ఏ కొటాయి లో ఏ సినిమా…..?

ఏందీ నా అట్లా మూతి పెడితివి… కొటాయి అంటే తెలీదా… అదేనా … సినిమాలు ఆడతాయే ఆ ప్లేసు అన్న మాట.

ఈ రోజు ఆనాటి సినిమాల లోకి తొంగి చూద్దాము…
మనం చదివే సమయం లో… రామ రావు, నాగేశ్వర రావు గారి సినిమాలు బాగా వచ్చేవి.. నాకు అత్యంత ఇష్టమైన బాలు గాన గాంధర్వం అప్పుడే ఊపు అందు కొంటోంది. మనం sixth లో ఉన్నప్పుడు… శ్రీనివాస (దర్గా దగ్గర ఉన్న కొటాయి…) లో అడవి రాముడు వచ్చింది.. అదే కొటాయి లో తరువాత యమ గోల , వేటగాడు వచ్చాయి. అన్నీ మూడు సార్లు చూసాను. ఈ సినిమాల లో హీరో బెల్ బోట మ్ పాంట్స్ నాకు బాగా ఇష్టం. కాలేజీ కి వస్తే తప్ప అవి వేసుకొనే వీలు లేదు.. అందుకనే… కాలేజీ లో బెల్ కాదు. ఏకం గ ఎలెఫంట్ బోట మ్ పాంట్స్ కుట్టించు కున్నాను.. చంద్రా tailor దగ్గర. మన వాళ్ళు … రోడ్లు ఊడ్చ టానికి అలాంటి ప్యాంటు వేసుకున్నానని ఏడిపించే వారు.. వివేకానంద కొటాయి మా ఇంటికి దగ్గర గ ఉండేది. అందులో ఎప్పుడు… తమిళ పడం ఆడుతూ ఉండేవి. అందునా.. ఎం. జీ. ఆర్. సినిమాలు.. వేటక్కరాన్, రిక్షా క్కారాన్ , అడిమై పెణ్ లాంటివి ఆదేవి. మళ్ళీ మళ్ళీ.. అవే సినిమాలు ఆడేవి. ఈ ట్రెండ్ 15 years వరకూ ఉండేది. ఒక్క ఉలగం సుట్రుం వాలి బన్ (తెలుగు లో లోకం చుట్టిన వీరుడు) మాత్రం శ్రీనివాస లో వచ్చింది. అంత సింగపూర్ మలేసియా లో తీసారు. నేను భాష భేదం లేకుండా ఈ సినిమా కూడా మూడు సార్లు చూసాను.
చెరువు దగ్గర… వెంకటేశ్వరా ఉండేది. అందులో ఎక్కువగా నాగేశ్వర రావు, శోభన్ బాబు సినిమాలు వచ్చేవి. బంగారు బాబు, శ్రీరామ రక్ష అందులోనే చూసాను. అదే రోడ్డు లో ముందు కెళ్తే ప్రతాప్… అందులో యుగ పురుషుడు, ఇంటింటి రామాయణం, లాంటి సినిమాలు చూసాను. అది బాగా పాత బడతంతో… ఈ మధ్యనే demolish చేసారు. ఇంకోచం ముందు.. ఎం. ఎస్. ఆర్. ఉంది. అందులో.. మొదటి సినిమా యశోద కృష్ణ..ఈ టాకీస్ లో రామకృష్ణులు అనే సినిమాకి మూడు సార్లు టికెట్ కోసం విఫల యత్నం చేసాను. ఇప్పుడు మనం ఆర్కాట్ స్వీట్ షాప్ ఉన్న సందులో తిన్న గ వెళ్తే… గురునాథ.. ఇది కూడా పాత టాకీస్. ఇక్కడ, ప్రతి ఆది వారం ఇంగ్లీష్ సినిమాలు వేసే వారు. నేను మరీ చిన్నప్పుడు… ఈ టాకీస్ లో సినిమాకు వెళ్లి, నీళ్ళకని బయటికి వెళ్లి… ధారపోయాను… (???) మళ్ళీ మా అన్నయ్య బయటికి వచ్చి నన్ను లోపలకి తీసుకెళ్ళాడు.
గురునాథ పక్కన ఓ మిల్క్ పార్లర్ ఉండేది . అందులో బసంది పాల కోవా famous . ఆ స్థలం లో ఇప్పుడు రెండు కొత్త కొటాయిలు వచ్చాయి. ఇంకాస్త ముందుకెళితే వచ్చేదే ప్రమీల టాకీస్. ఇది మన classmate ప్రమీల వాళ్ళది అనుకునేరు… అలాంటిదేమీ కాదు. ఈ టాకీసు అప్పటికే బాగా పాతది. ఇందులో మాయ బజార్, జగన్మోహిని లాంటి సినిమాలు చూసాను. మీకు ఓపిక ఉండి ఇంకా ముందు కి సంత పేట వైపు వెళ్తే… నీవా నది బ్రిడ్జీ దగ్గర లక్ష్మీ టాకీసు ఉంది. ఇందులో కూడా పాత సినిమాలు వచ్చేవి. భార్య భర్తలు సినిమా ఇందులోనే చూసాను. ఈ టాకీసు దగ్గరే… రామ విలాస సభ ఉంది. ఈ మధ్య ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీ రావు గారు ఓ పత్రిక లో ఇక్కడ జరిగిన సాంస్కృతిక కార్య క్రమాల గురించి చెప్పారు. ఎన్నో తెలుగు భాష కి అద్దం పట్టిన నాటకాలు, కచేరీలకు సాక్ష్యం ఈ రాం విలాస్ సభ. నేను చాల కాలం ముందు చూసాను… ఆనాటి ప్రాభవాన్ని చెప్ప లేక మూగ గ రోదిస్తున్న ట్లు అనిపించింది ఈ భవనం. ఇంకో మూల, అంటే కట్ట మంచి దగ్గర అప్పుడే జ్యోతి టాకీసు కట్టారు. అందులో… భక్త కన్నప్ప మొదటి సినిమా.
ఈ జ్ఞాపకాలు మీతో పంచు కుంటూ ఉంటె… మన ఏడవ తరగతి లో మన హిందీ మేష్టారు బాల సుబ్రహ్మణ్యం గారు చెప్పిన మేరా బచ్పన్ ఫిర్ న ఆయేగి… అని సముద్ర కుమారి చౌహాన్ పద్యం గుర్తు వస్తోంది.. అప్పుడు అర్థమయ్యేది కాదు… బాల్యం అందులోని స్మృతులు ఎంతటి తీయని బాధనిస్తాయో..
ఈ కొన్ని పదాల ద్వారా… మిమ్మల్ని ఆ రోజుల్లోకి తీసుకు వెళ్లి ఉంటె… నా ప్రయత్నం సఫలమైందని భావిస్తాను..

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

One Response to ఏ కొటాయి లో ఏ సినిమా…..?

  1. Dear Ramakrishna,in this context if my memory goes right while indiramadam teaching a lesson in social studies2hav better under- standing,advised us2see jayabheri cinema in sreenivasa talkies.Almost all of our by absent ing afternoon classes went4the movie.while returning4m the movie we are caught by Anasuya madam,Indiramadam&sakunthala madam.Though they hav noted our names that was not brought2 the notice of our then Headmistrs Ms.kalyanibhai.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s