గోదావరి పాటలు

గోదావరి అన్న పదం ఎన్నో తెలుగు పాటలకు ఊపిరి పోసింది. గోదావరి అన్నది తెలుగు సంస్కృతి లో ఓ సమగ్ర భాగం. ఎన్నో కవితలకు ప్రేరణ… ఎన్నో భావాలకు నిలువుటద్దం గోదావరి నది… ఆ నేల లో పుట్టి పెరిగిన వాళ్ళకే కాదు… నీటి చుక్క కోసం ఎదురు చూస్తూ.. ఆ చుక్క విలువ తెలిసిన వాళ్ళున్న మన ప్రాంతాల లో కూడా, ఈ నది అంటే ఓ తెలియని పారవశ్యం.. ఓ పులకింత…. ప్రస్తుతం వస్తున్న సినిమాల లో  (ఔను … వాళ్ళిద్దరూ  ఇష్ట పడ్డారు,  గోదావరి, గోపి… గోపిక… గోదావరి ) పాటల లో గోదావరి అందాలను హృద్యం గా చిత్రీకరించిన  నృత్య దర్శకురాలు  స్వర్ణ కూడా మన క్లాస్ మేట్  అయ్యి ఉండటం మనకి గర్వ కారణం. అలాంటి గోదావరి నది పై నాకు బాగా నచ్చే కొన్ని పాటలు …


1 . “కొండ గాలి తిరిగింది … గుండె ఊసులాడింది… గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది…”- ఈ పాట “ఉయ్యాల… జంపాల” చిత్రం లో ఘంటసాల, సుశీల గారు పాడిన చక్కటి ప్రణయ గీతం . ఈ పాట వింటూ ఉంటె… మనం పడవలో ఆ నది లో సాగుతున్న భావన కలుగుతుంది…  నాకు నచ్చిన పంక్తులు…”ప్రాప్తమున్న తీరానికి పడవ సాగి పోయింది…”. ఇందులో ఉన్న ఆలాపన కూడా ఎంతో మృదువు గా ఉంటుంది.


2 . “గోదారి వరదల్లో… రాదారి పడవల్లో … నీ దారి నీదేరన్నా…ఉయ్యాలలూగే ఈ జగమంత… ఊహలకందని వింత … ఈ లాహిరిలోనే వింతా..”… ఈ పాట ఎదురీత సినిమాలో టైటిల్ వచ్చే సమయంలో వచ్చే సాంగ్..గోదావరి అలలను  చూపుతూ… ఆ అలలను తాకుతున్న ట్లు గ వచ్చే రిథం (సత్యం గారి సంగీతం) లో చాల philosophical గ సాగుతుందీ పాట.. నాకు నచ్చిన పంక్తులు.. “నింగీ  నేలా బంతులాటలో … సంజె వెలుగుల సయ్యాట.. ఏటి గాలి కి నీటి వాలుకు ఎదురీతే బ్రతుకంతా…”. ఎం. ఎస్. ఆర్ లో చూసిన ఈ సినిమా నాకు బాగా నచ్చిన ఎన్. టీ. ఆర్ చిత్రం.


3 . “ఎంత వలపు సాగరుని పై గోదారికి…ఎన్నెన్ని పరుగులు ఆ సాగర సంగమానికి..” – ‘ఛాయా’ అనే సినిమా (ప్రేమల టాకీసు లో వచ్చింది) వచ్చిన సత్యం సంగీతం లోని చక్కటి పాట.. సత్యేంద్ర కుమార్, రూప పై చిత్రీకరించిన ఈ పాట చాల తక్కువ మంది విని ఉండొచ్చు… కాని ఆనాటి క్షణాలలో జీవింప చేసే  పాట ఇది..


4 . ” వెన్నెల్లో గోదారి అందం.. నది కన్నుల్లో కన్నీటి దీపం…” – వంశీ గారి సితార చిత్రం లోని వేదన ని  నృత్యం తో వ్యక్తీకరిస్తూ నది తీరం లో సాగే పాట ఇది. “నిన్నటి శర పంజరాలు  దాటిన స్వర  పంజరాన నిలచి … కన్నీరే పొంగి పొంగి తెరల చాటు చూడలేని మంచు బొమ్మనై….  ” అంటూ అతి వేగం గా వరద లాగా ఓ పతాక స్థాయి లో ఉద్వేగం తో ముగుస్తుందీ పాట.


5   . “ఉప్పెంగేలే గోదావరి.. ఊగిందిలే చేలో వరి… పూదారి లో నీలాంబరి .. . మా సీమ కే చీనాంబరి ” వేటూరి గారి కలం లో జాలువారిన పాట .. మన స్వర్ణ చిత్రీకరించిన అందమైన గోదావరి పాట .  పాపి కొండల మధ్య అందాలు చూపిస్తూ ఆ గోదావరి ని స్తుతిస్తూ చక్కటి ఫీల్ గుడ్ పాట ఇది.


6 . “ఉరకలై గోదావరి… ఉరికేనే నా ఒడి  లోనికి… సొగసులై బృందావని విరిసే నా సిగలోనికి” – మనం చదువుకునే రోజుల్లో యండమూరి నవల అభిలాష ని తెర పై ప్రతాప్ టాకీసు లో చూసిన సినిమాలోని పాట ఇది.. ఇళయ రాజ గారి signature పాట ఇది.. ఈ పాట వింటూనే… నాకు మన వూరి జ్ఞాపకాలు గుప్పుమంటాయి.. నవలలు ఎక్కువ చదివే రోజుల్లో వచ్చిన ఈ సినిమాలో ఈ పాట తో పాటు మిగతా పాటలు బాగా హిట్ అయ్యాయి ఆ రోజుల్లో.

ఇలా ఎన్నో పాటలు… “ప్రేమించు ,, పెళ్ళాడు” లో “వయ్యారి గోదారమ్మ…”, మూగ మనసులు లో “గోదారి గట్టుంది..”, లాంటి ఆణిముత్యాలు ఎన్నో ఉన్నాయి. మన స్కూల్ రోజుల్లో రేడియో సిలోన్ లో మీనాక్షి పున్నుదురై గారి తెలుగు పాటల ప్రోగ్రాం లో , ఏదైనా పదం తీసుకుని  ఆ పదం ఉన్న పాటలను వినిపించడం జరిగేది (వారం లో ఒక రోజు అనుకుంటాను). అలాంటి ప్రోగ్రాం కి సరిపోయేలాగా , గోదావరి అన్న పదం ఉన్న  తెలుగు పాట లను ఇలా పంచుకోవాలనిపించింది.

గోదావరి లాంటి తెలుగు మాటల్ని మెటా టాగ్స్ లో ఉంచి database ఎవరైనా తయారు చేయగలిగితే మంచి సాహిత్యమున్న ఎన్నో గీతాల్ని మళ్ళీ పునశ్చరణ చేసుకోవచ్చేమో… లేకుంటే కొన్ని మంచి పాటలు.. కాల గర్భాన మరుగున పడిపోతాయేమో…

Advertisements
This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

2 Responses to గోదావరి పాటలు

  1. dnchari says:

    Youtube videos kooda pedite baagundedi

  2. Gud evening,Ramakrishna, all songs related2the rever godavari &beautiful locations of godavari are most lovable2me.I hav a wish 2visit papikondalu with my life partner&children in a boat .Due2 paucity of time&not getting holidays of rama&children, while i hav holidays my wish remains unfininished.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s