హృదయంతో వినాల్సిన ఓ పాట

కొన్ని పాత సినిమా ల లోని పాటలు  మంచి సాహిత్యమున్నా , ఎందుకో కాల గర్భాన మరుగున పడిపోయాయి. అలాంటి పాటలలో ఒక పాట మనం స్కూల్ లో ఉన్న రోజులలో వచ్చిన  “నా లాగ ఎందరో” అనే సినిమా లో ఉంది. మనము సెవెంత్ లో ఉన్నప్పుడు ( ?) ప్రతాప్ టాకీసు లో వచ్చిన  బ్లాకు అండ్ వైట్ సినిమా ఇది. ఈరంకి  శర్మ direction లో సమాజం లో  స్త్రీ ఎదుర్కొనే పెళ్లి చూపులు అనే ప్రక్రియ గురించి విశ్లేషణాత్మకం గ చూపిస్తుంది ఈ చిత్రం. నాకు ఆ రోజుల్లో ఇలాంటి సామాజిక స్పృహ ఉన్న కథలంటే అంత అవగాహన లేకున్నా, ఇందులో “కల్యాణిని..” అన్న పాట  అలాగే గుర్తు ఉండిపోయింది. కంటి చూపు లేని హీరో (నారాయణ రావు) కి పెళ్లి కి propose చేసిన హీరోయిన్ (రూప) కి తన రూపాన్ని తనే వర్ణించు కోవలసిన ఓ విచిత్రమైన పరిస్థితి.

ఎదుటి వాళ్ళు మనల్ని ఎలాగైనా పొగ డోచ్చు. కానీ మన గురించి మనమే చెప్పుకోవాలంటే.. ఆ చెప్పే టపుడు .. ఎక్కువ చెపితే గర్వమంటారు. తక్కువ చెపితే.. సత్య దూరం అవుతుంది. ఆలాంటి సందిగ్ధావస్థ లో చెప్పాల్సింది చెపుతూనే.. అణుకువ తో ఎలా చెప్పాలో తెలుపుతుంది ఈ పాట. ఇలాంటి situation కి పాట రాయటం నిజం గ కత్తి మీద సామే…

ఎన్నో పెళ్లి చూపులను ఎదుర్కొని విసిగి పోయిన నాయిక చివరికి తనను ఇష్టపడిన, తను ఇష్టపడిన ఓ అంధుడి తో , తన గురించి ఇలా పాట రూపం లో చెపుతుంది.

” కల్యాణిని … కల్యాణిని..
కనులున్న మనసుకు కనిపించు రూపాన్ని..
మనసున్న చెవులకు వినిపించు నాదాన్ని..”

ఇలా పల్లవి తో మొదలై .. ఓ చరణం లో తను ఎలా ఉంటుందో ఎలా చెపుతుందంటే

“నీ ఆశల కుంచెలతో
అనురాగాల రంగులతో..
ఊహించుకో నను చిత్రించుకో
ఎదలోన పదిలంగా నను దాచుకో”

కల్యాణిని … కల్యాణిని..

“చందమామ మోము..
చారడేసి కళ్ళు..
దొండ పండు పెదవి..
పండు నిమ్మ పసిమి..
కడలి అలల కురులు..
కానరాని నడుము…
కన్నె సొగసులని కవులన్నారు
అవి అన్నో కొన్నో ఉన్నదానిని”

హృదయం తో వినాల్సిన కొన్ని పాటలలో ఇదీ ఒకటి. రెండో చరణం లో తను ఇలా ఉన్నాను అని చెప్పకుండా.. కవులన్నారని చెప్పి.. అవి అన్నో కొన్నో ఉన్నదానను  అని లౌక్యం గ చెప్పటం చాల హృద్యం గ ఉంటుంది.

ఆత్రేయ గారు ఈ పాటని రాసారని ఇంటర్నెట్ లో చూసాను. బాలు, సుశీల గార్ల యుగళం లో  ఎం. ఎస్. విశ్వనాధన్ చాల చక్క గ స్వరపరిచారీ పాటను.

Advertisements
This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

6 Responses to హృదయంతో వినాల్సిన ఓ పాట

 1. chinni says:

  naku greamspetmunicipal school tho 2yrs anubhandham vundhi …chala hppyga anipinchindhi blog chudagane

  • mhsgreamspet says:

   మీ స్పందన కి మన స్కూల్ ఫ్రెండ్స్ అందరి తరపున అభినదనలు. మీకు అభ్యంతరం లేక పోతే, స్కూల్ తో ఉన్న మీ అనుభూతులను మాతో పంచుకోవాలని మనవి.
   రామకృష్ణ

 2. chinni says:

  థాంక్యూ అండీ 🙂
  నేను అయిదు మరియు ఆరు తరగతులు ,అక్క ఆరు ,ఏడు చెల్లి నాలుగు అయిదు చదివాం .మేము చిత్తూర్ లో వున్నా మొదటి ఇయర్ సెకండ్ మరాటి స్ట్రీట్ లో వుండేవాళ్ళం ,మా ఇంటి ప్రక్కనే విజయలక్ష్మి అనే అమ్మాయి నా క్లాస్స్ మేట్ వుండేది ,వాళ్ళ అక్క గిరిజ కూడా మన స్కూల్ లోనే చదివింది .మా ఇంటి నుండి స్కూల్ కి వచ్చే దారిలో వెంకటరత్నం అనే అబ్బాయి వాళ్ళ ఇల్లు వుండేది అతను మా స్కూల్ లో చదివేవాడు .అయిదో క్లాస్స్ లో వుండగా మార్నింగ్ ప్రయెర్ సాంగ్ “వీణ పాణి మంజులవాణి “మైక్ ముందు పాడే వాళ్ళలో నేను ఒకదాన్ని . ఆ ఇయర్ చిల్డ్రన్స్ డే సేలేబ్రేశంస్ లీడ్ తీసుకుని జరిపించాను .ప్రతి దానికి వచ్చిన రాకపోయినా ముందు దూకేదాన్ని 🙂
  ఒకసారి హెడ్ మాస్టర్ తో తెలుగు చదవటం రాక తిట్లు తిన్నాను ,నాయకురాలు నాగమ్మ లెస్సన్ లో “జిట్టాగామాలపాడు”అనేది సరిగ్గా కలిపి చదవలేదని చాలాసార్లు చదివించారు .రిబ్బన్ డాన్సు “పాప్పకన్నె పాట్టుపడి “తమిళ్ సాంగ్ కి వేసాం,ఎక్కడో గ్రౌండ్ కి వెళ్లి డక్కిడాన్సు “ఓ గాంధి తాత విస్వాది నేత “కోలాటం గ్రూప్ కూడా చేసాం .మా సేనియర్ ఒక లెగ్ సరిగ్గా వుండేది కాదు ,తనని చుస్తే అందరం పారిపోయేవాళ్ళం .హై స్కూల్ లో డ్రాయింగ్ మాస్టర్ నాకు చాల ఇష్టం పేరు నారాయణ అయ్యవారు అనుకుంటాను గుర్తుకు రావడం లేదు ..ఇంకా చాల చాల జ్ఞాపకాలు వున్నాయి :-)మరల చెప్తాను .

  • mhsgreamspet says:

   మీ జ్ఞాపకాలు చదివాక చాల ఆనందమేసింది. మీరు అన్నట్లు, డ్రాయింగ్ టీచర్ పేరు నారాయణ గారే. వారి అబ్బాయి పార్థ సారధి గిరిమ్పేట లో ఫోటో స్టూడియో నడుపుతూ ఉన్నారు ఇప్పటికీ. మన టీచర్ ల గురించి మన బ్లాగ్ లో ఓ ఆర్టి కల్ రాసాను. చదవగలరు. మీరు ఏ పీరియడ్ లో చదివారో చెపితే, మీ బాచ్ మేట్స్ ఎవరైనా తెలిసిన వారు ఉన్నారేమో చెప్ప గలను.
   రామకృష్ణ

 3. chinni says:

  మన స్కూల్ టీచర్స్గురించి మీ బ్లాగ్ లో చదివానండి.నారాయణ గారు లేరని తెలియగానే భాధగా అనిపించింది .నేను చదివిన టైములో హెచ్ .ఎమ్.కల్యాణి బాయి .నా స్కూల్ ఫ్రెండ్స్ పేర్లు గుర్తురావడం లేదు ,విజయ లక్ష్మి ,వెంకటరత్నం బాగా గుర్తున్నారు ,అలానే లక్స్మికాంతం అనే అమ్మాయి కూడా గుర్తొస్తుంది ,మా సీనియర్ ఒక అమ్మాయి పేరు నందాదేవి .ఆమె డాన్సు చేసేది అలా గుర్తు .నేను అప్పట్లో గైడ్ లో వుండేదాన్ని .నా సిక్స్త్ క్లాస్స్ లో వ్యాస రచన ,వ్రాక్వుత్వ పోటిలలో పాల్గొని మొదటి స్థానాల్లో గెలుపొందాను .బ్లాగ్లో నా ‘బహుమతి ‘అని జ్ఞాపకాల్లో రాసాను 🙂 నాకు బహుమతులుగా వచ్చిన పుస్తకాలు “పాయసం తాగిన పిచ్చుక “,చరిత్రకెక్కిన చరితార్ధులు “చదివి ఇస్తానని ఒక టీచర్ (లావుగా వుండేవారు ఆవిడ )తిరిగి ఇవ్వలేదు ఇప్పటికి గుర్తుచేసుకుంటాను :-)డెబ్బయ్యారులో చిత్తూరు నుండి కొవ్వూరు (ప.గో.జి)నాన్న ట్రన్స్ఫెర్ తో వెళ్ళిపోయాము .చిన్నతనమంత సంవత్సరానికో ఊర్లో చదివేవాళ్ళం .కొవ్వూరులో వుండగా గైడ్ అండ్ స్కౌట్ సిల్వర్ జుబ్లీ కాంఫ్హోరి వరంగల్ లో జరిగినపుడు నేను అటెండ్ అయ్యాను అక్కడ చివరిసారిగా డ్రాయింగ్ అయ్యవారిని కలిసాము ,ఆయన స్కూల్ పిల్లలతో అక్కడికి వచ్చారు .
  అన్నట్లు ఎమ్.ఎస్సార్ .మూవీ లాండ్ లో మొట్టమొదట “యశోదా కృష్ణా “మేము చూసాం .అప్పట్లో అదే మంచి సినిమా హాల్ .
  చెల్లికి చెప్పాను మీ బ్లాగ్ చూడమని .
  బోల్డన్ని జ్ఞాపకాలతో మరల రాస్తాను 🙂
  నా అసలు పేరు నా బ్లాగ్ పేరే .

  • mhsgreamspet says:

   హిమబిందు గారు,
   మీరు మాకు ఒక సంవత్సరం సీనియర్ అనుకుంటాను. మేము 76 లో ఆరవ తరగతి చేరాము. కళ్యాణి బాయి మేడం అదే ఇయర్ లో రిటైర్ అయ్యారు. మీ క్లాసు లో భాస్కర్ రావు పవార్, వెంకట రమణ ఉండేవారని అనుకుంటున్నాను. వాళ్ళు బాగా చదివే వారు.నేను ఆ వూరు 1983 లో వదిలినా, ఎందుకో అమ్మ వొడి లాంటి ఆ ఊరుని మరువలేక, ప్రతి ఏటా వెళ్లి వస్తూ ఉంటాను. నా చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరు నాకు ఎంతో క్లోజ్ గ ఉంటారు. మీ బ్లాగు లో కొన్ని చదివాను. చాల బాగా రాసారు. ఇంకా చదవాలి. మీ జ్ఞాపకాలు, మన స్కూల్ ముఖ్యం గ, మా బాచ్ వాళ్ళ అందరికీ, చాల ఆనందాన్ని ఇస్తాయని చెప్ప గలను.

   ఆ ఊళ్లోనే ఉన్న మా క్లాస్ మేట్ కలై వాణి మీ ఫ్రెండ్స్ గురించి వాకబు చేయమని చెపుతాను.

   రామకృష్ణ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s