే నవ్వులు..
తన ఫాదర్ కాన్సెర్ తో 4 years ముందు మరణించారు. తన చివరి దశ లో, కంటికి రెప్పలాగా చూసుకున్న తీరు చాల గ్రేట్.

మన వాళ్ళు ఎవరు ఎక్కడ ఏమి చేస్తున్నారు అనే విషయం అందరికి తెలియటానికి ఈ బ్లాగు లోనే  వివరాలు ఇస్తున్నాను
ముందు గ
1 . బెంగలూరు
సరోజిని దేవి: గృహిణి. ఒక బాబు, ఒక పాప. బాబు ఆస్ట్రేలియా లో పి చదువులు పాప బెంగలూరు లో ఇంజనీరింగ్ చేస్తోంది
గీత లక్ష్మి: గృహిణి. తన బ్రదర్ విజయ భాస్కర్ కూడా బెంగలూరు లోనే ఉన్నాడు
అనురాధ: గృహిణి. ఒక బాబు. తను డిగ్రీ కాలేజీ లెక్చరర్ కూతురు
అనిత: LIC లో క్లాసు 1 ఆఫీసర్ గ ఉంది.  మన రెండు functions కి వచ్చింది గీత తో పాటు. తమాషా ఏంటంటే, తెలుగు మరిచి పోయింది.
గురుప్రసాద్: తను chartered accountancy చేసి మంచి executive పోసిషన్ లో ఉన్నాడు. తన బ్రదర్ నీలకంత కూడా బెంగలూరు లోనే ఉన్నాడు.

2 . తిరుపతి
రామచంద్ర: పౌల్ట్రీ medicines బిజినెస్ లో ఉన్నాడు.
ప్రమీల   గృహిణి. పాప tcs లో ఉద్యోగం. బాబు ఇంజనీరింగ్ లో ఉన్నాడు. సర్ ttd లో పని
ప్రసన్న కుమారి : స్కూల్ లో టీచర్ గ జాబు చేసి ఇంకో ఉద్యోగ అన్వేషణ లో ఉంది. ఒక పాప ఒక బాబు
రమా దేవి: గృహిణి.

మిగతా వివరాలు.. ఇంకో సారి…

ఇదీ ఇవాల్టి జ్ఞాపకాలు… వచ్చే బ్లాగ్ లో మరిన్ని విశేషాలతో… సెలవు…
అందరికీ విన్నపం ఏంటంటే… ఎప్పుడూ నా సోది కాకుండా.. మీరు కూడా మీ మీ జ్ఞాపకాల్ని నాకు పంపండి. ఈ మైత్రి వనం లో పూయిస్తాను.

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

4 Responses to రాజం పేట చిన్నోడి గురించి..

 1. Dr. Vijayakrishna says:

  Hi Ram,

  Nice introduction to Rajampeta bullodu. Thanks for sharing.

  Vijayakrishna

 2. KALAIVANI says:

  Thanks 4 sharing your views on me and all our friends.
  I want to continue this friendship untill the end of my life.
  Bye have a nice day.

  KALAI VANI

 3. ramakrishna says:

  Thanks 2 vijay n kalaivani.
  we will b frends thro out our life.

 4. Dear Ramakrishna,i remember my self we went4a cinema jayaberi by absenting4the afternoon class in 6th class.Though we hav been caught hold by our teachers while returning4m the movie,but not reported2the H.M.kalyanibai.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s