శీతా కాలం గుర్తొచ్చే ఓ పాట..

శీతా కాలం వస్తోంది మెల్ల మెల్లగా. వెళ్తుంటే ..చల్ల గ తాకుతూ పలకరించే శీతల పవనాలు..  నా చదువుతున్న రోజుల నుండి  నన్ను వెంటాడే ఓ చక్కని గుల్జార్ పాటని గుర్తు తెస్తాయి. గుల్జార్ అసమాన బహుముఖ, ప్రతిభ కలవాడు.. తను పరిచయ్ లో “ముసాఫిర్ హు యారో..” లాంటి పాట రాయగలడు..   మక్డీ లాంటి చిన్న పిల్లల సినిమా తీయ గలడు.. మాచిస్ లాంటి సమకాలీన సమస్యల పై వాస్తవిక చిత్రం చూపించగలడు… ఈ మధ్య నే వచ్చి వెళ్ళిన రెయిన్ కోట్ లాంటి సినిమా లో శాయిరీలు రాయగలడు… తన విలక్షణమైన స్వరం లో వినిపించ గలడు కూడా..  తన పాటలలో పదాలు, హిందీ తెలిసిన వారికి కూడా ఒక్కోసారి అర్థం కావు.. పద బంధనం  లో కాని,  ఉర్దూ మిళిత పదాల అల్లిక లో ను తనదైన శైలి.. కాని ఆ పాటలు ముఖ్యం గ మనం చదువుకునే రోజుల్లో (ఆంధీ, మౌసం  లాంటి చిత్రాలు) వింటుంటే… ఎక్కడికో తీసుకెళ్తాయి.


అలాంటి పాటల లో ఓ
విలక్షణమైన పాట  ‘మౌసం’ లో తను రాసిన… “దిల్ డూండ్ త …హై.. ఫిర్ వహి … ఫుర్సత్ కే రాత్ దిన్” అన్న పాట  . మదన్ మోహన్ సంగీతం లో … లతా, భూపిందర్ పాడిన ఈ పాట విన్న ప్రతి సారి.. ఓ కల లోకం లోకి వెళ్లి పోతాము. ఈ పాట లోని చాల పదాలు అర్థం అయ్యేవి కావు కానీ భావం అర్థమయ్యేది.. పీ.జీ చేసేప్పుడు నాతో పాటు చదువుకునే కిషోర్ కుమార్ అనే ఓ రాజస్తాన్ మిత్రున్ని పీడించే వాడిని ఈ పదాలకు అర్థం చెప్పమని.

ఈ పాట లోని భావం డిఫరెంట్ planes లో ఉంటుంది. స్థూలంగా పల్లవి, మొదటి చరణం భావం  ఇలా ఉంటుంది..


హృదయం మళ్ళీ ఆ నాటి తీరిక గ గడిపిన రోజుల్ని అన్వేషిస్తోంది..
అలా హాయి గ కూర్చొని, మన ఊహలని తిరుగాడనివ్వాలి. (ఇది పల్లవి)
ఓ శీత కాలం రోజు లేత సూర్య కిరణాల్ని ఆస్వాదిస్తూ, ప్రాంగణం లో విశ్రమించి , కళ్ళ పై పడుతున్న నీ ఉత్తరీయం యొక్క చాయ లో ,  అటూ ఇటూ వొత్తి గిల్లుతూ.. (మొదటి చరణం)

ఇలా సాగుతుందీ పాట. ఇందులో, పదాల పొందికా.. అందులో నిబిడీకృతమైన భావోద్వేగపు తాకిడో.. తేనె లాంటి లతా గాత్రమో… మదన మోహనుడి సంగీత మాయా జాలమో.. ఏది కారణమో తెలియదు కాని … ఈ పాట ని ఎప్పుడు ఎన్నో సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది.

రెండో చరణం లో ఓ వేసవి రాత్రి, చల్లటి,తెల్లటి దుప్పట్లో ఒదిగి పోయి, మిద్దె పై పడుకుని ఆకాశం లో మినుకుమంటున్న చుక్కల్ని చూస్తూ మేలుకుని ఉంటూ… అన్న భావం తో ఉంటుంది.

మామూలుగా చూస్తే, ఇందులో ఏమి భావముందీ అనిపిస్తుంది  కూడా.. బాగా గమనిస్తే… గుల్జార్ లోని స్వాప్నిక జగత్తు ఆవిష్కృత మౌతుంది. దోసిళ్ళలో జారిపోతున్న జీవితపు క్షణాలను ఓడిసిపట్టుకోవాలన్న తపన వ్యక్తమౌతుంది. ఇది నా ఒకానొక favorite haunting మెలోడి.

Advertisements
This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

4 Responses to శీతా కాలం గుర్తొచ్చే ఓ పాట..

  1. Mahek says:

    నాకీ పాట డ్యూయట్ గా కన్నా, భూపేందర్ పాడిన సోలో ఇష్టం.సోలో మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఈపాట మూడ్ ని ఆ మ్యూజిక్ చాలా ఎలివేట్ చేసిందని నాకు అనిపిస్తుంది.నాక్కూడా చాలా ఇష్టమైన పాట.

    • mhsgreamspet says:

      మహెక్ గారు…
      చాల థాంక్స్ అండి. ఒకే సాహిత్యానికి, రెండు ట్యూన్స్ ఒకే చిత్రం లో వాడుకున్న అరుదైన పాట ఇదేనేమో. రెండూ బాగుంటాయి. మదన్ మోహన్ గారు ఈ పాటకి 20 ట్యూన్స్ అందించారని, అందులోంచి రెండు తీసుకున్నారని చదివాను.
      రామకృష్ణ

  2. chinni says:

    మీ ఆర్టికల్ పుణ్యమాని ఇప్పుడే కొత్త బ్లాగ్ చూసాను ,మేహెక్ బ్లాగ్ లో భలే మంచి మంచి పాటలు విన్నాను . జ్ఞాపకాల పరిమళాలు బాగున్నాయండీ .

    • mhsgreamspet says:

      థాంక్స్ అండి… ఆ బ్లాగు లో పాటలు నాకూ బాగా నచ్చేటివే … తన తెలుగు పాటల క్విజ్ కూడా బాగా నచ్చింది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s