ఆ పత్రికలు- లోకానికి కిటికీలు

చదువు విజ్ఞానాన్ని ఇస్తే,  అప్పట్లో పత్రికలు వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో  ఉపయోగపడేవి. ఈ పత్రిక ల కథల సారం, వ్యక్తిత్వమనే  ముడి పదార్థానికి మెరుగులు దిద్దేవి. చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర, బాలానందం, బుజ్జాయి నెల మొదటి వారం లో ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూసే రోజులవి. మొదటి మూడు పత్రికలైతే తప్పకుండ కొనేవాళ్ళం. జెడ్. పీ. ఆఫీసు పక్కన వున్న ఓ చిన్న షాపు లో దొరికేవి.లేకుంటే ఎర్రయ్య అంగడికి వెళ్ళాల్సిందే. నడక కష్టమైనా, 2 -3 కిలో మీటర్లు నడిచి వెళ్లి మరీ తెచ్చుకునే వాళ్ళం. ఇంట్లో ఎవరు ముందు చదవాలని, అన్నయ్య కూ, నాకూ పేచి. తను తిరుపతి లో డాక్టర్ కోర్సు చదవడానికి వెళ్ళాక, పోటి సమస్య పోయింది.

ఈ పత్రికలు ఎంతో వినోదం పంచే నేస్తాలైనా .. ఇప్పుడు ఆ కథలని సింహావలోకనం చేసుకుంటే … నాకు అవన్నీ management సూత్రాలు చెప్పే కథల గానో, లేక మానవ సంబంధాల ను విశ్లేషించే కథలు గానో.. లేక నీతి ని బోధించే కథల గానో కనపడుతుంటాయి. చందమామ లో చిత్ర బొమ్మలంటే భలే ఇష్టం. తన బొమ్మలతో వచ్చిన “విచిత్ర కవలలు” ఎంతో బాగుంటుంది. అందులో నాయకుల పేర్లలో ఉదయనుడు ఒక్కటే గుర్తుంది. సుహాసిని, సుభాషిణి, సుకేశి ని అని ముగ్గురు కథ నాయికలున్నారు ఆ కథలో.   విక్రమార్కుని కథలకు శంకర్ వేసే బొమ్మలు ప్రధాన ఆకర్షణ . తన బొమ్మలు పత్రిక చివర్లో వచ్చే పురాణ గాథలకు కూడా ఉండేవి. మనం చదివే రోజుల్లో వీర హనుమాన్, మహా భారతం ధారావాహికలు గ వచ్చేవి. చివర గ రెండు ఫోటో లు ఇచ్చి వాటికి  వ్యాఖ్యానం పంపే పోటీ ఉండేది. రచయిత (త్రు) లలో మాచిరాజు కామేశ్వర రావు, వసుంధర (ఇది కలం పేరనుకుంటాను. వీరు బిలాస్పూర్ లో ఉండేవారని నాకు జ్ఞాపకం), పీ.సి. సర్కార్ ఇంద్రజాల కథలు ఎక్కువ గ ఉండేవి. 80 మొదట్లో, చిత్ర గీసిన బొమ్మలు తగ్గి, రాజి, జయ బొమ్మలు ఎక్కువయ్యాయి. జయ బొమ్మలు అంతకు మునుపు బొమ్మరిల్లు లో వచ్చేవి. బొమ్మరిల్లు లో నాకు కుందేలు సీరీస్ కథలు తెగ నచ్చేవి. ఆ కథలలో కుందేలు అల్లుడు, నక్క మామని బోల్తా కొట్టించడం భలే థ్రిల్లింగ్ గ ఉండేది. ఆ కథలకు ఎం. కే. బీ (తను ఎం. కే . బాష అని గుర్తు) బొమ్మలు గీసే వారు.

ఇవన్ని ఒక ఎత్తైతే, చందమామ ముఖ చిత్రం మాత్రమే ఒక  ఎత్తు. వడ్డాది పాపయ్య గీసే  చిత్రాలు, తైల వర్ణ చిత్రాల లాగా అద్భుతం గ ఉంటాయి. ఆ బొమ్మలు ఆ సంచిక లోని పురాణ గాథ కి సంబంధించిన సన్నివేశానికి గీసేవారు. వీర హనుమాన్ ధారా వాహిక గ వస్తున్న రోజులలో సూర్యుణ్ణి చూసి పండు అనుకుని మింగడానికి పైకెగురుతున్నబాల హనుమంతుని బొమ్మ కవర్ పేజీ గ రావటం ఇప్పటికీ గుర్తు వుంది.  తరవాతి రోజులలో తన చిత్రాలు స్వాతి వార పత్రిక కి కూడా వచ్చేవి. ఈ కథల పుస్తకాలు ఇంకొకరికి ఇవ్వకుండా చాల possesive నేను ఉండటం తలచుకుంటే , ఇప్పుడు నాకు నవ్వు వస్తుంటుంది.  అందులోని కొన్ని కథలు ఇప్పటికి బెడ్ టైం కథలు గ చెపుతుంటాను. వాటిల్లో నచ్చిన కొన్ని కథలు, ఇంకో సారి పంచుకుంటాను.

Advertisements
This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

6 Responses to ఆ పత్రికలు- లోకానికి కిటికీలు

 1. chinni says:

  మా ఇంట్లో కూడా అదే పోటీ బాలమిత్ర ,బుజ్జాయి ,చందమామ ,బొమ్మరిల్లు ,చదివిన కథలే పదేపదే చదివేవాళ్ళం ,”బేతాళకథలు “రాత్రి వేళల పొరపాటున చదివేదాన్ని కాదు ,చటుక్కున పేజి తిప్పెసేదాన్ని ,దెయ్యం బొమ్మ వస్తే కళ్ళు మూసుకుని పేజి తిప్పెదాన్ని …ఇకపోతే మేము ఇంకో అడుగు ముందుకేసి పెద్ద పుస్తకాలు (నవల )కూడా చదివే వాళ్ళం . వ.పా బొమ్మలు నాకు ఇష్టం .బాగుందండీ జ్ఞాపకం

 2. వేణు says:

  చందమామలో ధారావాహికగా వచ్చిన ‘విచిత్ర కవలలు’ నాక్కూడా బాగా ఇష్టం. హీరోల పేర్లు ఉదయనుడూ, సంధ్యా, నిశీధీ. చిత్రా వీటికి వేసిన బొమ్మల గురించి ఓ టపా రాశాను. దాన్ని
  ఇక్కడ చూడవచ్చు.

  • mhsgreamspet says:

   వేణు గారు,
   ధన్యవాదాలు. మీ బ్లాగు ని ఇప్పుడే చూసాను.నాకిష్టమైన చందమామ గురించి బోలెడు సమాచారముంది మీ బ్లాగు లో.
   రామకృష్ణ

 3. వేణు says:

  రామకృష్ణ గారూ, మీరు ప్రస్తావించిన MKB బొమ్మరిల్లులో ‘మృత్యులోయ’ సీరియల్ గా వచ్చినపుడు చక్కటి బొమ్మలు వేశారు. (ఆయన బొమ్మలపై చిత్రా ప్రభావం కనిపించింది నాకు). ఈ నవలను రెండు భాగాలుగా పుస్తకంగా వేశారు. రచయిత జానపద కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారే!

 4. Dear Ramakrishna,the stories in chandamama&balamithra are missing the presant genaration& there by they are not cultivating the good human relations.besides humanvalues. The otherday an incident took plabe near new collectrate chittoor,which is pinching my heart so much. A girl has been burnt by an autodriver by pouring kerosine all over her body for rejecting his praposal of love.He has been remanded to judicial custody for 14days. I prapose my friends not entertain bail application for such criminals.

  • mhsgreamspet says:

   @venu garu,
   మీరు చెప్పిన మృత్యు లోయ నేనూ చదివానండి. కుందేలు- నక్క కథల కు తను వేసే బొమ్మలు ఎంతో బాగుండేవి. బొమ్మరిల్లు లో తరవాతి రోజుల్లో కేసి గారు బొమ్మలు వేసే వారు. తనదీ ఓ శైలి ఉండేది.
   @ ప్రసన్న
   నువ్వు చెప్పిన వార్త నేనూ చదివాను. ఎందుకో అలాంటివి తలచుకోటానికి కూడా మనస్కరించటం లేదు. మనిషి లో ఇంత క్రౌర్యం ఎలా వస్తుందో…?మళ్ళీ మన పిల్లలు మన కాలం లోని సంస్కృతికి అలవాటు చేయటానికి (కష్టమైనా ..) ప్రయత్నించాలి .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s