ఆ పాత(ట) మధురాలు…

మన వూళ్ళో తమిళ్ ప్రభావం ఎక్కువ గ ఉండటం వలన.. ఎక్కువ గ తెలుగు లో డబ్ అయ్యిన సినిమాలు అందులోని పాటలు బాగా హిట్ అయ్యేవి. కొన్ని కన్నడ సినిమాల సంగీత ప్రభావం కూడా వుండేది. అలాంటి కొన్ని పాటల సమాహారం ఈ ఆర్టికల్. ఈ శీర్షిక పై మన పీ. ఎస్. బాబు అయితే బాగా రాయొచ్చు. తనకి తమిళ్, తెలుగు పాటల మీద సమానమైన చక్కని అభినివేశం ఉంది. తను కూడా కామెంట్స్ ద్వార కొన్ని మంచి పాటలు మనతో పంచుకుంటాడని ఆశిస్తున్నాను. నాకు బాగా నచ్చిన సంగీత దర్శకులలో సత్యం, ఇళయరాజా, రాజన్-నాగేంద్ర, ఎం.ఎస్. విశ్వనాధన్, ఉన్నారు. ఇళయరాజా పాటలు నాకు ఎప్పటికీ మరువలేనివి.

అప్పట్లో వచ్చిన చిత్రం రామచిలుక తమిళ్ లో అన్న క్కిళి అని వచ్చింది. అందరు “రామచిలుకా పెళ్లి కోడుకెవరే …మాఘ మాసం మంచి రోజు.. మనువాడే పెళ్లి కోడుకెవరే..”అని పాత పాట వినివుంటారు. మనం మాత్రం “అన్నక్కిలి ఒన్నత్తేడుధే …” అనే తమిళ్ పాట అదే ట్యూన్ లో వినే వాళ్ళం. నాకు ఈ పాట వింటే మాత్రం మన వూళ్ళో ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎంతో స్మూత్ గ ఉంటుంది ఈ ట్యూన్. కావాలంటే ఓ సారి ఈ పాట వినండి.

పుదియవార్ పుగళ్ అనే సినిమా లో “వాన్ మేఘం గలే…” అన్న పాట తెలుగు లో “ప్రేమ బృందావనం… పలికేలే స్వాగతం.. “ (సినిమా గుర్తు ఇల్లె… ) ఫ్లూట్ ప్రధానంగా మ్యూజిక్ ఉంటుంది. ఈ పాట వింటూ ఓ సారి కళ్ళు మూసుకోండి… మీరు గిరింపేట లో లేకుంటే నన్నడగండి.

ఆ రోజుల్లో కమల్ హసన్ సినిమా “కళ్యాణ రామన్” (తెలుగు లో కళ్యాణ రాముడు) లో ” కాదల్ వందిరిచ్చి.. ఆశయిల్ వోడి వందే…” అని మలేసియా వాసుదేవన్ (అనుకుంటాను) పాడిన పాట సూపర్ హిట్. మనం అప్పుడు సెవెంత్ లో ఉన్నామనుకుంటాను. ఈ సినిమా లో కమల్ డబల్ action . కమల్, రజని ల combination లో వచ్చిన “వయసు పిలిచింది”, “అందమైన అనుభవం” పాటల పరం గా బాగుంటాయి. అందులో నాకు నచ్చిన పాటలు “ఇలాగె …ఇలాగె …సరాగమాడితే…వయ్యారం …ఈ యవ్వనం …ఊయలూగునే “అన్న పాట మెలోడి పరంగా బాగుంటుంది. ఫాస్ట్ బీట్ నచ్చే వాళ్లకి “హలో మై రీట …ఏమైంది నీ మాట …పాడేవు సరి కొత్త పాట …మారింది నీ బాట” బాగుంటుంది. ఈ పాట తమిళ్లో “ఎన్నడి మీనాచ్చి …సొల్లద్ ఎన్నాచ్చి “ అని మనం వినేవాళ్ళం.అదే ఫాస్ట్ బీట్ కి చెందిన మంచి పాట అందమైన అనుభవం లో “కుర్రాళ్ళో య్.. కుర్రాళ్ళూ.. క ళ్ళా లే లేనోళ్ళు… “. చాల హై పిచ్ లో ఉంటుందీ పాట. ఇదే సినిమా లో అసలు సాహిత్యం లేకుండా కేవలం హమ్మింగ్ తో ఉంటుంది ఓ పాట. రమోల అని ఓ సింగెర్ ఉండేది ఆ రోజుల్లో. ఆమెకి ఎక్కువ గా హమ్మింగ్ పాటలే ఉండేవి. మరో చరిత్ర (ఇది ఇంకో పాపులర్ సినిమా) లో కూడా అలాంటి పాట ఒకటి ఉంది. ఈ సినిమాలో “ఏ తీగ పూవునో..ఏ కొమ్మ..” నాకు నచ్చిన పాట. ఈ రెండు ఎం. ఎస్ విశ్వనాధన్ స్వర పరిచారు.

“పాడు నిలావే … తేన్ కవిదై… పూ మలరే..” – ఇది ఎస్. పీ. , జానకి పాడిన పాట. ఉదయ గీతం అనే తమిళ్ సినిమా లోనిది. చాల చక్కని ట్యూన్. దీని తెలుగు పాట మాత్రం వినలేదు. ఉదయ గీతం మన స్కూల్ రోజులు అయ్యాక వచ్చిన సినిమా. నేను మన వూరికి వచ్చి వెళ్తున్న రోజులలో చాల సార్లు విన్నాను. ఓ వర్షం కురిసిన సాయం కాలం… చేతిలో ఓ కాఫీ కప్పు తో.. మేఘాలు తొలగి కనిపించే సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తూ చక్కగా వినగలిగే పాట ఇది.

వసంత కోకిల (తమిళ్ లో మూన్డ్రాం పిరై) సినిమా ఎవరు మరువ గలరు? ఆ సినిమా లో చివరి సన్నివేశం చూసి మీలో ఏ చలనం లేకుంటే మాత్రం ఈ వాక్యాలు చదవనవసరం లేదు. కమల్, శ్రీదేవి ల బెస్ట్ చిత్రం ఇది. ఇద్దరికీ జాతీయ అవార్డు రావలసింది. కాని కమల్ కి మాత్రమె వచ్చింది. ఇందులో ” కథ గా కల్పన గా కనిపించెను నాకొక దొరసాని..” అన్న పాట చాల బాగుంటుంది. ఇదే పాట హిందీ లో “సద్మ” లో “సుర్మై… అఖియోన్ మే .. నన్హ మున్న ఏక సప్న దే జారే…” అని జేసుదాస్ పాట అంతే సుమధురం గా ఉంటుంది.

ఇలా ఎన్నెన్నో పాటలు. తీరిక ఉన్నప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. సంగీతం అంటే ఇష్టం లేని వాళ్ళని ఇందులో నిరాశ పరిచి ఉంటె క్షంతవ్యుడిని.

అందరికీ వినాయక చతుర్థి మరియు రంజాన్ (ముఖ్యం గా మన మంచి మనసున్న బషీర్ కి) శుభాకాం క్షలు .

Advertisements
This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

5 Responses to ఆ పాత(ట) మధురాలు…

 1. Dr. Vijayakrishna says:

  Ram,
  You are really great! Thanks so much for such a great job with the website, events, and everything that went into them. It was so fun to reconnect and reminisce about the ‘good old days’. It really brought those memories into focus. You are doing a phenomenal job, much thanks!! The very best to all!
  Cheers,
  Vijayakrishna

 2. sugunasri says:

  Your blog is so lively! Although I do not share your school, I share those times. I too grew up in Chittoor district, watching Madras TV and hence familiar with all the Tamil movies that you had mentioned.

  Thanks for making me recollect all those nice songs. They were my favorite songs too! Even now I remember the full text of many songs mentioned therein.

  Mee blog post titles chaalaa bagunnaayi. Meeku Bloguveerudu birudu icchEsaam!!

 3. T.Pattabhi Raman says:

  అన్ని పాత సినిమాలు తెలిపి నావు కాని ముఖ్య మైన సినిమా “మరో చరిత్ర” లాంటి సినిమా గురించి తెలిపి ఉంటె చాల బాగుంటుందేమో అని అనిపిస్తుంది. నేను ఆరవ క్లాసు ఉన్నప్పుడు, సోషియల్ స్టడీస్ కు ఇందిరా మేడం వచ్చే వారు. సోషియల్ లో ఒక లెస్సన్ శ్రీ కృష్ణ దేవరాయ లు గురుంచి ఉండేది. సరిగ్గా అప్పుడు అనంగానే శ్రీ కృష్ణ దేవరాయ చరిత్ర అనే సినిమా వచ్చింది. మేడం అభిప్రాయం ఏమంటే అ లెస్సన్ ఇయినక స్టూడెంట్స్ అందరు ఈ సినిమా ను చూదన్ది.మీకు లెస్సన్ బాగా అర్థమవుతుంతి అని చెప్పినారు, కాని, మేము కొంత మంది నెక్స్ట్ డే మధ్యాహ్నం మాటని షో కు అందరం చెప్పా పెట్ట కుండ వెల్లిపొఇనాము. నెక్స్ట్ డే ఉదయమే ప్రయెర్ టైం లో క్లాసు ద్దుప్కి కొట్టిన వాళ్ళ పేర్లు స్టేజి పయిన చదవాలని లిస్టు క్లాసు లీడర్ దగ్గర ఉన్నింది. కాని మా టైం బాగుంది. ఎవ్వరి పేర్లు లిస్టు ఇవ్వలేదు. ఇచి వుంటే, మా గతి అదో గతే!.
  తరువాత ఏడవ క్లాసు లో ఉన్నప్పుడు, మన ఫ్రెండ్ వై.ఎం .ముఉర్తి ఉండేవాడు. ఇతడికి మోహన్ (సైకిల్ షాప్ ఓవ్నెర్) కు పచ్చ గడ్డి వేస్తే కుడా మందు కుంటుంది , అంత విరోధం అన్న మాట. ప్రతి రోజు ఏదో ఒక గొడవ చేసేవాడు మోహన్. మూర్తి అతని అవ్వ ను తోడుకొని వచ్చి పంచాయతి చేసే వాడు. అవ్వ వచ్చే సరికి మోహన్ స్కూల్ లోనే ఉండే వాడు కాదు. ఇదంతా చూసే దానినికి తమాషా గ ఉండేది.

  ఏడవ క్లాస్సు లో తెలుగు సబ్జెక్టు కు కృష్ణపప సర్ వచ్చే వారు. పద్య భాగం అంతా రాగం గ చెప్పే వారు. ఇప్పటికి కూడా నాకు చాల బాగా గుర్తు ఉంది. గౌతమ బుధుడు గాయ పడిన హంస ను చేతిలో తీసుకుని రాజ సభ లో ” అంచ తల్లి రావే ….. ” అని పాడిన పద్యం చాల బాగుంటుంది. బహుశా మీకు ఇప్పుడు తప్పకుండ గుర్తు వస్తుంది.

  అప్పట్లో నాకు ద్విగు సమాసం వ్రాయడం చేత కాదు. నేను దిగువ సమాసం అనే వ్రాసే వాడిని, సర్ దానికి దిగువ మగం వెళ్ళు అనే గేలి చేసే వారు.
  ఇంకా మరి కొన్ని తరువాతి కలయికలో……..

  అంత వరకు సెలవు.

  • mhsgreamspet says:

   పాట్స్,
   చాల ఆసక్తి కరంగా ఉన్న విశేషాలు పంచుకున్నావు. ఇంకా విశేషాలు పంచుకుంటావని ఆశిస్తున్నాను.

 4. P.Sasi Kiran says:

  nice blog Rama Kishna By seeing this we r getting our old memoriessssssss
  Thankx for keeping thissssss once again…………

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s