ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి

నేను చెప్ప బోయే సినిమా ని పూర్తి గ చూడలేదు. ఒక్క సారి … అదీ ఓ పదిహేనేళ్ళ క్రితం చూసాను.. అయినా ఆ సినిమా ఇతివృత్తం మనసు లో ఉండిపోయింది. బ్లాక్ అండ్  వైట్ లో 1960 లో విడుదలైన ఆ హిందీ సినిమా పేరు “అనురాధ”. కథ టూకీ గ ఏంటంటే.. ఓ డాక్టర్ ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆమె సంగీతం లో మంచి ప్రావీణ్యం ఉన్న మనిషి. పెళ్లి అయిన తరవాత ఓ పాప.. ఆ తరవాత సంసార బాధ్యతలతో తన ఇష్టమైన సంగీతం వదల  వలసి  వస్తుంది. డాక్టర్ కూడా తన వృత్తి లో అంకిత భావం తో ఉండటం వలన, ఇంటి ని పట్టించుకోడు. అలా మొదలైన అసంతృప్తి పతాక స్థాయి కి చేరి, తన ఇష్టమైన సంగీతం కోసం తన ఉనికి ని మళ్ళీ పొందటం కోసం, విడి పోవటానికి సిద్ధ పడుతుంది ఆ ఇల్లాలు. సహృదయుడైన డాక్టర్ తనకి అడ్డు చెప్పలేక పోతాడు. తను వెళ్ళే ముందు, వాళ్ళ ఇంటికి విదేశీయులు డాక్టర్ తో వృతి రీత్యా కలవటానికి వచ్చి అతిథులుగా ఉంటారు. వారు వెళ్ళే వరకు తనని ఉండమని డాక్టర్ కోరటం తో , అందుకు సమ్మతించి అతిథి సేవలు అత్యున్నతం గ చేస్తుంది. ఓ సందర్భాన తన సంగీతం గురించి తెలిసిన అతిథుల కోరిక మేరకు, వారి ముందు సంగీత ప్రతిభని ప్రదర్శిస్తుంది. మంత్ర ముగ్ధులైన అతిథులు, వెళ్ళేటపుడు ఆమె ని ఎంతగానో పొగడుతూ, తను సంగీతం లో ప్రవేశం వున్నా, డాక్టర్ కి అను నిత్యం సేవ చేసి తను ఉన్నత సేవ లు అందించటానికి  తను చేసిన త్యాగం గొప్పదని పొగడుతారు. తను అ కుటుంబానికి ఓ చుక్కాని గ ఉండటం వలననే డాక్టర్ సమాజానికి ఉపయోగ పడ్డాడని, తన గెలుపులో తన భాగస్వామ్యం తను సంగీతం లో పొంద గలిగే పేరు కన్నా ఉన్నతమైనదని గ్రహించి, మనసు మార్చుకుని తనతోనే ఉండిపోతుంది.

మారుతున్న ప్రస్తుత పరిస్థితులలో, ఇటువంటి  ఫీల్ గుడ్ కథలు  చాల అవసరం అనిపిస్తుంది. జీవితం పరమార్దానికి  కొల బద్ద  మనిషి వ్యక్తిగత ఖ్యాతి, సంపద, పేరు, ప్రతిష్ట కాదని..  చుట్టూ ఉన్న వారికి సంతోషం పంచి ఇవ్వటమేనని ఈ కథ చెపుతుంది. అహం ఉన్న చోట పేరు ఉండొచ్చు.. కాని సంతోషం ఉండదు.. ఉండబోదు. “నా” అనుకున్న వారు so called materialistic ప్రపంచం లో అందరికంటే ముందు ఉండొచ్చు… కాని “మన” అనుకున్న వారి లాగా నిజమైన సంతోషాన్ని పొందలేరు. ఒక కుటుంబం ఎంతో ఆనందం గ ఉందీ అంటే.. ఆ ఇంట్లో గృహిణి పాత్ర ఎంతో ఉంది అని మరువరాదు. చక్కటి జీవితాలను ఆస్వాదిస్తూ అందరికీ అందిస్తూ ఉన్న మన క్లాసు మేట్స్ అందరికీ నా అభినందనలు.

Advertisements
This entry was posted in నాడు-నేడు. Bookmark the permalink.

One Response to ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి

  1. kalaivani says:

    Hi Bulli Mahatma
    Ur recalling is nice along with nice previous story. We have to give importance to the relationships forever. This is a heart-touching recollection. Though u r busy with
    ur work be in regular touch in our website makes us very very happy.
    Bye and cheers

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s