పాటల పల్లకి లో కొంత సేపు..

మన 6 వ తరగతి అంటే 1976 ప్రాంతం లో సినిమా ల లో ఎస్. పీ . బాలసుబ్రమణ్యం శకం ఆరంభం అవుతూన్నది. గురునాథ లో మహమ్మద్ బిన్ తుఘ్లక్ (నాగ భూషణం నటించినది) వచ్చింది. అందులో మొదటి సారి బాలు గారిని చూసాను. చాల energetic గ ఉండేది తన మ్యూజిక్ concerts తన పాటలు అప్పటినుంచే చాల ఇష్టం. తన గానం లేత కొబ్బరి తిన్నంత కమ్మ గ ఉంటుంది. మామ చంద మామ …. , ఏ దివిలో విరిసిన పారిజాతమో…., గువ్వలా ఎగిరి పోవాలి…. లాంటి పాటలలో విన్న తన స్వరం… ఒక్క సారి గ అడవి రాముడు లో “ఆరేసుకోబోయి… ” పాట వినే సరికి… నమ్మలేక పోయాను మొదట… తన గాత్రం స్వర్గీయ ఎన్. టీ. ఆర్ కి సరి పొయే విధం గ మలుచు కున్న తీరు అత్యద్బుతం.. అంత వరకు కృష్ణ, చంద్ర మోహన్ కి మాత్రమే సరి పోతుందని అనుకున్న తన గాత్రం లో అంత వైవిధ్యం ఉందని అప్పుడే తెలిసింది. ఒకే సినిమా లో … “అనుభవించు రాజ..” అని ఓ పాట ఎన్. టీ. ఆర్ కి “ముత్యాలు.. వస్తావా..?” అని అల్లు కి ఒకరే పాడారంటే నమ్మ లేక పోయాను. తరవాత.. ఏ యన్ ఆర్ కి కూడా సరి పోయే విధంగా… ఏడంతస్తుల మేడ (ప్రతాప్ లో వచ్చింది) లో తన గాత్రం విన్నాక… అర్థమైంది.. ఇలాంటి గాయకులు అరుదు అని.. ఆ తరవాత… రంగనాథ్ కి పాడిన ఇంటింటి రామాయణం, అందమే ఆనందం (రెండూ ప్రతాప్ లోనే) పంతులమ్మ (ప్రమీలా లో) వచ్చిన పాటలు నాకు బాగా నచ్చాయి. బాలు సత్యం సంగీతం లో పాడిన పాటలు.. అన్నీ బాగుండేవి. ఎదురీత (MSR లో) లో ” తొలి సారి …”, “ఎదురీత కు అంతం లేదా… ” (ఈ పాట అమానుష్ అనే హిందీ మాతృక లో “దిల్ ఐస కిసినే మేర తోడా…” ట్యూన్ లో ఉంటుంది) మంచి పాటలు. ఈ సినిమా లో ఎన్. టీ. ఆర్ నటన చాల sober గ ఉంటుంది. “అభినవ శశి రేఖవో”…, “దారి చూపిన దేవత” (జేసుదాస్ పాట ) ,… తులాభారం(శ్రీనివాస లో) లో ఈ రాధకు నీ మీద ప్రాణం… రాధ హృదయం మాధవ నిలయం… మంచి సాంగ్స్. ఆ పాటల లో స్పష్టత ఉండేది. ఉచ్చారణ సరిగ్గా ఉండేది. ఉదాహరణకి… హృదయం అన్న పదం సుశీల గారి స్వరం లో వినండి. కరెక్ట్ ఉచ్చారణ తో ఉంటుంది. అలాగే… మనం ఉంది అన్న పదం లో “మ” శబ్దం తో అంటాం. కాని కరెక్ట్ గ ఉచ్చారణ ఉన్ది అని పాడాలి. దీన్ని గమనించాలంటే…అన్నదమ్ముల సవాల్ (గురునాథ లో) లోని పాట “నీ రూపమే … నా మది లోన తోలి దీపమే..” అన్న పాటలో “ఆశలు లేని నా గుండెలోన అమృతం కురిసింది లే ” అన్న చరణం లో కురిసింది అన్న పదం ఉచ్చారణ గమనించండి.ఇలా ఎన్నెన్నో… ఇంత వివరం గా ఎందుకు రాస్తున్నాను అంటే.. పర భాష గాయకులతో ప్రస్తుతం వస్తున్న పాటలలో… ఉచ్చారణ సరిగ్గా లేదు… పాట ఫీల్ లో మమేకం కావటం ఉండదు. అన్ని రంగాలలో పర భాష కళాకారుల చేరిక తో.. తెలుగు తనం కోల్పోతున్నట్లు అనిపిస్తుంది. భవిష్యత్తు లో పాటలు కూడా ఏదైనా సాఫ్ట్ వేర్ సాయంతో ఎవరైనా రాసేస్తే… మనకు ఇప్పుడున్న “సిరి వెన్నెలలు”, “చంద్రుళ్ళు” కూడా ఉండరేమో…

ఈ తరం మనిషి (వెంకటేశ్వర లో) ఇచ్చేసా నా హృదయం తీసుకో… అన్న పాట శోభన్ జయప్రద ల సాంగ్ చాల హృద్యంగా ఉంటుంది. శోభన్ బాబు పాటలు మల్లె పూవు (ప్రమీల లో ) లో ” ఓహో.లలితా…”, “మరు మల్లియ కన్నా తెల్లనిది మకరందము కన్నా తీయనిదీ మన ప్రణయం అనుకుని మురిసితిని.. అది చివరకు విషమని తెలిసినది…” అన్న భగ్న ప్రేమికుడి పాటలో “సఖియా…” అంటూ వచ్చే ఓ ఆలాపన … భావానికి అందనిది. ఆ పాట బాలు గళం లో వింటే.. హీరో ఫీల్ ని చూడనవసరం లేదు..

ఇళయ రాజ పాటలు.. ఎక్కువ గ తమిళం లో వచ్చినా.. తెలుగు లో డబ్ అయినవి చాల ఉన్నాయి.. ఎం. ఎస్. ఆర్ లో వచ్చిన “వయసు పిలిచింది” లో “ఇలాగే.. ఇలాగే.. సరాగమాడితే..”, పదహారేళ్ళ వయసు (ప్రమీల లో) “సిరిమల్లె పూవా..”, రామ చిలుక (ప్రమీల లో) “రామ చిలుకా .. పెళ్లి కొడుకెవరే…” లాంటి పాటలు.. ఓ అద్భుత లోకం లో విహరింప చేస్తాయి. పదహారేళ్ళ వయసు కి తమిళ్ లో ఇళయ రాజ మ్యూజిక్ ఇచ్చారు.
ప్రమీల లో వచ్చిన అంతు లేని వింత కథ లో “తాళి కట్టు శుభ వేళ…” అన్నఅ పాట మన వూర్లో ఎక్కడ వెళ్ళినా వినేవాళ్ళం. నాకు అందులో నచ్చిన సాంగ్ మాత్రం.. “కళ్ళలో ఉన్న నీరు కన్నులకే తెలుసు…”.

స్నేహం పై కూడా ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి. బాపు తీసిన స్నేహం (గురునాథ లో ) లో ” నువ్వుంటే వేరే కనులెందుకు…”, స్నేహ బంధము (వెంకటేశ్వరా లో) లో “స్నేహ బంధము .. ఎంత మధురమూ..”, ఏ. ఎన్. ఆర్ పాట (సినిమా గుర్తు లేదు) “ఆనాటి ఆ స్నేహం ఆనంద గీతం.. ఆ జ్ఞాపకాలెంత మధురాతి మధురం” లాంటివి నాకు నచ్చినవి.

ఇలా చెపుతూ పోతే ఎన్నో సంగతులు… కాని ఈ పాటలన్నీ మన వూరి backdrop లో… మన జ్ఞాపకాల మధ్య గుర్తు ఉండిపోయాయి. 75 పైసల టికెట్ నుండి 2 .౩౦ రూపాయల అన్ని టికెట్లు కొని అన్ని క్లాసెస్ లోను చూసాను సినిమాలను. అప్పుడు లేని ఫీలింగ్ ఇప్పుడు సింహావలోకనం చేసుకుంటే కలుగుతూ ఉంటుంది… తోడిన కొద్ది ఎక్కువ అవుతూందీ ఆ జ్ఞాపకాల ఊట.. ఆ పాటలు ఇప్పుడు నాకు చిర కాల నేస్తాలు..

Advertisements
This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

One Response to పాటల పల్లకి లో కొంత సేపు..

 1. gayathri devi and kalaivani says:

  Both of us visited our website today.
  All the shared things are nice. But
  both of us feel very much as we are
  unable to see our photographs on the
  website. Along this you can provide
  ours (Those who are sitting)
  We’ll feel happy. Memu edustunnamu.
  photo chusaka navvutam. Bye Cheers
  Gayathri and Kalaivani

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s