సుస్వరాల రస లీల… సుశీల

జాలు వారే వెన్నెల,

తేనె లాంటి తీయని కల,

వసంతాల పట్టింపు లేని  గాన కోకిల,

అసమాన స్వరాల సుశీల
ఆమె గాత్రం వింటే.. నాస్తికుడికి కూడా భక్తి కలగాల్సిందే.. ఆ లాలి కి చిన్ని పాప ఏడుపు ఆపి నిదురోవాల్సిందే.. ఎంతటి పాషాణుడికైనా  కూడా హృదయం కరగాల్సిందే..
ఆమె లేకుంటే.. పాటలు అసలు ఎలా మనగలిగేవా అనిపిస్తుంది. అలాంటి కారణ జన్మురాలు… మన సుశీలమ్మ.  తన పాటలు.. ఏవి బాగున్నాయి అంటే చెప్పటం కష్టమే.. నాకు ఎప్పటికి మరుపు రాని కొన్ని పాటలు మీతో ఇలా పంచుకుంటాను.

1. మనసెరిగిన వాడు…మా దేవుడు.. శ్రీ రాముడు..

మధుర.. మధురతర శుభ నాముడు..గుణ ధాముడు
ఎరిగినవారికి ఎదలో ఉన్నాడు.
ఎరుగున వారికీ ఎదుటే ఉన్నాడు..
మానవుడై పుట్టి మాధవుడైనాడు
తలచినవారికి తారక నాముడు
పిలిచిన పలికే  చెలికాడు సైదోడు
కొలువై వున్నాడు కోదండ రాముడు..
మన తోడుగా … నీడగా… రఘు రాముడు..

భక్తి పాటలలో సుశీలమ్మ గాత్రం లో స్వచ్చత, దేవుడి పట్ల నిజాయితి కనపడుతుంది. అసలు భక్తి భావం అంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది. పంతులమ్మ లోని ఈ పాట లో  రాముని పై ప్రకటించే భక్తీ.. సుశీలమ్మ స్వరం లో ఓ అలౌకిక ఆనందాన్ని ఇస్తుంది. దేవుడి పై  భక్తీ లేని వారికి కూడా .. ఈ పాట లో ఏదో తెలియని సాంత్వన దొరుకుతుంది. అదే సుశీలమ్మ గాత్ర మహిమ

2. ఈ రాధకు నీవేర ప్రాణం..
రాధా హృదయం..
మాధవ నిలయం..
ప్రేమకు దేవాలయం
నీ ప్రియ వదనం.. వికసిత జలజం.
నీ శుభ నామం.. జాబిలి కిరణం..
నీ శుభ చరణం…
ఈ రాధకు శరణం

“వికసిత జలజం”, “జాబిలి కిరణం”…  ఎంత చక్కటి పదాల పొందిక..? ఇలాంటి శబ్దాలు ప్రస్తుత సాహిత్యం లో ఎంత అరుదై పోయాయి..? తులా భారం చిత్రం లోని ఈ పాట రాధ లోని మనో భావాలకు అద్దం పట్టడం  లో ఓ ఉత్కృష్ట స్థాయి కి చేరుకుంది. సుశీలమ్మ గొంతు లో రాధకున్న దుఖం, భక్తి , కృష్ణుడి పై ఉన్న తాదాత్మ్యత జీవం పోసుకున్నాయి.
3. నీ మది చల్లగా..
స్వామీ నిదురపో,,
దేవుని నీడలో..
వేదన మరిచిపో..
ఏ సిరులెందుకు
ఏ నిధులెందుకు
ఏ సౌఖ్యములెందుకు
ఆత్మ శాంతి లేనిదే..
మనిషి బ్రతుకు నరకమౌను
మనసు తనది కానిదే

ధనమా.. దైవమా లోని ఈ పాట  ఎంత stress లో ఉన్నా ఓ సారి వింటే చాలు .. ఎంతో సేద తీర వచ్చు. ఇందులోని ప్రతి పదం ఆ స్వరం లో వింటే… ఎంతో ఓదార్పు.ఈ ట్యూన్ ని  హిందీ లో లతా గారు కూడా అంతే మధురం గ “ఖిల్తే హై గుల్ యహా..ఖిల్ కే బిచడ్నేకో…” అని పాడినా..  సుశీలమ్మ తెలుగు పాట ఇంకో లోకం లోకి తీసుకెళ్తుంది.
4.లాలి.. లాలి.. లాలి.. లాలి..
వటపత్రశాయి కి వరహాల లాలి
రాజీవ నేత్రునికి రతనాల లాలి..
మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి..

5. కర్పూర బొమ్మవు.. నువ్వు..
లావణ్య రాశివి.. నువ్వు..
చిందించు నాలోని అందం..

స్వాతి ముత్యం, ఓ పాపా లాలి లోని ఈ రెండు పాటలు.. అమ్మతనం లోని కమ్మతనాన్ని పతాక స్త్హాయి లో చూపుతాయి. అమ్మ పాట అనగానే.. అమ్మ గొంతు ఇలా ఉండాలీ.. అని అనిపించే లాలిత్యమున్న స్వరం తనది.

6. నల్లనయ్యా.. ఎవరని అడిగావా నన్ను..
మురళిని కాలేను.. పించమైనా  కాను..
ఎవరని చెప్పాలి నేను.. ఏమని చెప్పాలి నేను,,
(పల్లవి)
వలచిన రాధమ్మను  విరహాన దించావు
పెంచినమ్మ  యశోదమ్మను శోకాన ముంచావు..
నీవు నేర్చినదోకటే
నిను  వలపించుకోవటం
నాకు తెలియనిదోకటే
నా మనసు దాచుకోవటం . (తొలి చరణం)

ఇలా సాగుతుందీ పాట. మా ఇద్దరి కథ చిత్రం లోనిది.  కృష్ణుని భక్తురాలిగా ఆ దేవుణ్ణి నిందిస్తూనే తన ప్రేమను ప్రకటించటం .. ఆ పాటను.. కథానాయకునికి (ఎన్. టీ. ఆర్)   అన్యాపదేశం గ వినిపిస్తూ కథానాయిక (మంజుల అనుకుంటాను) తన ప్రేమని నివేదించుకోవటం చాల సున్నితం గ ఉంటుంది. ఈ పాట కి సుశీలమ్మ గాత్రం ప్రాణం పోసిందనే చెప్పాలి. మనం ఏడవ తరగతి లో ఉన్నపుడు, ఎం. ఎస్. ఆర్ లో వచ్చిందీ సినిమా.

ఇలా ఇంకో ఎన్నో ఉన్నా… నాకు మెరుపులా మెరిసిన గీతాలివే… మిగతా  ఆణి ముత్యాలను  ఇంకో సారి పంచుకుంటాను.

Advertisements
This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

One Response to సుస్వరాల రస లీల… సుశీల

  1. Dear Ramakrishna,it.’s marvelous 2remined the sweet voice of Gana kokila suseela.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s