రంగు వెలిసింది ఫోటో కే కానీ…. జ్ఞాపకాలకు కాదు!

పై ఫోటో ఏడవ తరగతి గ్రాండ్ టెస్ట్ రాసి చివరి రోజున ఎలెమెంటరీ స్కూల్ లోని ఆవరణ లో తీసుకున్న గ్రూప్ ఫోటో. ఈ ఫోటో తీయించింది, మన డ్రాయింగ్ మేష్టారు నారాయణ గారే.

రామచంద్ర ఆలయాస్ రాజంపేట చిన్నోడు, నేను ఎప్పుడూ పక్క, పక్కనే. నచ్చిన వాళ్ళు జంట కవులన్నా, బేసిక్ గ ఇద్దరం తోడు దొంగలు. ఆ ఫోటో తీసుకునేటప్పుడు, మనం కాస్త డిఫరెంట్ గ కనపడాలని నడుం పై హీరో లాగా చేతులు పెట్టుకుని నించున్నాను. ఇది నచ్చని రామచంద్ర చేతులు కట్టుకున్నట్లు గ ఫోజు పెట్టి, తన ఎడమ చేతి చిటికిన వేలితో నన్ను గిల్లాడు, చేతులు నడుం పైనుంచి తీసి మామూలు గ నున్చోమని.. కానీ మనం వింటేగా.. జాగ్రత్త గ మీరు చూసారంటే, పై వరుస లో చివరి ఇద్దరి ఈ తమాషా గమనించొచ్చు.

ఈ ఫోటో 6 -3 -1978 న తీసుకున్నది. పై వరుస లో ఉన్న మొదటి వ్యక్తి.. మోహన్… మూడవ వ్యక్తి శంకర్ ఇద్దరు ఈ లోకం లో లేరు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం. క్లాసు టీచర్ పరమేశ్వరి మేడం ఇప్పుడు శ్రీకాళహస్తి లో ఉన్నారు. ఇందులో ప్రసన్న, కే. కే, కలై వాణి , గాయత్రి , శరత్ , బాల, ఇప్పటికీ టచ్ లో ఉన్నారు. నించున్న వాళ్ళలో పై నుండి రెండో వరుస లో ఏడవ వ్యక్తి నిక్ నేమ్ డీగు. రఘురాం సెవెంత్ మొదట్లో ఉన్న కొద్ది రోజులలో తనని ఆ పేరు పెట్టి పిలిచి ఏడిపించే వాడు. తన అసలు పేరు సురేష్. ఇప్పుడు రెడ్డిగుంట లో ఉన్నాడు. మనిషి లో మార్పు ఏమి లేదు. సురేంద్ర పెళ్ళిలో , ఇరవై ఏళ్ళ తరవాత నన్నువెంటనే గుర్తు పట్టి పేరు పెట్టి పలకరించటం నాకు ఆశ్చర్యం, ఆనందం కలిగాయి.

ఈ ఫోటో కింద రాసిన పేర్లు.. నేను అప్పట్లో రాసినవే.. మా నాన్న మా అన్నయ్య వాళ్ళ కాలేజీ గ్రూప్ ఫోటో కి అందరి పేర్లు రాసారని, తనకి పోటీగా నేనూ అప్పట్లో అలా .మన ఫోటో కి రాయటం ఇప్పుడు ఉపయోగపడింది.

ముప్పై ఏళ్ళ పై బడ్డ జీర్ణావస్థ లో వున్న ఈ ఫోటో కి రంగులు వెలిశాయి.. కానీ దీనితో అల్లుకున్న స్మృతుల తటిల్లతలు ఇప్పటికి మన అందరినీ అంటి పెట్టుకునే వున్నాయి

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

2 Responses to రంగు వెలిసింది ఫోటో కే కానీ…. జ్ఞాపకాలకు కాదు!

  1. Dear Ramakrishna,it’s nice 2 hav glance at the photo dated 6.3.78. I lost the photo &could able2see, as u hav placed in our site. Thanx 4 placing the same after 32years.

  2. P.Sasi Kiran says:

    cool photo guys where did u collect it dat waz awesome.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s