ఈ రోజు మంచి రోజు…

మరపు రానిది… మధురమైనది.. స్నేహ సుమం వికసించిన రోజు…

అప్పుడే సంవత్సరం అయిందా? అనిపిస్తుంది కదా… ముప్పై ఏళ్ళ తరువాత.. మనం అందరం (సుమారు  60 మంది) కలిసింది గత సంవత్సరం సరిగ్గా ఈ రోజే కదా..? గాంధీ జయంతి కావటం.. ఆ మహాత్ముడిని తలచుకుని ప్రోగ్రాం మొదలు పెట్టటం చాల బాగుంది.. ఆ రోజు కేవలం పాత మిత్రులు ఓ చోట కలుసుకోవటం మాత్రమే కాకుండా.. మనకు చదువు చెప్పిన గురువులను ఆహ్వానించి.. వారి ఆశీస్సులు అందుకుని , వారిని సన్మానించు కోవటం… పూర్వ జన్మ  సుకృతమే. తాము  రాలేక పోయినా , వారు సుదూర తీరాల నుండి ఆ క్షణాల్లో మనకు ఫోన్ లు చేస్తూ.. ఇక్కడే ఉన్నట్లు గ భావించి సంతోషించిన మన పీ. ఎస్. బాబు (యు. కే), విజయ కృష్ణ (యు. ఎస్) , స్వర్ణ లత (తను హైదరాబాద్ లో ఆ రోజు షూటింగ్ తో బిజీ ) సహృదయులకు తార్కాణాలు. వర్షాలు కురుస్తూ, చాల చోట్ల రైళ్ళ, బస్సుల రాక పోకలు నిలిచిపోతుంటే కూడా, ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి హైదరాబాద్ నుండి వచ్చిన పద్మజ, మాధవి లను అభినందించాల్సిందే.. బెంగళూరు నుండి వచ్చిన గీత, సరోజినీ, అనిత లు వచ్చారని ఆనందించినా, అనురాధ రాలేకపోయారు. కాని, తను అందరికి ఫోన్ చేస్తూ.. గత స్మృతులను నెమరు వేసుకో గలిగింది.

నెల్లూరు  నుండి గురు, విద్యాశంకర్  వచ్చారు. చెన్నై నుండి పట్టాభి కుటుంబం, మంజుల కుటుంబం , లీలావతి వచ్చారు. పట్టాభి తన ఎస్. ఏం. ఎస్. ల ద్వారా ఎప్పటికప్పుడు ప్రోగ్రాం  వివరాలు తెలియచేస్తూ చక్కటి సమన్వయము చేసాడు. అందరి పుట్టిన రోజులు, పెళ్లి రోజులు collect చేసి, ప్రతి ఒక్కరినీ అందరూ ఆ రోజు విష్ చేసే ఓ మంచి అలవాటును మన అందరికీ చేసింది పట్టాభి నే. మంజుల కుటుంబం గురువులను అందరిని సన్మానించడం మరో  చక్కటి జ్ఞాపకం. తిరుపతి నుండి రామచంద్ర, ప్రమీల, రమ రాగలిగారు.. ప్రసన్న కుమారి ఆరోగ్య రీత్యా రాలేక పోయింది.

ప్రసన్న చక్క గ అకౌంట్స్ మేనేజ్ చేస్తూ… డబ్బు తీసుకుని పారిపోతాడేమో అనే మన కామెంట్స్ ని నవ్వుతు భరిస్తూ ఎంతో చక్క గ ప్రోగ్రాం సఫలం కావటానికి దోహద పడ్డాడు. మన ఇంకో బాల్య స్నేహితుడు బషీర్ మంచి ఆర్టిస్టు. బషీర్ చక్కటి బ్యానర్ (పైన ఉన్న మన ఫోటో వెంక ఉన్న బ్యానర్ ) రూపొందించి ఇచ్చాడు. తను ఎంతో సింపుల్ గ ఉంటాడు.. చెరగని చిరునవ్వు.. మృదు భాషి. తను ప్రోగ్రాం కి మాత్రం రాలేక పోవటం నిజంగా నాకు బాధ అనిపించింది.

సురేంద్ర ఫంక్షన్ లో అన్నీ తానై పనులు చేసాడు. మధ్యా హ్నం వడ్డించే సమయం లో సురేష్, మధు, లవ ఇంట్లో వడ్డించి నట్లు  అందరికీ వడ్డిస్తూ ఉంటె.. ఆ దృశ్యాల “సొగసు చూడ తరమా…?” అనిపించింది. ముఖ్యం గ లవ కుమార్ గురించి చెప్పాలి. తను రైల్వే లో పైలెట్  గ ఉండటం వలన,.. ఆ సమయం లో దసరా రష్  ఉండి సెలవు దొరకటం కష్టమైంది. అయినప్పటికీ.. ఎంతో కష్టపడి ఫంక్షన్ కి వచ్చి అదే సాయంత్రం బయలుదేరి  .. తరువాతి రోజు పొద్దున్న 4  గంటలకు మళ్ళీ డ్యూటీ కి వెళ్ళాడు. తన డ్యూటీ టైం ఎంతో తెలుసా .. కనీసం 24  గంటలు. నిజం గ హాట్స్ ఆఫ్ టు లవ.
కలై వాణి  కుటుంబం ప్రోగ్రాం ముందు నుండి చివరి వరకు ఎంతో కష్ట పడ్డారు ఇష్టంగా.

అనంతపూర్ నుండి విజయ వచ్చి ప్రోగ్రాం మొత్తం సైలెంట్ గ గురువుల సన్మాన కార్యక్రమం లో సహాయపడింది. ఓ విధం గ చెప్పాలంటే, ఈ ప్రోగ్రాం జరగటానికి ప్రేరణ ఇచ్చిన మన మిత్రులలో తను ముందు ఉన్నారు. ఎప్పటికప్పుడు.. ఈ ప్రోగ్రాం కోసం తన వంతు సలహాలు.. ఇస్తూ.. lime light లో ఉండటానికి ఇష్ట పడని వ్యక్తి విజయ. అలాగే.. శశి కిరణ్ ప్రోగ్రాం ని తనదైన శైలి లో వ్యాఖ్యానిస్తూ .. ఆద్యంతం అందరిని ఆహ్లాదపరిచారు. కే. కే ప్రసాద్ ప్రోగ్రాం ముందు నుండి చాల active గ ఉండి సూచనలిచ్చాడు. అందరికి వివేకానందుడి పై పుస్తకాలనివ్వటం తన సలహానే. ఆ పుస్తకాలు చాల బాగున్నాయి.

గోపాల్, ధనంజయ, కేశవులు  , బాల, శీన, ఈ. కే. రమేష్, వరలక్ష్మి (వెల్లోర్ నుండి), వరలక్ష్మి (చిత్తూర్ నుండి), పురుషోత్తం, గాయత్రి, ప్రఫుల్ల రాణి, పరిమళ, రాజేశ్వరి, మహా లక్ష్మి, లవ సిస్టర్ సుశీల వచ్చి… ఆ రోజులను మళ్ళీ గుర్తు తెచ్చారు. పట్టాభి రెడ్డి, శరత్ రాలేక పోయారు. వారు  కూడా వచ్చి ఉంటె బాగుండేది.
సబిత   తన అభిప్రాయాలను   “భలే  మంచి రోజు…” అన్న  చక్కటి పాట ద్వారా  సందర్భోచితం  గ చెప్పారు. యెన్. గోపి గురువులను  స్మరిస్తూ తన జ్ఞాపకాలతో ఆ రోజుల్లోకి తీసుకెళ్ళాడు.

మనందరినీ విడిచి పోయిన శ్రీధర్ రెడ్డి ఆ రోజు మనతో గడిపిన క్షణాలు గుర్తుకొస్తే మౌనం అవుతుంది హృదయం.  ఫంక్షన్ కి విచ్చేసి మన అందరినీ ఆశీర్వదించి, మనతో ఆ రోజు గడిపిన గురువులందరికీ మరో సారి  కృతజ్ఞతలు. ఆ రోజు మనతో గడిపిన ఇంకా మిత్రులెవరినైన మరచి  ఉంటె మన్నించ  గలరు.

ఇలా.. ఓ జీవిత కాలానికి సరిపడే ఆనందాలు ఇచ్చింది ఆ రోజు..

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

4 Responses to ఈ రోజు మంచి రోజు…

 1. T.PATTABHI RAMAN says:

  ప్రియ మైన శాస్త్ర వేత్త మూర్తి

  అడ్వాన్సు జన్మ దిన శుభా కాంక్షలు . రేపటి దినము ఇంటర్నెట్ అందు బాటలో ఉండతు కనుక ఇప్పుడే తెలుపు తున్నాను.

  ఇట్లు

  నీ స్నేహితుడు

  పట్టాభి రామన్.

 2. jaggampeta says:

  sneham tiyyanidhi

 3. kalaivani says:

  yesterday I posted my greetings.
  There must be some problem.
  Day before yesterday myself and
  Vijaya remembering all the past
  things from enjoying along with
  our friends to cutting the cake
  for our beloved friend Bulli Mahatma
  in the occasion of his forth coming
  b’day. Belated and lovable wishes
  to our friend Bulli Mahatma and JNS
  (Jagannataka Sutradari) Ramakrishna
  on 3rd of this month.
  Bye and cheers

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s