ఆర్ద్రత కి అద్దం పట్టే చిత్రం

ఓ వర్షం కురిసిన మధ్యాహ్నం చాల కాలం తరవాత పలకరించుకునే  ఇద్దరి మధ్య నడిచే సంభాషణలలో దాగిన ఉద్వేగపు దోబూచులాటే “రెయిన్ కోట్” చిత్రం. ఈ చిత్రం పట్టుమని వారం రోజులు కూడా ఆడలేదు. ఎందుకో ఈ చిత్రం డీ. వీ. డీ. చూసాక అర్థమైంది. ఈ చిత్రాన్ని ఆస్వాదించాలంటే (కనీసం అర్థం చేసుకోవాలంటే)   కనీసం రెండు, మూడు సార్లు చూడక తప్పదు మరి. మొదటి సారి చూసాక, ఓ abstract భావన కలుగుతుంది.

కథలోకి వెళ్తే, భాగల్పూర్ నుండి మనోజ్ (అజయ్ దేవగన్) అలియాస్ మను  అనే వ్యక్తి ఆర్ధిక సహాయార్థం మిత్రులని కలవటానికి కలకత్తా వెళ్తాడు. అక్కడ తన ఫ్రెండ్ ఇంట్లో విడిది చేసి, ఆ ఫ్రెండ్ ఇచ్చిన recommendation లెటర్  సహాయంతో మరి కొంత మంది మిత్రుల దగ్గర డబ్బు సహాయం పొందటానికి బయల్దేరుతాడు. వర్షం పడుతుండటం తో, మిత్రుడి రెయిన్ కోట్ వేసుకుని బయల్దేరుతాడు. ముగ్గురి దగ్గర డబ్బు తీసుకున్నాక, తను ఇష్టపడిన , కాని ఇంకొకర్ని వివాహమాడి కలకత్తా లో ఉండే  నీరు (ఐశ్వర్య రాయ్) ని చూడటానికి వెళ్తాడు. ఓ పాత బడ్డ ఇంట్లో ఉంటుంది నీరు. తను బాగా ఉన్నానని చెప్పుకోస్తూనే, తన గురించి వాకబు చేస్తుంది. కొంత సేపటికి, తనకి లంచ్ తేవటానికి , మను రెయిన్ కోట్ వేసుకుని బయటికి వెళ్తుంది నీరు. ఇంట్లో నిరీక్షిస్తున్న మను తో ఓ వ్యక్తి వచ్చి మాట్లాడుతూ, తను ఆ ఇంటి ఓనర్ నని చెప్పుకుంటూ, నీరు యొక్క అసలు స్థితి గురించి చెపుతూ, తను అద్దె కూడా చెల్లించలేని వైనాన్ని, తనని కోర్ట్ ద్వార ఇంటి నుండి ఖాళీ చేయించాలనుకున్నట్లు  చెపుతాడు. చలించిన మను, తన మిత్రులు ఇచ్చిన మొత్తం డబ్బును ఓనర్ కి ఇచ్చి అద్దె కింద జమ చేసుకోమని, తనని ఇబ్బంది పెట్టవద్దని ప్రాధేయ పడుతాడు. సమ్మతించిన ఓనర్ వెళ్ళాక, నీరు లంచ్ తీసుకు వస్తుంది. లంచ్ తిన్నాక, ఫ్రెండ్ ఇంటికి వెళ్లి పోతాడు మను. తన రెయిన్ కోట్ లో నీరు ఉంచిన నగలు, ఓ ఉత్తరం మనుకి కనపడుతాయి. లేఖలో తను అతని ఆర్థిక పరిస్థితిని మిత్రుడి recommendation లెటర్ రెయిన్ కోట్ లో చూసి చదివినట్లు చెపుతూ, అందుకే తన నగలు ఇస్తున్నట్లు, నీరు రాసి ఉంటుంది. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు, తమ తాహతు కి మించిన సహాయం చేసుకోటంతో కథ ముగుస్తుంది.

ఈ కథని దర్శకుడు రితు పర్ణ ఘోష్ నడిపించిన తీరు అద్వితీయం. ప్రతి emotion ని ప్రేక్షకుడి వూహ కి వదిలి పెట్టాడు. నీరు ఇంట్లో ఇద్దరి మధ్యన నడిచే సంభాషణలు చాల సాధారణం గ ఉంటాయి.. ఒకరికొకరు తాము బాగా బతుకుతున్నట్లు ఓ false ఇమేజ్ సృష్టించటానికి ప్రయత్నిస్తారు. నీరు తన భర్త చాల పెద్ద బిజినెస్ చేస్తున్నట్లు గొప్పలు చెపుతుంది, ఇంట్లో అంత నౌకర్లు , చాకర్లు ఉన్నట్లూ, అందరూ బయటికి వేల్లినట్లూ గొప్పలు చెపుతుంది. అలాగే మను కూడా తను ఓ పెద్ద టీ. వీ సీరియల్ తీస్తున్నట్లు, మధ్య మధ్యలో తన మిత్రుడి భార్య చేసే ఫోన్ కాల్ ని తన సెక్రటరీ చేస్తున్నట్లు చెపుతాడు. ఓనర్ వచ్చి వెళ్ళాక, నీరు చెప్పే ప్రతి విషయం వెనుక దాగి ఉన్న నిజాన్ని గుర్తిస్తాడు మను. అలాగే, రెయిన్ కోట్ లో లెటర్ చూసిన నీరు కూడా అతను సెక్రటరీ గురించి చెప్పే విషయం వెనుక దాగి ఉన్న యదార్థం గ్రహిస్తుంది. ఇద్దరూ బయటపడరు కాని ఒకరి స్థితిని ఒకరు అర్థం చేసుకుని తమ శక్తి కొద్ది సాయం చేయటానికి యత్నిస్తారు.

ప్రతి దృశ్యం dull లైటింగ్ లో ఉండి, ఇద్దరి లో సాగే మానసిక సంఘర్షణ  ని మరింత elevate చేస్తుంది. గుల్జార్ స్వరం లో వచ్చే షాయిరి (పియ తోరా కైసా అభిమాన్ అనే శుభ ముద్గల్ పాటలో ) ఆ సన్నివేశాలకు  మరింత ఉద్విగ్నత ని ఇస్తుంది. అజయ్ దేవగన్ ఒక brooding ప్రేమికుడి గ , ఐశ్వర్య రాయ్ ఒక అభిమాన ధనురాలిగా వారి పాత్రలకు జీవం పోశారు.

ముఖ్యం గ ఇందులోని సంభాషణలు  ఎంతో సాధారణం గ ఉన్నా, వాటి అసలు అర్థం వేరే ఉంటుంది. ప్రతి మాట అర్థం చేసుకుంటే, అందులోని ఆర్ద్రత అర్థం అవుతుంది. ఉదాహరణకు, మిత్రుడి ఇంట్లో మిత్రుడి భార్య కి , మను కి మధ్య నడిచే సంభాషణ కూడా ఇలాంటిదే. మను బాత్రూం లో ఏడ్చిన  సంగతి గ్రహించిన మిత్రుడి భార్య, బాత్రూం లో ఏడ్చినపుడు షవర్ తిప్పి ఏడవమని సలహా ఇవ్వటం లో తను కూడా ఇష్టం లేని పెళ్లి చేసుకున్నట్లు, తను అలానే చేస్తున్నట్లు నర్మ గర్భం గ చెపుతుంది. ఒకే స్థితి లో ఉన్న ఆ మిత్రుడి భార్య మను స్థితిని అర్థం చేసుకోటం, అతడిని నీరు ని కలవటానికి వెళ్ళమని ప్రోత్సహించటం కూడా చాల ఆర్ద్రం గ ఉంటుంది.

ఈ చిత్రం సన్నివేశాల పరంగ ఒక రకంగా అగుపిస్తే, అర్థం చేసుకుంటే ఇంకో కోణం లో ఆవిష్కృతం అవుతుంది.  స్థూలం గా ఒక చక్కటి పాయిగ్నంట్ అండ్ haunting చిత్రం అని చెప్పొచ్చు.

Advertisements
This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

6 Responses to ఆర్ద్రత కి అద్దం పట్టే చిత్రం

 1. sbmurali2007 says:

  I guess this is the only movie in which Ms.Rai was not self-conscious of her beauty and therefore could act well. Ghosh mentioned in the credits that the story is inspired by O.Henry. Thanks for reminding about a well made movie.
  Sharada

  • mhsgreamspet says:

   Sharada garu,
   Thanks andi. I fully agree with u on ur opinion about Ms Rai in this film, who gave her best. Though it is an adaptation of O Henry’s “The gift of Magi”, what i was amazed about was the style of narration and the subtle nuances attached to every emotion. Full credit to Ghosh who incidentally bagged best director award this year for another film
   Ramakrishna

 2. krsna says:

  chaannallaki oka manchi post kanapadindi. nenu prati cinema chudanu kani okkosari konni enduko chudalanipistundi. alaa chusina movie ne raincoat. na anchanaalu tappavaledu. oka manchi ardrata nindina cinema idi. nenu kanisam oka vanda mandini adigi untanemo ee cinema gurinchi. chalamandiki ee movie okati undani kuda telidu. cinema ni paiki kanipinche drusyanni vinipinche pada sabdaalni kakunda antarleenanga jarugunna paatrala sangharshanani telusukuntu chudaali. enta manchi movie anipistundi. mari ilanti sunnita kathalu mana telugulo raavaa ante karanam prekshakulu kuda, ani cheppachu.

 3. Balasubramanyam.V says:

  nice movie ….. ..

 4. ఈ సినిమా రిలీజ్ అవబోయే ముందు నుంఛీ ఫాలో అయి థియేటర్ లో చూసిన సినిమా అండి. ఇంటికి వచ్చాకా కూడా శుభాముద్గల్ వాయిస్ అలా గాల్లో తేలుతూ వినిపిస్తూనే ఉంటుంది. “మధురానగర్ పతి కాహే తుమ్ గోకుల్ జాయ్…” పాట కూడా బాగుంటుందండి.

  • mhsgreamspet says:

   @trushna garu
   ఔనండి.. రైలు వెళ్తుంటే.. టైటిల్ కార్డ్స్ తో ఈ పాట వస్తుంది. మంచి పాట.
   ramakrishna

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s