నాకు నచ్చిన పాటలు మరి కొన్ని..

మొన్న రాసిన టపా లో ఇంకో  5 పాటలు చేర్చదలిచాను ఎందుకంటే ఈ దశాబ్దం లోనే పరిచయమైన ఓ ఒక ముఖ్య సంగీత దర్శకుడి పాటలు పూర్తి గ మిస్ అయ్యాయి. ఆ దర్శకుడు కే. ఎం. రాధాకృష్ణన్ . ఈ దశాబ్దం బాగా ఇంప్రెస్ చేసిన కొత్త సంగీత దర్శకులలో ఒకరు మికీ. జే. మెయెర్ అయితే ఇంకొకరు కే. ఏం. రాధాకృష్ణన్. వీరి ఆరంభ  చిత్రాలు బాగున్నాయి. ఇలా ఎంత వరకు sustain అవుతారన్నది కాలమే నిర్ణయించాలి.. రాధాకృష్ణన్ చాల క్లిష్టమైన tunes తను కంపోస్ చేస్తారు- గాయకులకు ఓ పరీక్ష లాంటిందే అయినా, వీనుల  విందుగా శ్రోతలకు ఉంటుంది. తను పాడుతా తీయగా లో ఒకప్పుడు గాయకుడు గ పరిచయం అయ్యి, ఆనంద్, గోదావరి, చందమామ లాంటి కొన్ని చిత్రాలకు విలక్షణమైన సంగీతాన్ని అందించాడు.

మొన్నటి పాటలను కంటిన్యూ చేస్తే
21  “నువ్వేనా… నాకు నువ్వేనా.. సూర్యుడల్లె సూది గుచ్చే సుప్రభాత వేళ.. మాటలాడే  చూపులన్నీ… మౌన రాగమేల …” – ఈ పాట ఆనంద్ లో శ్రేయ ఘోషల్, రాధా కృష్ణన్ పాడిన పాట చాల హై pitch లో సాగే ఈ పాట కూడా బాగుంటుంది

22  “యమునా తీరం … సంధ్యా రాగం .. నిజమైనాయి కళలు… నీలా రెండు కనులలో “– ఈ పాట కూడా ఆనంద్ లో నిదే.  హరిహరన్, చిత్ర (?) పాడారు.

23 “ఉప్పొంగెలే గోదావరి… ఊగిందిలే చేలో వరి.. “ – గోదావరి చిత్రం లో బాలు పాడిన పాట గోదావరి అందాలను ప్రతిబింబిస్తూ సాగే పాట

24. ”  నాలో ఊహలకు.. నాలో ఆశలకు నడకలు నేర్పావు…” – చందమామ చిత్రం లో ఆశ భోంస్లే , రాధాకృష్ణన్ పాడిన పాట కూడా చక్కటి గీతం

25 . ” కొంత  కాలం …కొంత  కాలం … కాలమాగి పోవాలి… నిన్న కాలం… మొన్న కాలం.. రేపు కూడా రావాలి…” – ఈ గీతం  విద్యాసాగర్ స్వరపరిచిన చంద్రముఖి చిత్రం లోనిది. ఈ పాట మనం చదివే రోజుల్లో వినే తమిళ్ పాట లాగా బాగుంటుంది .
ఈ 25 పాటలలో నేను ఎక్కువ గ విన్న మొదటి 5 పాటలు, అందులో నాకు నచ్చిన అంశాల గురించి ఇంకో టపా లో  మాట్లాడుకుందాము.

Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

One Response to నాకు నచ్చిన పాటలు మరి కొన్ని..

  1. Dear friends,my heartly greetings &best wishes2all our friends for the new year 2011.urs prasannakumar.m

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s