మన గురువుల జ్ఞాపకాలతో..

ఈ మధ్య ఓ కార్పోరేట్ స్కూల్ లో మా రెండో అమ్మాయి నమ్రత admission కోసం వెళ్ళాను. Receptionist మొదటి ప్రశ్న ” a .c యా? నాన్ a . c యా? ” అని. నా చెవులని నమ్మని నేను మళ్ళీ అడిగాను. మళ్ళీ అదే ప్రశ్న.. తరవాత తెలిసింది a .c లో ఉన్న లాభాలు నాన్ a.c. లో ఉన్న నష్టాలు ఏంటో. చదువుల్లో ఎంత తేడా… మన స్కూల్ లో హెడ్ మాస్టర్, స్టాఫ్ కూర్చునే బిల్డింగ్ లో అక్షరాల తొమ్మిదిన్నర రూపాయలు కట్టిన వైనం గుర్తుకొచ్చింది. ” ఏవీ నాడు కురిసిన హిమ సమూహములు…” అని మనసు లో ఇప్పుడున్న విధానాల పట్ల ఓ నిర్లిప్త మైన ఫీలింగ్.

మన classmates లో ఓ commonality కన బడుతుంది. చిరు ఉద్యోగమైనా..విజయ కృష్ణ లాగ అమెరికా లో ఉద్యోగం లో ఉన్నత శిఖరాలు అధిరోహించినా … అందరిలోనూ సారూప్యాలు… చేసే పని లో నిజాయితి… నిబద్ధత … స్నేహానికి విలువ నివ్వటం… ఇవి అందరిలోనూ ఉన్నాయి. ఈర్ష్యా.. ద్వేషం…లాంటివి లేనే లేవు…బహుశ… ఇవేనేమో… ఇన్నాళ్ళ తరువాత అందరం కలవటానికి సాధ్య పడేటట్టు చేసాయి.
మనం ఇలా ఉన్నామంటే… ఎక్కడో అంతర్లీనంగా మనల్ని దిద్దిన మన గురువుల పాత్ర ఉంది… అలాంటి గురువుల్ని ఓ సారి స్మరించుకుందాం …
గురువులలో నాకు ఆద్యుడు అని చెప్పాలంటే…. రమణ సర్… తను 8th నుండి జనరల్ లెక్కలు చెప్పేవారు. ఎంతో నిరాడంబరుడు… నిగర్వి… మాట తీరు కూడా తను deal చేసే విద్యార్ధి బట్టి ఉండేది. చాలా చతురత ఉండేది మాటల్లో. మొదట.. తను హాస్పిటల్ రోడ్ లో ఉన్న… తరువాత… గిరింపేట పగడ మాను వీధి కి వచ్చేసారు. తనకి రవి, రాజేష్ అని ఇద్దరు అబ్బాయిలు… ఒక పాపా… నేను composite మాథ్స్ తీసుకున్నాను. నాగ భూషణ మ్మ గారు అప్పుడే ఉద్యోగం (1978) లో చేరారు. క్లాసు లో కిట్టా (తను ఇప్పుడు హైదరాబాద్ లో LIC లో officer గ ఉన్నత స్థానం లో ఉన్నాడు ) ఒక్కడే బాగా లెక్కలు చేసేవాడు. కొంత మంది రమణ సర్ దగ్గర ట్యూషన్ కి వెళ్ళే వాళ్ళం. ట్యూషన్ మిద్దె పైన చెప్పేవారు . గోపాల్ (తను ఇప్పుడు టీచర్ గ చిత్తూర్ లో ఉన్నాడు ), కే . కే ., పాల రవి (తను సింగపూర్ లో ఉన్నాడట ) మరి కొంత మంది ట్యూషన్ కి వచ్చేవారు . రమణ సర్ teaching చాల సరళం గాను , స్పష్టం గాను ఉండేది . అప్పుడప్పుడు English కూడా చెప్పే వారు . తను చెప్పిన concepts ఇప్పటికి కొన్ని గుర్తు ఉండి పోయాయి . ఎప్పుడైనా పిల్లలకి ( మా పెద్ద అమ్మాయి సౌమ్య ఇంటర్ లో ఉంది . చిన్న అమ్మాయి నమ్రత ఎనిమిదో తరగతి లో ఉంది ) లెక్కలలో ఏమైనా చెపుతున్నాను అంటే … అది ఆ మహానుభావుడి చలవే … ఆరవ తరగతి లో మన తెలుగు సర్ కృష్ణప్ప గారు చెప్పేవారు .. విద్య దానం ఎంతో గొప్పదని … ఎంతో నిజం కదా …
అంత గొప్ప సర్ జీవితం లో విషాదాలు ఉండటం చాల భాధ గా అనిపిస్తుంది . తన పెద్ద అబ్బాయి … ఎదిగి వచ్చాక cancer తో తిరిగి రాని లోకానికి వెళ్లి పోయాడు . ఆ చివరి రోజులలో … నేను చిత్తూర్ వెళ్ళినప్పుడు సర్ కుటుంబం పడ్డ బాధ చూసాను …

సర్ రిటైర్ అయ్యిన రోజులలో , నేను చిత్తూర్ వెళ్ళాను . తను ఆటో లో వెళ్తూ , నన్ను చూసి ఆగి , తన సన్మానం జరుగుతోంది రమ్మని చెప్పారు . నేను వస్తానని వెళ్ళలేకపోయాను ఆ రోజు . తరవాత కొంత కాలానికే తెలిసింది … సర్ స్వర్గస్తులయ్యారని … సర్ ఏ లోకాన ఉన్న … ఒక్కటి మాత్రం నిజం … తను మన అందరి లోను ఉన్నారు … నేను లెక్కల లో ఏ టాపిక్ చెప్పినా … వెంటనే నాకు సర్ దగ్గర ఆ టాపిక్ నేర్చుకున్న సందర్భం గుర్తు వస్తుంటుంది …
మనిషి ఎంత కాలం జీవించడం కాదు … ఎంత మంది హృదయాల్లో జీవించి ఉన్నారు అన్నది ముఖ్యం … ఆ విధంగా అయితే … సర్ ఎప్పటికీ చిరంజీవి గానే ఉంటారు … మనం ఆ గురువుకు ఇదే మనం అర్పించ గలిగే అశ్రు నివాళి .

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

4 Responses to మన గురువుల జ్ఞాపకాలతో..

 1. Dr. Vijayakrishna says:

  Hello Ram,

  I used to go to Ramana Sir tution. Yes, he was a “GREAT TEACHER”.

  “A good teacher is like a candle – it consumes itself to light the way for others”

  We will definitely miss him.

  Thanks for this heartbreaking article:-<

  Vijay

 2. mhsgreamspet says:

  Thank you vijay for your valuable feelings

 3. I hav no hesitation2say that i hav neglected the advise given by our Ramanasir2improove my handwr iting.But proud 2 b a student of Ramanasir&sustaining in my profession.this is for the day.urs Prasanna.

 4. MUSALAGARI PRASANNA KUMAR says:

  Dear friends,
  we are planning to start an association in near future.Due to pausity of time and pressure of work,i could not secure the byelaws for the registration of the society of our old students association under the society Registration Act.I’ll secure the said byelaws and intimate to you all for your approval within a fortnight.This is for your kind information please excuse me for delay in registration of our students association.I wish good wishes to all our friends on the eve of “RAKHI POORNIMA”.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s