అక్కడ నిశ్శబ్దాన్ని వినొచ్చు…

స్తబ్దత.. అన్నది ఒక్కోసారి అవసరం. ఆ స్తబ్దత  లో మనల్ని మనం అర్థం చేసుకోవచ్చు. పరుగెడుతూ ఒక్క సారి, ఎంత దూరం వచ్చామో, ఎంత ముందుకు వెళ్ళాలీ అన్నది బేరీజు వేసుకోవచ్చు… (కొన్ని సార్లు అసలు ఈ పరుగు అవసరమా అన్న ప్రశ్నకు అర్థమూ వెతుక్కోవచ్చు. కాని అలంటి స్తబ్దత రావాలంటే చుట్టూ నిశ్శబ్దం కావాలి. కానీ డెడ్ లైన్స్, బెంచ్ మార్క్స్ అంటూ ఉరకలేసే జీవిత గమనం లో అలాంటిది పొందాలంటే… ఓ మంచి చోటు కు వెళ్ళడం తప్పని సరి.

అలంటి ప్రదేశాలలో నాకు నచ్చింది హార్స్లీ కొండలు. మదనపల్లి కి 15 కిలో మీటర్ల దూరం లో ఉంటుంది. ఏడాది పొడవున 30 డిగ్రీల ఉష్ణోగ్రత. కులూ, మనాలి లో ఉండే రద్దీ ఇక్కడ ఉండదు. పొద్దుట వచ్చి, సాయంత్రానికి వెళ్ళిపోయే యాత్రికులేక్కువ. ఇంకో నచ్చే విషయం ఏంటంటే.. ఈ ప్రదేశం వైశాల్యం లో చాల చిన్నది. మొత్తం వూరు ఒక గంట లో చుట్టి వచ్చేయోచ్చు. ప్రకృతి ని ఆస్వాదిస్తూ, అక్కడి చల్లటి వీచే గాలితో మాటలాడుతూ, సంధ్యా సమయం చూడటం గొప్ప అనుభూతి. నిశ్శబ్దం ఎంతో శ్రావ్యం గ వినొచ్చు. మన గుండె చెప్పే ఊసులని స్పష్టం గ వినొచ్చు. ఇక్కడ ఉన్న పున్నమి రిసార్ట్స్ , రైల్వే గ్వేస్ట్ హౌస్, ఫారెస్ట్ గ్వేస్ట్ హౌస్, ఒకటి అరా ప్రైవేటు ఇళ్ళలో నివాస వసతి ఉంది. చక్కటి రెస్టారెంట్ తో పాటు, మన డిమాండ్ కి తగ్గట్టు గ వండి పెట్టే ప్రైవేటు వసతి కూడా ఉంది. ఈ నాణ్యమైన నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలంటే, ఓ పూర్తి రోజు ఇక్కడ ఉండాల్సిందే. వెన్నెల ని చూసుకుంటూ, నడుచుకుంటూ.. మనలో మనం తొంగి చూసుకుంటే.. ఏదో చెప్పలేని ప్రశాంతత. గాలి బండ అన్న ప్రదేశం దగ్గర, గాలి చేసే విన్యాసాలు వినాలి.. చూడాలి.. అక్కడ నుంచుని కనుమల లోకి కుంగుతున్న సూర్యున్ని చూస్తుంటే.. అక్కడికి రాకుంటే జీవితం లో ఎంత అందమైన దృశ్యం కోల్పోయే వాళ్ళమో తెలుస్తుంది.

తత్వ వేత్త జిడ్డు కృష్ణ మూర్తి జన్మ స్థలం ఇక్కడికి దగ్గరలోనే. అతను స్థాపించిన  రిషి వాలీ  పాటశాల , కొండ దిగిన వెంటనే వస్తుంది. ఆ పరిసరాలలో  ఏదో చెప్పలేని అనుభూతి.. మన జాతీయ గీతం రవీంద్ర నాథ్ టాగూర్ రాసింది, స్వరపరిచిందీ మదనపల్లె లోనే. ఈ ప్రదేశాల లో ఏదో మహత్తు ఉంది.. ఎన్నో సార్లు అనుకున్న ఇప్పటికి 5  సార్లు మాత్రమే వెళ్ళాను. రెండు సార్లు సురేంద్ర కుటుంబం తో వెళ్తే, ఒక్క సారి, మన రాజంపేట చిన్నోడు, సురేంద్ర, మధు తో వెళ్ళాను. వెళ్ళిన ప్రతి సారి, ఒంటరి గ వెళ్లి, ఓ ప్రదేశం లో కూర్చుని నన్ను నేనే పలకరించుకునేవాడిని.

కొండ దిగి return వస్తూ ఉంటె, దారిలో జింకలు నీళ్ళు తాగే తటాకం , దాని వెనక ఆకాశాన్ని ముద్దాడే వృక్షాలు చూసు కుంటూ… గుర్తొచ్చే వాక్యాలు “Woods are lovely, dark and deep… but i have promises to keep… and miles to go before i sleep … and miles to go before i sleep…”

Advertisements
This entry was posted in నాడు-నేడు. Bookmark the permalink.

7 Responses to అక్కడ నిశ్శబ్దాన్ని వినొచ్చు…

 1. chinni says:

  చాల మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండీ ..చాల బాగా రాసారు ,అక్కడ ఉన్నట్లే ఫీల్ అయ్యేట్లు ….చూడాలి .రాబర్ట్ ఫ్రాస్ట్ రాసింది కదండీ ..స్టాపింగ్ బై వుడ్స్..

  • mhsgreamspet says:

   చాల థాంక్స్ అండి. మీరు చెప్పినట్లు గ రాబర్ట్ ఫ్రాస్ట్ రాసిందే … నెహ్రూ గారు కూడా ఈ కొటేషన్ ని ఉటం కించేవారు.

 2. Ramakrishna,what a fantastic experience in horselyhills. Due2 some problems i missed the tour of horselyhills in my 5th class 4m ps.elementosy school,karvetnagar But i made my 1st visit with Rama on 25.6.10&my 2nd visit with u during july2007.It’s very lovely place..

 3. Dr. Vijayakrishna says:

  Hello Pals,
  I was born and brought up in CTR but did not visit that place yet. After reading Ram’s article on the “hills”, I am really feeling bad now. We will plan for it in our next visit to India.
  Thanks Ram for the article.
  Vijay

 4. Dear Ramakrishna,there is a correction in the date of my 1st visit 2 horselyhills.By mistake i mentioned as 25.6.10,it should be red as25.6.94. With Deepavali greetings.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s