పలికించెడి వాడు “దామోదరు”డట

ఈ బ్లాగు మొదలు పెట్టినప్పటి నుండి, తెలుగు లో రాయటం, చదవటం ఎక్కువయ్యింది. ముఖ్యం గ రాయటం అన్నది చాల ఏళ్ళ తరువాత పునః ప్రారంభించాల్సి వచ్చింది. ఎన్నో పదాలు రాసేటపుడు, ఇతరుల బ్లాగుల్లో చదువుతున్నపుడు, ఆ పదాలు మనం చదువుకున్న రోజుల్లో మన క్లాసు లో విన్న సందర్భాలు గుర్తుకొస్తున్నాయి. ఈ మాత్రం తెలుగు గుర్తు ఉందంటే… ముఖ్యం గ రెండు సంవత్సరాలు (అంటే మన 8 , 9 తరగతులలో) తెలుగు చెప్పిన దామోదరం మేష్టారు గారి పాత్ర ఎంతో ఉంది. 6 , 7 తరగతులలో కృష్ణప్ప గారు కూడా బాగా చెప్పేవారు. కాని, భాష మీద ప్రేమ కలుగ చేసింది దామోదరం గారే. తను తెల్లటి ఫుల్ స్లీవ్ షర్టు (సగం మడిచి వుండేవారు) , తెల్లటి ప్యాంటు , inshirt చేసుకుని, నుదిటిపై నిలువు ఎర్రటి నామంతో గంభీరం గ కనిపించే అతని రూపం చూసి అందరం భయపడే వాళ్ళం. నాకు చాల భయం తనని చూస్తే. 8 వ తరగతి లో అతను తెలుగు కి వస్తున్నారనేసరికి అందరికి గుండెల్లో గుబులు. తను బాగా కొడతారని మన సీనియర్స్ ఇచ్చిన feedback తో అందరికి తనంటే భయమే..

తను ప్రతి పాఠానికి ముందు దానికి సంబంధించిన బాక్గ్రౌండ్ ఇతివృత్తం చెప్పేవారు. ఒక్కోసారి, తను ఏ పాఠం మొదలు పెట్టారో అర్థమయ్యేది కాదు. కాని తను చెప్పే కథలలో అందరూ లీనమై పోయే వాళ్ళం. రెండు మూడు క్లాసుల తర వాత తను ఏ పాఠాన్ని చెపుతున్నారో అర్థమయ్యేది. నిజం చెప్పొద్దూ… తను చెప్పే కథలు అప్పుడే అయిపోయాయా… అనిపించేది పాఠం మొదలు కాగానే… తను చెప్పే నాకు నచ్చిన ఓ చక్కటి ఉపమానం… “శుక్ల పక్ష చంద్రుని వలె ఆ రాకుమారుడు దిన దిన ప్రవర్ధ మానుడయ్యెను.”అనంతరమా నరేంద్ర నందనునులామందానంద కందళిత హృదయులై విష్ణు శర్మంగని ఇట్లనిరి..”” అని  తన గంభీర స్వరం తో చెప్పిన పాఠం ఇప్పటికీ నా చెవుల్లో మారు మోగుతోంది . నాకు తనంటే భయంతో మొదలైన భావం ఆరాధనపూర్వకంగ మారింది. తన మెప్పు పొందాలని కొత్త పదాలను పరీక్షలలో వాడేవాడిని. కాని ఎప్పుడు మెచ్చుకోలేదు… ఓ సారి మాత్రం నాన్న తో “మీ వాడు రాసేది ఏ guide  లో నుండి రాసినట్టు  ఉండదు… తనే సొంతం గ రాస్తాడు..” అన్నదే నాకొచ్చిన complement . తన పాఠాలు కేవలం రెండేళ్ళు విన్నా… తన వలన ఏర్పడిన భాషాభిమానం మాత్రం చిర కాలం ఉండిపోయింది. ఇప్పుడున్న corporate విద్యా సంస్కృతి లో భాష, ముఖ్యం గా తెలుగు భాష కు ఇస్తున్న ప్రాధాన్యత చూస్తే… భాష ని పునర్జీవింప చేసి … జవసత్వాలు ఇవ్వాలంటే … మళ్ళీ ఈ దామోదరం సర్ లాంటి గురువులు రావాల్సిందే…

Advertisements
This entry was posted in నాడు-నేడు. Bookmark the permalink.

5 Responses to పలికించెడి వాడు “దామోదరు”డట

 1. D S KRISHNAN says:

  nenu kuda ee sitelo chakkani telugunu anubhavistunnanu.
  manavallandaru oke standard lo telugunu vadadam aa damodarudi chaluvane!

 2. D S KRISHNAN says:

  సృష్టికి మూలం లేదు ఆవనికి అవధులు లేదు గాలికి రూపం లేదు నీటికి రంగు లేదు మంచుకి రుచిలేదు ఆశకు అంతు లేదు జ్ఞానానికి
  హద్దు లేదు ప్రేమకు చావు లేదు స్న్హేహానికి అంతం లేదు
  పువ్వులాగా కమ్మగా నవ్వడం , మేఘంలాగా మెల్లగా కదలడం , నది లాగా చల్లగా వుండడం ,వాయువు లాగా తిరగడమే జీవన సౌందర్యం

  కృష్ణన్(kitta)

 3. Damodaranaidu sir gari valla manamandaram telugulnw manchi praveenyanni sampadinchu konnamu.kavuna manamandaram Damodaram sir gariki runa padi unnamu.

 4. chinni says:

  నాకు ఆయన పేరు లీలగా గుర్తొస్తుంది .ఎంతోకొంత తెలుగు చదవటం పట్ల మక్కువ ఇంట్లోవారి ద్వారా అబ్బింది .నిజం చెప్పాలంటే నాకు మాత్రం ఏ భాషలోను పట్టులేదు.తెలుగుని బాగా చదివి అలవోకగా రాయాలన్న ఆశ మాత్రం నైన్టిఫోర్ లో సర్వమంగళ గౌరీ గారు (సివిల్ సర్వీసెస్ కి తెలుగు సాహిత్యం టీచ్ చేసేవారు )ని చూసి వచ్చింది .అప్పట్లో కీచకవధ మనుచరిత్ర ఆవిడ చెబుతుంటే కళ్ళ ముందు దృశ్యం సాక్షాత్కరించేది .అప్పట్లో ఆవిడ క్లాస్స్ అంటే విపరీతమయిన క్రేజ్ వుండేది .పరీక్షల సమయంలో అర్ధరాత్రి ఫోన్ లో కూడా చెప్పిన అద్బుతమయిన టీచర్ ఆవిడ ..మరచిపోలేని వ్యక్తి .

 5. T.PATTABHI RAMAN says:

  అవునండి, మరి 8 వ తరగతి బి సెక్షన్ లో ఉన్నప్పడు మధ్యాహ్నం మొదటి period దామోదరం సర్ వచేవారు. చాల ఇంటెరెస్టింగ్ గ ఉండేది. ” సంగర రంగమందు సాత్రవులే చత్తు రనంచలున్” అనే పద్యం నాకు ఇంకా బాగా గుర్తు ఉంది. ఈ వాక్యం చాల వరకు మూడు నెలల పరీక్ష, ఆరు నెలల పరీక్ష అన్నిట్ల్దోను వచ్చేది. ఇదే విధంగా కృష్ణప్ప మాస్టారు ఏడవ తరగతిలో ఉన్నప్పడు, రాజ హంస గురించి బుధుడు సభలో పడిన పాట ” అంచ తల్లి రావే………………. చక్క ధనాల చుక్క జాబిల్లి రావే” పద్యాన్ని పాడి వినిపించే వారు. ఈ ఏడవ తరగతిలో ఉన్నప్పడు మన క్లాస్స్మేట్ మునిరత్నం ఉండేవాడు. ఒక సారి, పద్యం అప్ప చెప్పే విషయంలో అతను సరిగా చెప్పలేదు, నన్ను కృష్ణప్ప సర్ చెప్పా మన్నారు, తరువాత మునిరత్నం కు చెంప దెబ్బ వెయ్య మన్నారు, అందుకు, అతను అప్పట్లో నే బెదిరించినాడు, చెంప మీద చెయ్యి పడితే నువ్వు ఇంటికి పోలేవు అని. అంతే నేను బయపడి వెంటనే కూర్చున్నాను. ఇంతవరకు సెలవు. మిగిలినవి తరువాతి కలయికలో. అంత వరకు టాటా టాటా బై బై…….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s