ఓ ప్రముఖ హీరో పక్కన కొద్ది సేపు..

జీవితం లో అప్పుడుప్పుడూ తమాషా సంఘటనలు  జరుగుతుంటాయి. అలాంటిదే ఇదీ అని చెప్పొచ్చు. ఉద్యోగరీత్యా ఓ సారి చెన్నై కి వెళ్తున్నాను. విండో పక్క సీట్ తీసుకున్నాను. తరవాత ఎవరో నా పక్కన వచ్చి కూర్చున్నారు. తోటి ప్రయాణికుల్ని అంతగా గమనించని నేను పత్రిక పటనం  లో నిమగ్నమై పోయాను. ప్రయాణం మధ్యలో దాహమేసి నీళ్ళు  కావాలని అడిగాను . నీళ్ళు తెచ్చి నా పక్కనున్న ప్రయాణీకునికి  అతి వినమ్రం గ ఇస్తుంటే, నాకు నీళ్ళు ఇవ్వరేంటి అని అడుగుతూ, యధాలాపం గ పక్కన కూర్చున్న అతని వైపు చూసాను…. ఎక్కడో చూసి ఉన్న భావన . మనకు ఏవీ లేక పోయినా, సినిమాల పాండిత్యం ఎక్కువ కదా… వెంటనే పోల్చుకోగలిగాను. ఇంకా అర గంట ప్రయాణం ఉంది. అతని తో మాటాలాడాల?  వద్దా? అనే మీమాంస…మనసులో అతను నటించిన సినిమాలు… అందులో నాకు నచ్చిన పాటలు సినీ రీళ్ల  లాగ గిర్రున తిరగ సాగాయి.. విమర్శకుని లాగా ఓ ఫోజు పెట్టి మీరు ఆ సినిమాలో నటించిన తీరు అద్భుతమనో, బాగాలేదనో ఊదర కొట్టేద్దామా అనే ఓ ఆలోచన.. సాధారణం గ వీరు  పబ్లిక్ లో ఫ్రీ గ తిరగలేరు కదా అనే ఓ సానుభూతి .. మనం కుడా ఆ పబ్లిక్ లో ఒకరై… అతడిని ప్రశ్నలతో వేధించటం భావ్యం కాదని మనసు గట్టి గ చెప్పింది.. ఇలా కొంతసేపు డోలాయమాన స్థితి లో ఉండి… చివరికి తనని మాట్లాడి విసిగించ కూడదని ఫిక్స్ అయ్యాను.  అంతే అతని తో అసలు మాట్లాడలేదు. తను కూడా చాల సింపుల్ గ ఉండి, కామిక్ బుక్స్ చదువుతూ కాలం గడిపారు.

ప్రయాణం ముగిసే సమయం లో మాత్రం ఓ గుర్తు పెట్టుకో తగ్గ ఘటన జరిగింది. బయట కొచ్చే సరికి తనని గుర్తు పడుతున్న అక్కడి స్టాఫ్ ని చూసి సినీ స్టైల్ లో అభివాదం చేస్తూ బస్సు ఎక్కారు. ఇంతలో ఓ వృద్ధ జంట ఆలస్యం గ  బస్సు ఎక్కే సరికి, వారు నించో వలసి వచ్చింది. తటాలున ఆ హీరో తను కూర్చున్న సీట్ ఖాళీ చేసి మాతో పాటు నించుండి పోయాడు.  అతని విశాల హృదయాన్ని, సంస్కారాన్ని ఆ క్షణం లో మనసులో మెచ్చుకోకుండా ఉండలేక పోయాను.

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

15 Responses to ఓ ప్రముఖ హీరో పక్కన కొద్ది సేపు..

 1. chinni says:

  ఇదేమి పనండీ ..ఆ హీరో పేరు సస్పెన్స్ లో పెట్టారు …

 2. varalakshmi says:

  nenu thappu kakapothe Rajanikanth ayyuntaru . ayana aythe ne … ala undagalaru

 3. కంగ్రాట్స్…బాగా రాశారు జుట్టు పీక్కున్నా ఏమీ అర్ధం కాకుండా.

  ఒక హీరో(అజ్ఞాత) సామాన్యుడిలా బస్సు ఎక్కడమేమిటో… మీరు మధ్యలో నీళ్ళు అడగటమేమిటో…హీరో మీ పక్కనున్నవాళ్ళకు నీళ్ళు తెచ్చి ఇవ్వడమేమిటో…మీరు నాకివ్వరా అని అడగటమేమిటో…ప్రయాణం ముగిసే సమయానికి హీరో బస్సు ఎక్కడమేమిటో…అప్పటిదాకా కూర్చునిఉన్న మీరు నిలుచుని ఉండటమేమిటో…అంతా మిథ్యలాగా ఉంది.

  • mhsgreamspet says:

   @తేజస్వి గారు,
   ఫ్లైట్ దిగాక బస్సు లో airport బయటికి తీసుకెల్తారు. అప్పుడు నేను నించున్నాను. ఆ విషయం రాశానండి. నీళ్ళు తెచ్చి ఇచ్చింది hostess అండీ. మిమ్మల్ని తిక మక పెట్టినందుకు క్షంతవ్యుడను.

 4. GRK,don’t play our usual suspence tactics with viewers of our site. Our thotti gang can understand ur feelings,but new friends like Himabindhu will suffer.So i suggest u2give details full.

 5. సుగుణశ్రీ says:

  ఇంతకీ ఎవరతను???!!!

  • mhsgreamspet says:

   @dileepu, varalakshm, chinni, sugunasri
   రామాయణం లో పిడకల వేట లాగా తన పేరు తెలుసుకోటానికి ఇంతమంది అడుగుతారని ఊహించలేదు.. అయితే రెండు clues ఇస్తున్నాను… అతనిని చూస్తూనే నాకు గుర్తొచ్చిన సందర్భో చితమైన పాట “నువ్వేనా,,, నేను చూస్తోంది నిన్నేనా…”. ఇక పోతే, ఆ హీరో పేరు… ఈ టపా లోనే ఓ చోట రాసి ఉంది..
   ఇప్పుడు ఊహించి మళ్ళీ కామెంట్స్ పంపండి ప్లీజ్.
   @sugunasri
   madam, we crossed 100 comments. prasanna will get that award provided he pays me commission.:)
   @prasanna
   i have given clues above. R u happy now?:)

 6. విశాల హృదయాన్ని

 7. chinni says:

  ఓహో !ఇతనా మన తెలుగాబ్బాయే .అరవంలో బాగా ఫేమస్ అయ్యాడు

 8. D S KRISHNAN says:

  ee sitelo telugulo bloglante ela?

  • mhsgreamspet says:

   కిట్టా,
   నువ్వేమైనా రాయదలచుకుంటే నా మెయిల్ కి రాసి పంపు. నీ పేరుతో సైట్ లో పబ్లిష్ చేస్తాను.
   రామకృష్ణ

 9. D S KRISHNAN says:

  hallo ramakrishna

  nee email id publish cheyyava please ? veelaite mana valla andari e-mail ids . my email ids ds.krishnan@licindia.com,ds.krishnan@yahoo.co.in, ds.krishnanmahi@gmail.com ee sito lo nenu malli kakhi nikkaru & tella chokka vesukoni malli schoolku velutunnattu vundi

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s