డబ్బుకు యజమాని

ముప్పై ఏళ్ళ ముందు వచ్చిన ఓ చందమామ సంచిక లోని బేతాళ కథ టైటిల్ ఇది. ఒక డబ్బున్న లోభి కి తెలివైన చిన్న కోడలు. ఓ సారి అతను పని పై పక్క వూరు వెళ్ళాల్సి రావటం తో, కోడలికి ప్రయాణం లో తినటానికి ఏదైనా కట్టివ్వ మంటాడు. కోడలు రుచి కరమైన నేతి పులిహోర, చక్కర పొంగలి చేసి కట్టి ఇస్తుంది. మార్గ మధ్యం లో ఓ చెట్టు కింద విశ్రమించి, తినటానికి మూట తీసి చూస్తే, ఎంతో రుచి కరమైన, … కాని ఖరీదైన ఆహారం. అది తింటే, అదే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, ఖర్చు పెరుగుతుంది అని, పక్కనే ఉన్న పాడు పడ్డ నుయ్యి లో పారవేస్తాడు. ఆ నూతిలో ఉన్న ఓ శాపగ్రస్తుడైన యక్షుడు ఆ ఆహారాన్ని తిని, లోభి కి ప్రత్యక్షమై తన క్షుద్భాధ తీర్చినందుకు ఏదైనా కోరుకోమంటాడు. లోభి తనకి ఏమీ అవసరం లేదని, తన కోడలిని అడిగి  కోరుకుంటానని  వెళ్ళిపోతాడు. విషయం విన్న కోడలు, “తన డబ్బుకు తనే యజమాని” గ ఉండాలని యక్షున్ని కోరుకోమని చెపుతుంది   మామ గారికి . ‘తన డబ్బు కు తను కాక ఇంకెవరు యజమాని’ అని ఒకింత విసుక్కున్నా , ఎందుకు లెమ్మని యక్షున్ని అలాగే కోరుకుంటాడు ఆ లోభి. అప్పట్నుంచి, అతని లో మార్పు రావటం మొదలౌతుంది. ఎందరికో దాన ధర్మాలు చేసి, జన్మ సార్థకుడు అవుతాడు ఆ లోభి.

బేతాళుడు ఇక్కడే కథ ఆపి, విక్రమార్కుడిని లోభి మారడానికి కారణం అడుగుతాడు. లోభి గ ఉన్నంత వరకు, తన సంపదని సద్వినియోగించక, బానిసలా ఉండేవాడని, డబ్బు కు యజమాని అవడంతో డబ్బుని శాశించి గలిగి, నలుగురికీ ఖర్చు చేయ గల స్వేచ్చ పొందాడని చెపుతాడు విక్రమార్కుడు .

ఈ కథ చదివి (చివరి సారి గా..) ముప్పై సంవత్సరాలు అయ్యాయి. ఇప్పటికీ .. ఈ కథ నేను నా పిల్లలకి చెప్పే నా కిష్టమైన బెడ్ టైం కథ.. ఎన్నో సార్లు, నాకు నేను అన్వయించుకున్న కథ.. డబ్బే సర్వస్వం.. మేటీరియలిసమే ముఖ్యం అనుకుంటున్న ఈ రోజులలో.. ఇలాంటి కథలు పునశ్చరణ చేసుకోవటం ఎంతో ముఖ్యం.

Advertisements
This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

6 Responses to డబ్బుకు యజమాని

 1. Ramakrishna,the story that u hav made me2recollect after 30years is really a gud one.which is very much required4the prent day trend.

 2. R Suresh says:

  dr friends,
  hope u friends will identify me.
  in 10th std. i am the person sitting
  in frent line in the class alongwith
  krishna and vijay.
  i am thankful whole heartedly to
  Sh ramachandra for giving the address
  of the web-site and convey my
  wishes to all my friends. I am just late
  by one month to meet u friends.
  Hope i will meet in next year.

 3. Dear suresh, iam very happy 2 see ur coments in our site.Do u rember me? This is prasannakumar.M,Advocate,chittoor.ur classmate 4m 6th to 10th.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s