ఈ గోడలు మాటలాడుతున్నాయి…

జ్ఞాపకాలన్నవే లేకుంటే.. జీవితం తావి లేని ఓ కాగితపు పూవు లాగ మారిపోయేదేమో…   కొన్ని జ్ఞాపకాలు చివరి వరకూ ఉండిపోతాయి.. అలా ఉండిపోయే జ్ఞాపకాలే మన స్కూల్ లోని ఈ మాటలాడే గోడలు…

మన స్కూల్ కి ముందు వైపు రెండు గేట్స్ ఉండేవి.. ఒకటి ప్రస్తుతం లేదు.. మిగిలిన ఆ రెండో గేటు పైన ఫోటో లో కనిపించేది.. ఈ గేటు లో ముందు కి వెళ్తూనే కనపడేది ఎలిమెంటరీ స్కూల్. ఎడమవైపు న రూం 1 ,2 , విడి గా రూం 3 , తరవాత ఓ పెద్ద హాల్ (అందులో మూడు రూములు), వెళ్ళడానికి ఓ సందు… ఆ సందు దాటాక  … ఎడమ వైపు ఓ రూం ఎదురుగా రెండు రూములు.. కుడి వైపు ఓ పెద్ద ఆట స్థలం  … దానికి చివర ఓ స్టేజి … ఇదీ మన స్కూల్… కాని ప్రస్తుతం ఇవేవీ లేవు.. ఒక్క ఎలెమెంటరీ స్కూల్ గోడలు ఆ రోజుల జ్ఞాపకాలకు సాక్ష్యం లాగా నిలిచి ఉంది…  ఈ గోడల చుట్టూ అల్లుకున్న జ్ఞాపకాలు ఎన్నో.. ప్రస్తుతం ఈ ప్రాంగణం వాడుకలో లేదు.

పైన కనపడే ఫోటో లో కనిపించేది మన ఎలెమెంటరీ స్కూల్ లోపలి ఆవరణ … అప్పటి రూములూ, ఆ గోడలూ, ఆ పై కప్పులూ…. అన్నీ అవే…. మన ఫ్రెండ్స్ అందరి కి ఆ రూములతో ఎన్నో జ్ఞాపకాల తీపి గుర్తులు..

 

ఈ ఫోటో లో కనిపించే కిటికీలు, ఎక్కడో చూసినట్టు ఉంది కదూ. ఆ రెండు కిటికీల ముందు బెంచి లు వేసి మన గ్రూప్ ఫోటో లు తీసిన జ్ఞాపకం గుర్తుకొస్తోందా… వెలిసిన గోడలూ… ఇటుకలు  కనపడుతూ ఉన్న ఆ గోడలూ.. నన్ను, ప్రసన్న, రామచంద్ర ని చూడ గానే ‘ఇంకెన్నాల్లో  ఉండను.. త్వరలో నన్ను కూల్చేసి కొత్త భవనాలు నిర్మిస్తారట ..  అంటూ కన్నీళ్లు పెట్టుకున్న భావన.. ముప్పై సంవత్సరాల తరవాత నన్ను వెదుక్కుంటూ వచ్చారా అంటూ గద్గద స్వరంతో ఆ గోడలు.. మాటలాడుతున్న ఫీలింగ్.

ఎలెమెంటరీ స్కూల్ వెనక వైపు ఉన్న మన ఆట స్థలం…అందులో ఉన్న అమ్మాయిల యూనిఫారం  గమనించారా… అదే డ్రెస్ వేసుకున్న మన క్లాసు మేట్స్ ఓ సారి కళ్ళ ముందు మెదిలి ఉంటారు కదూ… ఈ ఆట స్థలం లో మన పీ. టీ. టీచెర్ మనకు డ్రిల్ చేయించే వారు.. ఇక్కడ   ఉండే స్టేజి ఇప్పుడు లేదు..  ఎన్నో సార్లు annual డే నాడు బహుమతులు అందుకున్నది ఇక్కడే..

ఈ గుప్పెడు జ్ఞాపకాలు.. కొండంత ఓదార్పుని ఇస్తాయి…

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

5 Responses to ఈ గోడలు మాటలాడుతున్నాయి…

 1. Dear Ramakrishna,the walls of mpl.ele.school in the above photos dates back to all of our friends to our school days.The govt .of A.p. has recognised our school as success school ,starded english mediam from 2007-2008 acadamic year out of 6high schools in the chittoor municipality.so within near future our school may elevate to the college with the funds of central govt.&there is a praposal to demolish old ele.school ,as a new building has been constructed for the ele.school .

 2. chinni says:

  “పైన కనపడే ఫోటో లో కనిపించేది మన ఎలెమెంటరీ స్కూల్ లోపలి ఆవరణ … అప్పటి రూములూ, ఆ గోడలూ, ఆ పై కప్పులూ…. అన్నీ అవే…. మన ఫ్రెండ్స్ అందరి కి ఆ రూములతో ఎన్నో జ్ఞాపకాల తీపి గుర్తులు”
  అక్షరాల నిజమే .ఆ స్కూల్ ఆవరణలో తెలుపు ఆకుపచ్చని స్కర్ట్స్ లో ఆ నాటి మా భాల్యం కనబడుతోంది .ఆ క్లాస్స్ గోడలు ..రూఫ్ కి గోడకి మద్య గాప్ లో కోతుల్లాగోడలు పట్టుకు వేలాడిన మా క్లాస్స్ అబ్బాయిలు ,క్లాస్స్ రూం ని రంగు కాగితాలతో తోరణాలు కట్టిన వైనం మా ఆటలు ,పాటలు ,పోటీలు అన్నీ మనోఫలకం పై సినిమాల రీళ్ళు తిరుగుతున్నాయి .మీకు అభినందనలు మా స్కూలుని తెచ్చి కళ్ళ ముందు ఉంచుతున్నందుకు …

 3. Dr. Vijayakrishna says:

  Ram et al.,
  Thank you so much!!!
  It reminds me several things……….
  We stop by our school in our last visit to India and showed our school to my kids Sravani and Vamsi and end up answering several questions??????

 4. anagha says:

  ramakrishnagaru, mana schoolni chusthunte chaalachaala happyga undi.godale kaadu chetlukuda sakshalu,appati chetlu ayi unte thappakunda mana balyanni chusiuntayi.avi muga sakshlalu.
  oka abbayi nunchunna vaipu metluunnayi aa room head master garidi ayana roomlo 5th A section vallu kurchunevaru,eppudaina 5th C ayyavaru rakapote mammalnandarini A sectionlo kurchopettevaru head master garante hadal notimida velu vesukuni kurchunevallam (A section class photolo head master garini chusenu, ventane gurthu pattenu .)meru pettina 5thC section photo made kaani danilo nenu lenu aa roju absent emo! naa daggara oka photo undedi adi 4thC section ayiuntundi .maa idu C ayyvarni(alage pilichevallam) classmates andaru gurthukocheeru ,perlu anthaga gurthulevu.ma ayyavaru eppudu siriosga undevaru,navvatam chudaledu, kaani manchivaru.ela cheppukuntupote chaala cheppesthanu .malli jnapakalanu gurthu chesinanduku danyavadalu.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s