తరలి రాద తనే వసంతం…

కాల భ్రమణం లో ఆ క్షణాలు ఎన్నో దశాబ్దాల  వెనకకి వెళ్లి పోయాయి. ఆ తరలి రాని స్మృతి వనాల కోసం … మనం వాడుతున్న ఈ మాధ్యమం ద్వారా మళ్ళీ ఆ క్షణాల వద్దకు వెళదాం. ఈ ఫోటో మనం ఇంటర్మీడియట్ లో ఉన్నపుడు, 1983 లో తీసుకున్నది. ఇందులో మన స్కూలు వాళ్ళం 8 మంది ఉన్నాము.

పై నుండి


మొదటి వరసలో…8 వ వ్యక్తి… స్టేట్స్ లో ఉన్న విజయ కృష్ణ.. తనకి కుడి వైపు ఉన్న వ్యక్తి (పేరు మరిచాను) వాళ్ళ నాన్న వివేకానంద గారని మంచి రచయిత. అదే వరస లో చివరగా ఉన్న వ్యక్తి చెంగల్రాయుడు తో ఓ నవ్వొచ్చే జ్ఞాపకం. మాథ్స్ క్లాసు లో సున్నా ని సున్నా తో డివైడ్ చేస్తే విలువ ఒకటి అని వాదించాడు. అప్పట్నుంచి, మేము చెంగల్ theory అని పేరు పెట్టేశాము.


రెండవ వరస లో 7 వ వ్యక్తి మన స్కూల్ మేట్  ముని రాజ. తన రైటింగ్ చాల బాగుండేది. ఒక సారి ఇంగ్లీష్ క్లాసు లో wise కి నౌన్ ఫార్మ్ అడిగితే ఎవరూ చెప్పలేదు. అప్పుడు తను లేసి “wisdom ” అని కరెక్ట్ గ చెప్పాడు. అప్పట్నుంచి తన పేరు “wisdom ముని రాజ” గ మార్చేసాము. తన ఎడమ వైపు ఉన్నది శ్రీధర్ రాజు. తను మాథ్స్ లో strong . ఇప్పుడు హైదరాబాద్ లో ఎల్. ఐ. సి. లో ఆఫీసర్ గ ఉన్నాడు. అదే వరస లో ఉన్న 13 వ వ్యక్తి (చారల షర్టు లో )    మన స్కూల్ మేట్ కే. కే. తను మనం ఈ సైట్ లో పెట్టిన అన్ని ఫోటోల లో ఉన్న ఏకైక వ్యక్తి.
మూడవ వరసలో నించున్న 11 వ అతను మన advocate ప్రసన్న (అలా రాయక పోతే నా మీద పరువు నష్టం దావా వేస్తాడు… :-)) .  14 వ వ్యక్తి రాజం పేట చిన్నోడు.. తన పక్కన ఎప్పటి లాగే నేనుండాలని ప్రయత్నించినా , మధ్య లో మోహన్ (తను చెన్నై లో ఉన్నాడు) వచ్చేసాడు. మోహన్ కి ఎడమ వైపున… నేను…  నాకు ఎడమ వైపు ఉన్న వాళ్ళు శ్రీ హరి, ఆదికేశవులు నాయుడు. ఆదికేశవులు గ్రామీణ నేపథ్యం నుండి వచ్చి, మన వూళ్ళో తెలుగు మీడియం లో చదివి, తరవాత బీ. ఎస్. సి. లో university ఫస్ట్ వచ్చి ప్రస్తుతం యు. ఎస్. లో ఉన్నత స్థానం లో ఉన్నాడని విన్నాను. ” కృషి ఉంటె మనుషులు ఋషులు ఔతారు  ” అన్న నానుడి ని నిజం చేసిన  వ్యక్తి తను..


అమ్మాయిల లో మొదటి వరసలో రెండో వ్యక్తి మన స్కూల్ మేట్ అనూ రాధ. తను బెంగళూరు లో ఉంది. కూర్చున్న వాళ్ళల్లో రెండో వ్యక్తి గాయత్రి (రామచంద్ర సిస్టర్). ఆరవ వ్యక్తి మహా లక్ష్మి. ఇద్దరు మన ఊళ్లోనే ఉద్యోగాలు చేస్తున్నారు. ఇందులో తొమ్మిదో వ్యక్తి శైలజ బయాలజీ లో బాగా చదివే అమ్మాయి. తరవాత తను ఐ. ఐ. ఎస్. సి. లో చదివి, ప్రస్తుతం యు. ఎస్. లో ఉంది.

ఈ ఫోటో తీసుకున్నప్పటికి బాల్యపు తాలూకు అమాయకత్వం వీడుతోంది.. పరిసరాల ప్రభావం వ్యక్తిత్వం పై పడే అతి కీలకమైన దశ. చాల మంది భవిష్యత్ ఈ దశ నుంచే కీలకమైన మలుపు తిరిగింది. కొన్ని మంచివి.. కొన్ని నివారించ తగ్గవీనూ..

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

One Response to తరలి రాద తనే వసంతం…

  1. Gud afternoon,Ramakrishna, iam very glad2view the photo dates back to1983&thanks2remember our school&inter friends.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s