నాటి వెన్నెల మరకలు

అప్పుడప్పుడూ… తెల్లవారి జామున మెలకువ వస్తుంది… నా కంటి ముందు సాక్షాత్కరించే అలనాటి వెన్నెల మరకల్ని పంచుకోటానికి నా నేస్తాలు మళ్ళీ దొరకరు కదా అనిపిస్తుంది… కాని ఈ రోజు మీ అందరినీ ఇలా కలుస్తూ… నాటి జ్ఞాపకాలను పంచుకోటంలో ఎంతో సంతృప్తి… ఈ రోజు మనం చదివే రోజుల్లో ఉన్న కొన్ని landmarks ని జ్ఞప్తికి తెచ్చుకుందాము.

మన గిరింపేట లో ఉన్న landmarks
లతా కేఫ్
ఇది బాగా రద్దీగా ఉండే హోటల్. కేరళ నుంచి వచ్చిన నాయర్ కుటుంబం దీనిని నడిపేది.. సాదా దోస అప్పుడు 35 పైసలు ఉండేది. నా స్టాండర్డ్ మెను రెండు ఇడ్లి ఒక వడ. ఈ హోటల్ లో సూరి ని వాళ్ళ నాన్న తీసుకొచ్చి tiffen ఇప్పించే వాడు. Owner తమ్ముడు పురుషోత్తం నాయర్ నాకు అనతి కాలం లోనే బాగా పరిచయమయ్యాడు. తను కొంత కాలం తరువాత ఆహ్మెధాబాద్ లో ఉద్యోగం వచ్చి వెళ్లి పోయాడు. ఈ హోటల్ మొదట వెల్లూర్ రోడ్ లో ఉండేది. తరువాత.. పాత collectorate దగ్గరకి షిఫ్ట్ అయ్యింది. రాను… రాను.. ఆ నా టి ప్రాభవం కోల్పోయింది. నేను చిత్తూర్ వెళ్ళినప్పుడు hotel owner ని పలకరిస్తుంటాను. ఈ మధ్య కాలం లో కనిపించ లేదు. ఆరోగ్యం సరిగా లేదు.. అని విన్నాను.

రమేష్ జనరల్ స్టోర్స్
ఇది మన స్కూల్ హెడ్ మాస్టర్ రూం కి వెనక ఉన్న బిల్డింగ్ లో వెల్లూరు రోడ్ పై ఉండేది. మన నోట్ బుక్స్, పెన్నులు… అన్నీ ఇక్కడే కొనే వాళ్ళం. ఇప్పుడు.. ఈ స్థలం లో చిన్న హోటల్ వచ్చింది. మన పి. ఎస్. బాబు (తను ఇప్పుడు లండన్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గ ఉన్నాడు. తను నాకు స్కూల్ లో నే కాదు.. డిగ్రీ లో కూడా సహాధ్యాయి ), ప్రసన్న కుమార్ (తను చిత్తూర్ లో న్యాయ వాది గ ఉన్నాడు. తన బెటర్ హాఫ్ మన స్కూల్ లో టీచర్ గ ఉండేవారు.) ఇల్లు ఈ స్టోర్స్ కి ఎదురు గా ఉండేవి.

మోహన సైకిల్ స్టోర్స్
ఇది మన క్లాసు మేట్ ఎం. కే. మోహన్ సైకిల్ స్టోరే. తన తమ్ముడు కన్నయ్య కూడా మన క్లాసు మేట్. తను నాకు సెవెంత్ క్లాసు లో బాగా క్లోజ్. మంచి మనసున్న వ్యక్తి. ఎనిమిది లో చేరాక… పుస్తకాలు కొనటానికి డబ్బుల కోసం రామకృష్ణులు సినిమా కి ఎం. ఎస్. ఆర్. లో టికెట్స్ అమ్మి డబ్బు ప్రోగు చేసి కొనుక్కున్నాడు. కాని కొన్ని పరిస్థితుల వలన.. చదువు ఆపి.. రెండు సైకిల్ ల తో షాప్ పెట్టాడు 1978 లో. నేను చాల ప్రయత్నించాను తను చదవాలని. తను స్వశక్తి ని నమ్ముకున్న వ్యక్తి. తను అంచెలంచెలుగా అభివృద్ది చెంది గిరిం పేట చౌక్ లో షాప్ పెట్టాడు. మన వాళ్ళు Hour సైకిల్ ని తన దగ్గరే అద్దెకు తీసుకునే వాళ్ళం. నేను వెళ్ళిన ప్రతి సారి.. నన్ను ఓ చిన్న స్టూల్ పై కూర్చో పెట్టి.. పాలు లేక టీ తెప్పించే వాడు. పెద్ద అయ్యాక కూడా .. తను ఖాకి నిక్కరు .. కలర్ బనీను వేసుకుని సీదా సాదా గ ఉండేవాడు. ఒక సారి.. ఏదో సందర్భం లో నేను నాకు అదృష్టం లేక ఏదో రాలేదని చెప్పాను తనకి. తను నింపాదిగా నా వైపు చూసి… ఓ సైకిల్ ఛైన్ ని ఓ స్టూల్ మీద పెట్టి… దానిని చూపిస్తూ.. “చూడు.. ఆ ఛైన్ ని అక్కడ పెట్టి.. అది అక్కడే ఉందే .. నా చేతిలో లేదే అని బాధపడటం ఎందుకు.. ఏ దేవుడు తెచ్చి ఇవ్వడు.. నేను అందుకోటానికి ప్రయత్నిస్తే తప్ప అది నా చేతిలో ఉండదు” అని.. అలా చూస్తూండి పోయాను కాసేపు.. ఎవరైనా నిరాశ పడితే నేను ఈ సంఘటనే చెపుతుంటాను. తన గురించి ఇంత రాశాక.. మీకో చేదు నిజం చెప్పాలి.. మోహన్ ఇప్పుడు మన మధ్య లేడు… నేను చూసిన 3 నెలలకు తను మనను విడిచి వెళ్లి పోయాడు.. ఆ వార్త తెలిసిన రోజు చాలా.. చాల బాధ పడ్డాను…

చంద్ర టైలర్స్
రెడీమేడ్ దుస్తులు లేవు ఆ కాలం లో. అందరం క్లోత్ తీసుకుని చంద్ర టైలర్స్ దగ్గర కుట్టించుకునే వాళ్ళం. తన షాప్ గిరిం పేట్ చౌక్ లో ఉండేది. తన అమ్మాయి చంద్రిక (అనుకుంటాను) సినిమాల లో పని చేస్తున్నారని విన్నాను.

రాయల్ డ్రై క్లీనర్స్
చౌక్ ధాటి ముందు కి వెళ్తే ఎడమ వైపు ఓ హోటల్ పక్కన ఉండేది. వీరి షాప్ వెనుక శ్రీధర్ రాజు (తను బీ. జెడ్ లో చదివే వాడు. ఇప్పుడు ఎల్.ఐ. సి. హైదరాబాద్ లో పని చేస్తున్నాడు) ఇల్లు ఉండేది. బట్టల ఇస్త్రి ఇక్కడే చేయించు కొనే వాళ్ళం. దుష్టుడు రామచంద్ర నా షర్టు పై ఇంకు పోసాక ఇక్కడే మరక పోగొట్టమని ఇచ్చా.

సుధాకర్ హోటల్.
ఈ పేరు కాదు హోటల్ కి. కాని ఇది మనతో పాటు చదివిన డీ.జే సుధాకర్ వాళ్ళ హోటల్. మన స్కూల్ గేటు కి పక్క కి ఉండేది. (ఇప్పుడూ ఉంది) ఇక్కడ రాతి చప్టాలు.. చెక్క tables వేసి ఉండేవి. ఇక్కడ నాన్ వెజ్ చాల ఫేమస్. పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ మాత్రం ఉంటుంది. బాగా డబ్బున్న రోజుల్లో.. లతా కేఫ్ బదులు.. ఇక్కడే నా టిఫన్ లాగించే వాడిని.

ఆర్కాట్ స్వీట్ స్టాల్

ఈ పేరు తలుచుకుంటేనే లాలా జాలం స్రవిస్తుంది. ఆ కాలం లో ఏ సందర్భానికి ఐనా ఇక్కటి స్వీట్స్ కొనాల్సిందే. నేను మొదుల్ తేది (ఒకటో తేది) ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాడిని. జీతాల రోజు కాబట్టి… ఆ రోజు తప్పకుండా నాకు ఓ అర కేజీ స్వీట్ మా నాన్న తెచ్చేవారు. (నా favorite జాంగిరీ అప్పట్లో. ఇప్పుడు కాదు) దీపావళి కి స్పెషల్ స్వీట్ డబ్బాలు అమ్మే వారు. ఇది అప్పటి బస్సు స్టాండ్ పక్కన మంచి రద్దీ ఉన్న రోడ్ లో ఉండేది. ఇప్పటికీ ఆ రోడ్ అంతే బిజీ గ వుంటుంది. ఆ షాప్ స్థానం లో చాల షాప్స్ వచ్చి వెళ్ళిపోయాయి. ఈ షాప్ ని ఇంతకు మునుపు ఉన్న గ్రాండ్ హోటల్ కి ఎదురుగ మార్చారు. కాని ఆ రోజుల్లో ఉన్న liveliness ఇప్పుడు మిస్ అవుతాము . ఈ షాప్ ఉన్న సందు లోనే పూలు, పళ్ళు అమ్మేవారు. ఇప్పటికి అదే ట్రెండ్ ఉంది.

లక్ష్మి సరస్వతి మిల్క్ సెంటర్
ఇది గురునాథ పక్క న ఉండేది. ప్రస్తుతం మునుపటి షాప్ కి ఎదురుగ ఉన్న షాప్ లో మారారు. బాసంది, చిత్తూర్ పాల కోవా ఇక్కడే దొరుకుతాయి, గురునాథ కి సినిమా వెళ్తే.. ఇక్కడ బాసుంది కాని రోజ్ మిల్క్ కాని తాగే వాళ్ళం. ఇప్పటికి నేను ఊరు వెళ్ళేటపుడు కోవా కొనకుండా వెళ్ళాను. మా పెద్ద అమ్మాయి కి ఈ కోవా ఇష్టం. ఇక్కడే శోభ paradise బట్టల షాప్ ఇప్పటికీ ఉంది.

పద్మశ్రీ బుక్ స్టోర్
ఏమైనా టెక్స్ట్ బుక్స్ లేక guides కాని కొనాలంటే.. ఇక్కడికి వచ్చే వాళ్ళం. ఇది మద్రాస్ స్టూడియో పక్కన హై రోడ్ కి వెళ్ళే దారిలో ఉండేది. ఈ షాప్ owner ప్రసాద్ గారు మాకు ఇంటర్ లో ఫిజిక్స్ చెప్పేవారు. విజయ కృష్ణ, రామ చంద్ర, ప్రసన్న, నేను కన్నన్ college లో ఇంటర్ కూడా కలిసి చదివాము. US లో ఉన్న రఘురాం వైఫ్ శైలజ కూడా Bi PC లో మాకు బాచ్ మేట్

ఎర్రయ్య అంగడి
ఆ కాలం లో హాట్ న్యూస్ తెలుసుకోవాలంటే ఇక్కడికి రావాల్సిందే. రామాలయం వీధి అంటే… లక్ష్మి theatre కి వేల్లెద్ దారి లో అన్ని రోడ్ లు కలిసే చోట ఈ షాప్ ఉండేది. అన్ని పత్రికలు, న్యూస్ పేపర్స్ ఇక్కడే దొరికేవి. ఎర్రయ్య గారు ఓ black బోర్డు మీద ముఖ్య మైన వార్తలు రాసే వారు. సాయంత్రం అయితే చాలు… అందరికి ఈ ప్లేస్ లో కలవటం అలవాటు పెద్ద వాళ్లకు.. (మాకు తీరిక ఎక్కడిది.. ఆటలకే టైం సరిపోయేది కాదు) ఎర్రయ్య గారు, వారి కుటుంబ సభ్యులు ఈ షాప్ నిర్వహించేవారు. ఈ బోర్డు లో ఏదైనా న్యూస్ వస్తే.. అది చాల ఖచ్చితమైన వార్త అని భావించే వారు.

ఇంకా ఎన్నో చెప్పుకో తగ్గవి ఉన్నాయి… మీరు కూడా మీ కామెంట్స్ లో మిగతా ల్యాండ్ మార్క్స్ ని స్పృ శించమని మనవి.
ఇంకో ఆనందకరమైన విషయం ఏంటంటే… మన సైట్ కి సందర్శకుల సంఖ్య పెరుగుతోంది. మీలో ఎవరికైనా రాయలన్పిస్తే..నాకు చెప్పండి.. మీకు రాసేందుకు user నేమ్ ఇస్తాను.

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s