నిజమైన “స్వర్ణం”

“పాదమెటు పోతున్నా .. పయనమెందాకైనా.. అడుగు తడబడుతున్న…తోడు రానా..” (హ్యాపీ డేస్)

“ప్రతి దినం నీ దర్శనం ..మరి దొరకునా.. దొరకునా..నిను చూడలేని రోజు నాకు రోజు కాదు ” (అనుమానాస్పదం)

“నిండు నూరేళ్ళ సావాసం.. స్వర్గమవ్వాలి వన వాసం..”(ప్రాణం)

“నే పాడితే లోకమే పాడ దా…” (మిస్సమ్మ)

ఈ పాటలన్నిటిలో కామన్ ఏమిటో తెలుసా..? ఈ పాటలకి నృత్య రీతులు కూర్చింది ఒకరే.. సినీ జగత్తు లో సుపరిచితమైన నృత్య దర్శకురాలు  “స్వర్ణ మాస్టర్”, ఓ చిన్న వూళ్ళో 1976 – 81 లో మనతో చదువుకున్న సాధారణమైన… కాని గమ్యాన్ని ఎప్పుడూ మొక్కవోని  విశ్వాసం  తో,  అకుంఠిత    దీక్షతో మరవని ఓ అమ్మాయి… మనకందరికీ తెలిసిన స్వర్ణ లత. అసలు చదువుతున్నప్పుడు… మనం ఏమి కాదల్చుకున్నమో ఏ నాడు ఆలోచించని మన వాళ్ళలో … ఆ రోజుల్లోనే, తను ఏమి కాదల్చుకున్నది  అన్న విషయం లో చాల స్పష్టత గల అమ్మాయి..స్వర్ణ.

తన ఇల్లు, మా ఇల్లు వెళ్ళే దారి ఒకటే.. ఒక సారి.. తన కి నృత్య పోటీలలో వచ్చిన బహుమతులు, ఫోటో లు నాకు , ఇంకో మిత్రునికి (ఎవరో గుర్తు రావటం లేదు) చూపిస్తూ.. భవిష్యత్తు లో సినిమాల లో స్థిరపడతానని చెప్పటం నాకు ఇప్పటికీ గుర్తే. బహుశ తొమ్మిదో తరగతి లో ఉన్నప్పుడు అనుకుంటాను మా వీధి లో వినాయక చతుర్థి ఉత్సవాలు (లేక దసరా. గుర్తు లేదు) జరుగుతున్నప్పుడు, తన డాన్సు ప్రోగ్రాం అరేంజ్ చేసారు. “యమగోల’ లో “ఆడవే అందాల సురభామిని..” అన్న పా కి నృత్యం . చేస్తున్నప్పుడు, ఓ సందర్భం లో జడ లో ని పూల మాల విడి పోయి నృత్యానికి అంతరాయం కలగటం మొదలైంది. ఎలా మేనేజ్ చేస్తుందో అని నేను అనుకుంటుంటే  … ఇంతలో ఎంతో ఒడుపుగా.. ఆ పూమాల ని తెంచి విసిరేసి అంతా నృత్యం లో భాగమేమో అన్నంత అభిప్రాయం కలుగచేస్తూ, నృత్యం పూర్తి చేసింది. ఆ సమయ స్ఫూర్తి చూసాక అర్థమైంది.. తనకి ఎంత ప్రతిభ ఉందొ.

అప్పటికి.. ఇప్పటికి తన మాటల లో సౌమ్యత చెక్కు చెదరలేదు. ఎంత బిజీ గ ఉన్న కూడా, అందరితో ఫోన్ లో ఆప్యాయం గ మాట్లాడుతూ , అప్పటి స్వర్ణ గానే ఉంది. గత సంవత్సరం , మనం కలిసినప్పుడు రావటానికి టికెట్ రిజర్వేషన్ చేసుకున్నా… వృత్తి రీత్యా కుదరలేదు. ఒక టీ వీ ప్రోగ్రాం లో మన మిత్రులందరినీ గుర్తు చేసుకోవటం మన వాళ్లకు ఎంతో ఆనందమని పించింది.

మనిషి నిజ స్వరూపం చూడాలంటె తనకి పవర్ ఇచ్చి చూడు అని ఓ నానుడి. ఎన్ని కీర్తి శిఖరాలు అధిరోహిస్తున్నా … తన అప్పటి వ్యక్తిత్వం చేక్కుచేదరలేదంటే.. ఆమె నిజంగా “స్వర్ణ” మే …

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

10 Responses to నిజమైన “స్వర్ణం”

 1. chinni says:

  చాలా సంతోషం మీ మైత్రివనం లో ని “బంగారు తీగ “పరిచయం.

  • mhsgreamspet says:

   థాంక్స్ బిందు గారు.. స్వర్ణ నృత్య దర్శకత్వం చేసిన పాటలు మీకిష్టమైన గోదావరి నేపధ్యం లో ఎన్నో ఉన్నాయి.. ఔను వాళ్ళిద్దరూ ఇష్ట పడ్డారు, గోపి.. గోపిక గోదావరి, ఆనంద్, రోదావరి, సరదాగా కాసేపు… ఇవీ తన choreography లోని కొన్ని మచ్చు తునకలు. ఒక వ్యక్తి గ కూడా మన అందరికీ తను అభిమాన పాత్రురాలు.

 2. Ramakrishna,belated Deepavali wishes2our beloved friends.our friend swarna has given dance programe during Durgamba Dasara celebrations when we were in8th class by the side of Durgamma temple.

 3. Dr. Vijayakrishna says:

  Yep…. I still remember those days… Swarna used to take dance lessons at “Jupiter Balananda Sangham” (located on our street). I used to volunteer for the Balananda sangham in those days. Very dedicated and hard working girl. I and Suji appreaciated her call very much during our last visit to India.

  Vijay

 4. D S KRISHNAN says:

  I AM EXHILARATED THAT SWARNA LATHA HAS EXCELLED TO BECOME AN DANCE MASTER CUM CELEBRITY.. I STILL REMEMBER HER SCHOOL FACE ONLY. SEE HOW HER AMBITION TOOK HER TO HEIGHTS . WITH EVERYTHING BUT WITHOUT AMBITION U CANT REACH HEIGHTS . I AM PROUD OFBEING HER BATCHMATE .. SWARNA, BABU, VIJAYA KRISHNA TOUCHED PEAK AT RIGHT TIME , THIS IS WHAT I WANT TO SHARE WITH MY FRIENDS CHILDEREN HAVE AMBITION AND TOUCH PEAK AT RIGHT TIME IN ANY FIELD

 5. Swarna says:

  thnx 2 all my frndz for there love n afection 2wards me…n 4ur comments….by seeling all ur comments i felt really happy and derz no end 2 it…n especially i shud thnx rama krishna for gathering all our clsassmates n once regaining those memorable days….n one more thing i wish 2 see all ma classmates family photos…juz pass it 2 me r place it in diz website…!!!!

 6. Swarna,thanx4remembering almost all of our school mates. Ramakrishna i will send my family photo in a day or 2 ,whenever my son Himacharan finds time,as i have2take his assistance2keep the family photo in our site.

 7. T.PATTABHI RAMAN says:

  ఈ వెబ్సైటు ద్వారా స్వర్ణ ను చూడడం చాల చాల సంతోషం గ ఉంది. లేడీ త్రిమూర్తులు అంటే వీరే నేమో. నాకు కూడా గుర్తు ఉంది, సప్తపది సినిమా లో “నెమలికి నేర్పిన నడకలివి” పాట కు డాన్సు చేసినట్లు గుర్తు. విజయకృష్ణ అన్నట్లు, బాలానంద సంఘం అనసూయ మేడం ఇంటి ప్రక్కన ఉండేది. చాల వరకు నేను కూడా అన్ని ప్రోగ్రామ్లకు వస్తుంటాను. నా వరకు గ్రేట్ ఏమంటే మన క్లాస్స్మేట్ ప్రోగ్రాం అంటే, నేనే ఏదో ప్రోగ్రాం ఇచినట్లు ఫీల్ అవుతుంటాను అప్పట్లోనే. ఇప్పుడే స్వర్ణ తో మాట్లాడినాను. చాల సంతోషమైంది. మన స్నేహిత బృందం కల కాలం ఇలాగె సరదాగా సంతోషం గ సాగాలని మనసార కోరుకుంటున్నాను.

 8. Pattabhi,ur coments about jupiter balananda sangham&swarna’s dance memories of our schoolday are quiet interesting.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s