టెక్నాలజీ రక్షతి రక్షితః

ఎప్పుడూ “మా కాలం లో…” అంటూ క్లాసులు పీకటం కంటే ఒక్కో సారి ఇప్పుడున్న విధానాలని మన శైలి కి అనుగుణంగా ఎలా మార్చుకోవచ్చో ఆలోచించాలి. మనం చదువుకునే రోజుల్లో రేడియో ఒక్కటే (సినిమాల తరువాత) మనకు కాల క్షేపానికి ఉపయోగ పడేది. బుధ వారం, శుక్ర వారం రాత్రి 8 .30 కి వచ్చే చిత్ర సీమ/ లహరి లో వచ్చే పాటల కోసం ఎదురుచూసే వాళ్ళం. రాత్రి 7 05 కి వచ్చే వార్తలు సాయంత్రం 6 .40 (??) కి వచ్చే ప్రాంతీయ వార్తలు అందరికీ ముఖ్యం. రాత్రి 9 కి ఇంగ్లీషు న్యూస్ .. బుధ వారం బినాకా గీత మాల.. సాయంత్రం 3 .15 కి రేడియో సిలోన్ లో మీనాక్షి పున్నుదురై ప్రెసెంట్ చేసే పాటల ప్రోగ్రాం… ఈ గుర్తులు ఎంతో ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. ఇప్పుడు కుప్పలు తెప్పలు గా ఉన్న చానల్స్ వలన… ప్రోగ్రాం కోసం ఎదురు చూడటం లో ఉండే అనుభూతి ని కోల్పోయాం. ఛానల్ సర్ఫింగ్ వలన ఏ ప్రోగ్రాం పూర్తి గ చూడం..

మొబైల్ ఫోన్. ఇంటర్నెట్ లాంటి టెక్నాలజీ ల వలన మన జీవన విధానాలు మారినా… వీటిని సరైన దిశ లో ఉపయోగించుకుంటే.. మంచిదే. ఉదాహరణకు.. గత సంవత్సరం మనం అందరు కలుసుకోవటానికి టెక్నాలజీ ఎంతో ఉపయోగపడింది. సుమారు గ 60 మంది మిత్రులు.. మళ్ళీ జీవితం ఓ చూడమేమో అనుకున్న వాళ్ళు… అదీ మన గురువుల సమక్షం లో కలుసుకో గలిగాము. మన అందరికి sms రామన్ గ సుపరిచితుడైన పట్టాభి గ్రూప్ sms ల ద్వార అందరిని సమన్వయ పరచటం, మంచి సందేశాలతో ఉత్తేజ పరచటం టెక్నాలజీ వలననే సాధ్య పడింది.

బెంగళూరు లో ఉన్న మన ఫ్రెండ్స్ ని కనుక్కోటం యు. ఎస్. లో ఉన్న నాగార్జున (తను కన్నన్ లో చదివే వాడు. మా ఇంటికి దగ్గరలో ఉండేవాడు. తను మా ఇంట్లో సుపరిచితుడు.) ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో బాటు ఇంటర్నెట్ లో వెదకటం ద్వార సాధ్యపడింది.

ఇప్పుడు ఎవరికీ బోర్ కొట్టిన వెంటనే మొబైల్ లో మన ఫ్రెండ్స్ తో మాటలాడుతూ ఉంటారు. ఈ మధ్య ఓ సారి… లవ కుమార్ నుండి ఫోన్ వచ్చింది. తను రైల్వే లో లోకో పైలెట్ గ పని చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు బిజీ గ ఉండే తనకి కొంచం ఖాళి దొరికింది వెంటనే తను ఫోన్ చేసాడు. ఎందుకో మాటలాడాలని అనిపించిన్దన్నాడు. మొబైల్ లేకుంటే ఇది సాధ్య పడేది కాదేమో.

ముప్పై ఏళ్ల తరువాత మనం ఇలా మళ్ళీ ఆ రోజుల్లో జీవించటం చాల అరుదైన అదృష్టం గానే భావించాలి. టెక్నాలజీ ని నేను వ్యతిరేకించినా, మనం కలుసుకోటానికి మొబైల్ టెక్నాలజీ ఉపయోగపడ టాన్ని కాదనలేను. అలాగే.. ఇప్పుడు ఈ వెబ్సైటు లో మనం ప్రపంచం అన్ని వైపులనుండి కలుసుaకుంటూ ఉండటం కూడా టెక్నాలజీ పుణ్యమే. అతి సర్వత్ర వర్జయేత్ కాబట్టి… కొత్త పుంతలు.. విపరీత ధోరణులు పోతున్న టెక్నాలజీ ని సరైన అవసరానికి మాత్రమే వాడుకో గలిగాం మనం.

ఈ కాలం తో పాటు నడుస్తూ ఆనాటి జీవన పరిమళాన్ని ఆస్వాదిం చటంలోనే మాధుర్యం ఉంది.ఈ రోజు తెలుగు భాష దినోత్సవం సందర్భం గ ఈ భాష కి కొత్త ఊపిరులూదాలని అందరికీ మనవి.

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s