“ఆఫ్టర్ ట్వెంటీ ఇయర్స్”

నం ఆరవ క్లాసు లో ఉన్నప్పుడు ఇంగ్లీషు లోని ఓ పాఠం పేరు. స్నేహాన్ని సున్నితం గా స్పృశించే కథ అది. అందుకేనేమో అప్పుడు ఆ పాఠం నాకు బాగా నచ్చింది. రాజేశ్వరి మేడం (అనుకుంటాను) ఆ పాఠం లోని ఏదైనా ఓ సన్నివేశాన్ని డ్రాయింగ్ పేపర్ పై బొమ్మ గీసుకుని రమ్మని నాకు చెప్పారు. నేను గీసుకోచ్చిన బొమ్మ బాగా గుర్తుంది.

కొంచం మరవటం తో నిన్న ఆ పాఠం పూర్తి కథని ఇంటర్నెట్ లో వెతికి చదివాను. ఆ కథలో కూడా స్నేహానికి పెద్ద పీట వేశారు రచయిత.

కథలోకి వెళ్తే… ఓ వ్యక్తి (పేరు గుర్తు లేదు.. విలియమ్స్ అనుకుందాము) ఓ చీకటి ప్రదేశం దగ్గర ఎవరి కోసమో వెయిట్ చేస్తుంటాడు. రాత్రి పూట గస్తి తిరిగే ఓ పోలీసు అతని దగ్గరికొచ్చి విషయమడుగుతాడు. సమాధానం గ .. తాను 20 సంవత్సరాల క్రితం అక్కడ ఉండేవాడినని, అప్పుడు వేరే దేశం వెళ్లి వ్యాపారం చేసి బాగా సంపాదించానని, తాను తన మిత్రునికి ఇదే ప్రదేశం లోని ఓ రెస్టారెంట్ దగ్గర 20 సంవత్సరాల తరువాత వచ్చి కలుస్తానని మాట ఇచ్చానని.. ఇప్పుడు తన కోసం నిరీక్షిస్తున్నట్టు చెపుతాడు. చీకటి గ ఉండటం తో, పొలిసు టార్చి వెలుగు లో విలియమ్స్ ని చూస్తాడు. అతడిని చూసాక, నీ మిత్రుని నువ్వు కలుస్తావని ఆశిస్తున్నట్లు చెప్పి వెళ్లి పోతాడు. కొంత సేపటికి.. విలియమ్స్ ని పేరు పెట్టి పిలుస్తూ ఓ ఆగంతకుడు అక్కడికి వస్తాడు. అతడే తన మిత్రుడని భావించి..అతనితో మాట్లాడుతూ బయటికి వెలుతురు లో వచ్చి చూసి.. అతను తన మిత్రుడు కాదు అని గుర్తిస్తాడు. అ వ్యక్తి విలియమ్స్ కి ఇలా చెపుతాడు. ” నేను ఓ పొలిసు ని. ఇంతకు మునుపు మీతో మాట్లాడిన పొలిసు మీరు ఎదురు చూసిన మిత్రుడే. టార్చి వెలుగు లో తను మీరు మేము గాలిస్తున్న ఓ నేరస్తుడిగా గుర్తించాడు. తను మాట ప్రకారం మిమ్మల్ని కలిసినా.. ఓ మిత్రుడిగా మిమ్మల్ని అరెస్ట్ చేయలేక పోయాడు. తన కర్తవ్యాన్ని వదలలేక, నన్ను మిమ్మల్ని అరెస్ట్ చేయటానికి పంపించాడు” అని ముగిస్తాడు.

క్లుప్తం గా ఇదీ కథ. నేను గీసిన బొమ్మ లో.. టార్చి వెలుగు లో విలియమ్స్ ని చూస్తున్న మిత్రుడి బొమ్మని గీసాను. ఇద్దరు మిత్రుల మధ్య జరిగే ఈ కథ కేవలం ఇరవై సంవత్సరాలకు సంబంధించింది. అన్ని సంవత్సరాలకు కలుసుకోబోతున్నందుకు , విలియమ్స్ పడే ఉత్కంట , తన మిత్రున్ని చూడాలన్న ఆదుర్దా చాల బాగుంటుంది పాఠం లో. అలాంటి ఫీలింగ్స్ నే మనము.. దాదాపు ముప్పై సంవత్సరాలకు కలుసుకున్నప్పుడు పొందాము. ఎన్నాళ్ళో వేచిన ఉదయం… ఈనాడే ఎదురౌతుంటే … ఇంకా తెలవారదేమి.. ఈ చీకటి విడిపోదేమి…” ఇలా ఎందరనుకున్నారో ఆ రోజు…?

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

2 Responses to “ఆఫ్టర్ ట్వెంటీ ఇయర్స్”

 1. AATHREYA says:

  the story was “after twenty years ”
  author O’ Henry

  the characters waiting man Bob , and the police man Jimmy Wells

  good story and its pretty good to meet old friends

  cheers

  aatherya

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s