ఈ దశాబ్దం లో నాకు నచ్చిన ఇరవై పాటలు

ఒక దశాబ్దం ముగియనుంది. ఈ పదేళ్లల్లో నాకు నచ్చిన పాటలేమిటా అని ఓ సారి సింహావలోకనం చేసుకుంటే, ఇదిగో ఈ ఇరవై పాటల్ని షార్ట్ లిస్టు చేశాను, భాష భేదం లేకుండా. ఇంకా ఎన్నో ఉండొచ్చు కాని నేను ఉపయోగించిన ఒకే లాజిక్ ఏంటంటే, ఏ పాటైతే ఎన్ని సార్లు విన్నా, మళ్లీ మళ్లీ వినాలి అనిపించిందో, ఆ పాటలనే రాసాను. ఇందులో, కొన్ని బీట్ ప్రధానం అయితే, కొన్ని సాహిత్యం ప్రధానం అయితే, మరి కొన్ని అన్నింటిని మేళ వించుకున్న పాటలు. వీటిల్లో టాప్ 5 ఏవో నిర్ణయించాలంటే, కొంత సమయం కావాలి. అందుకే ఈ లోగా, ఈ పాటలు మీ ముందు ఉంచుతున్నాను.

1.” అనిసుతిదే యాకో ఇందు…నీనేన నన్నవలేందు …  మాయదా లోకదింద ననగాగే బందవలేందు … “– చిత్రం: ముంగారు మళె (కన్నడ చిత్రం. ఇది తెలుగు “వాన” చిత్రం. ఈ పాట తెలుగు లో “ఎదుట నిలిచింది చూడు” అన్న సాంగ్. ఇది కన్నడ లోనే ఎందుకు నచ్చిందో ఇంకో టపా లో చెపుతాను) మనో మూర్తి సంగీతం లో సోను నిగం పాడారీ పాటని.

2. “చిరుగాలి వీచెనే…చిగురాశ రేపెనే.. వెదురంటి మనసులో రాగం వేనువూదేనే.. మేఘం మురిసి పాడేనే..” – శివ పుత్రుడు లో ఆర్ పీ పట్నాయక్, ఇళయ రాజ సంగీత దర్శకత్వం లో పాడిన పాట.

3. “కొంటె  చూపుతో …నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే…”– అనంతపురం లో పాట. తమిళ్ పాట కి డబ్బింగ్ అయ్యిన ఎంతో రిథం ఉన్న పాట ఇది.

4. “గుర్తుకొస్తున్నాయి ఎద  లోతులో .. ఏ మూలనో.. నిదురించు జ్ఞాపకాలు.. నిద్ర లేస్తున్నాయి”– నా ఆటో గ్రాఫ్ లోని nostalgic  పాట. కీరవాణి సంగీతం. ఈ పాట తమిళ్ మాతృక లో వేరే ట్యూన్ తో (జ్ఞాపగం వరుదే…అన్న తమిళ్ సాంగ్ రమణి భరద్వాజ్ స్వర పరిచిన పాట ఉంది. )నా వోటు తెలుగు పాటకే.

5. “పాదమెటు పోతున్నా.. పయనమెందాకైన అడుగు తడబడుతున్న తోడు రానా ..   చిన్ని ఎడబాటైన.. కంట  తడి పెడుతున్నా..” – మిక్కి జే. మేయర్ స్వరపరిచిన హాపీ డేస్ లోని పాట.

6  “చిరు నవ్వే నవ్వుతూ నాకోసం వస్తావని… చిగురాశే రేపుతూ నీ ప్రేమని తెస్తావని …”–  ఈ పాట స్టార్ట్ లో వచ్చే బీట్ చాల బాగుంటుంది. యువన్ శంకర్  రాజ సంగీతం. కే. కే . గాత్రం. ఓయ్ సినిమా లోనిది

7. “సఖియా.. చెలియా …పచ్చని దనమే పచ్చ దనమే తొలి తొలి వలపే  పచ్చ దనమే..” – సఖి చిత్రం లో ఏ.ఆర్.రెహ్మాన్ స్వరపరిచిన పాట. ఈ పాట ప్రతి చరణం వివిధ వర్ణాలను హైలైట్ చేస్తూ చిత్రీకరించారు మణిరత్నం అద్భుతం గా.

8. “జానే  దో నా…  జానే జానే దో నా ..”– చీని కమ్ అనే హిందీ సినిమా లో ఇళయ రాజ సంగీతం లో శ్రేయ ఘోషల్ పాడిన పాట. ఈ పాట ట్యూన్ ఓ కన్నడ చిత్రం లోనిదట. కాని  నేను వినలేదా పాటని.

9. “నువ్వే   నా  శ్వాస … మనసున నీకై అభిలాష ..” – ఒకరికి ఒకరు అనే చిత్రం లో కీరవాణి సంగీతం, శ్రేయ ఘోషల్ పాడారు. రసూల్ ఎల్లోర్ ఫోటోగ్రఫి లో అద్భుతంగా చిత్రీకరించిన పాట.

10. “హృదయమేక్కడున్నది .. నీ చుట్టూనే  తిరుగుతున్నదీ .. “ ఘజని చిత్రం హారిస్ జయరాజ్ సంగీతం. ఈ పాట బీట్ బాగుంటుంది.

11 . “ఔననా  కాదనా నాదనా..కాదనా  లేదనా.. రాదనా. వేదనా,.. “ మిక్కీ జే మేయర్ స్వరపరిచిన చాల మెలోడియస్ పాట ఇది. లీడర్ సినిమా లోది. మెల్లగా మొదలై, ఓ ఝం ఝా మారుతంలాగ సాగుతుందీ పాట. పాట లో గాయని స్వరం లో వచ్చే ఆలాపన హైలైట్ అని చెప్పొచ్చు.

12 . “నాకు  నువ్వు  నీకు  నేను… ఒకరికొకరం నువ్వూ నేనూ”– నువ్వు నేను చిత్రం. ఆర్ పీ పట్నాయక్ స్వీయ సంగీతం లో ఉష తో పాడిన షార్ట్ బట్ స్వీట్ పాట.

13.  “ఈ  హృదయం కరిగించి  వెళ్ళకే … నా  మరు  హృదయం  …  అది  నన్ను  వదలేదే “- ఏం మాయ చేసావే లోని పాట. ఓ నది పై నుండి వీచే పిల్ల తెమ్మెర తాకుతున్న భావన ఈ పాట వింటే కలగక

మానదు. చెవుల్లో గుస గుస లాడుతున్నట్లు గ వచ్చే ఆలాపన… మధ్య మధ్య లో వెస్ట్రన్ పోకడలతో… సాగే చక్కటి పాట.

14. “కోపం  వస్తే  మండుటెండ …”– తారక రాముడు లోని ఈ పాట గురించి ఆల్రెడీ ఓ టపా లో రాసాను.

15. “చీకటితో  వెలుగే  చెప్పెను నేనున్నానని  “– నేనున్నాను అన్న చిత్రం  లోని మంచి స్ఫూర్తి నిచ్చే కీరవాణి పాట.

16 . “మౌనంగానే  ఎదగమని. మొక్క నీకు చెబుతుంది.” నా ఆటోగ్రాఫ్ సినిమా లోని ఇంకో  ఆణిముత్యం. ఎంతో పాజిటివ్ ఫీల్ ఇచ్చే ఈ పాట బాగా పాపులర్ అయ్యింది.

17. “స్నేహితుడా.. రహస్య స్నేహితుడా…” – సఖి లోని ఇంకో చక్కటి పాట

18 . “ఎలా  ఎలా  ఎలా  తెలుపను.. ఎద లోని ప్రేమను.. మృదువైన మాటను.. “– నువ్వు లేక నేను లేను అనే సినిమా లోని సున్నితమైన ఫీల్ తో, సరళ శబ్దాలతో చంద్ర బోస్ రాసిన చక్కటి పాట. ఆర్. పీ. పట్నాయక్ అందించిన సంగీతం కూడా పాటని బాగా ఎలివేట్ చేసింది.

19. “నువ్వు  నువ్వు … నువ్వే  నువ్వు… నాలోనే నువ్వు.. నాతోనే నువ్వు “– ఖడ్గం  చిత్రం లో దేవిశ్రీ ప్రసాద్ అందించిన చక్కటి మెలోడి. నువ్వు అన్న పదవిన్యాసంతో సీతారామ శాస్త్రి ఈ పాటను ఓ ప్రత్యేకమైన పాటని చేసారు. ఎందుకో దేవిశ్రీ ప్రసాద్ మొదట్లో అందించిన ఇలాంటి మెలోడీస్ తరవాత అందించ లేదు

20 “పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ.. కదిలే దేవత అమ్మ “– నాని సినిమా లో ని ఈ పాట సాహిత్య పరం గాను, సంగీత పరంగానూ చక్కగా ఉంటుంది. రెహ్మాన్ చంద్ర బోస్ అమ్మ ప్రేమని ఆస్వాదిస్తూ రూపొందించారీ పాటని.

ఈ పాటలలో నా టాప్ 5 పాటలు ఏమిటో ఇంకో టపా లో చెపుతాను. ఇంకా ఎన్నో మెలోడీస్ ఉండొచ్చు. మీ కామెంట్స్ ద్వార తెలియ పరచగలరు.

Advertisements
This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

4 Responses to ఈ దశాబ్దం లో నాకు నచ్చిన ఇరవై పాటలు

 1. మీ లిస్ట్ లో “కలవరమాయే మదిలో” లో పాట “ఓ నేనే ఓ నువ్వని..” ఉంటే బాగుండేదేమో. చాలా బాగుంటుంది కదండీ..

 2. chinni says:

  నాకు మొదట ఇష్టం అయిన పాట మీ లిస్టు లో 🙂

  -“పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ.. కదిలే దేవత అమ్మ “
  -“చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని
  -“స్నేహితుడా.. రహస్య స్నేహితుడా…”
  .

  -“పాదమెటు పోతున్నా.. పయనమెందాకైన అడుగు తడబడుతున్న తోడు రానా .. చిన్ని ఎడబాటైన.. కంట తడి పెడుతున్నా..” –
  -గుర్తుకొస్తున్నాయి ఎద లోతులో .. ఏ మూలనో.. నిదురించు జ్ఞాపకాలు.. నిద్ర లేస్తున్నాయి”.
  నిజం చెప్పాలంటే ఏ పాట సొగసు ఆ పాట దే ,ఒక్కో పువ్వుకి ఒక్కొక్క తావిలా వేటికవే విలక్షణంగా …..కదా !

  • mhsgreamspet says:

   @trushna garu
   aa film lo paata adhee title song o saari vinnanu. baagundi. enduko aa paatalu ekkuva vinaledu. ee sari vintanu.
   @chinni garu
   mee choice baagundi. naa top 5 cheppataniki time paduthundi. endukante meeru annatlu anni paatalu okko rakamaina poove. vaatini polchatam kashta tharame.
   @Mahek garu
   thanks for those lovely inputs

 3. Mahek says:

  Jaane do na song in Kannada is much better than the hindi or Tamil versions….SPB at his best.

  One of my all time fav songs, though I donno kannada 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s