ఎక్కడో చదివాను. సినిమాల్లో చూసినట్లుగా హీరోలంటే అన్నీ మంచి పనులు చేసే వాళ్ళ లాగాను, విలన్ అంటే అన్నీ చెడ్డ పనులు చేసేవాళ్ళ లాగాను నిజ జీవితం లో ఉండరు అని . వైట్ క్యారక్టర్స్ , బ్లాక్ క్యారక్టర్స్ ఉండరు. ఉండేది గ్రే (నలుపు, తెలుపుల మిశ్రమం) క్యారక్టర్స్ మాత్రమే అంటారు. అలాగే నా దృష్టి లో మంచి సంవత్సరం, చెడ్డ సంవత్సరం అని ఉండవు…. “కుచ్ పాకర్ ఖోనా హై… కుచ్ ఖోకర్ పానా హై … జీవన్ కా మతలబ్ తో ఆనా ఔర్ జానా హై..” అన్న చందాన … ప్రతి సంవత్సరమూ, తీపి, చెడు ల మేలు కలయిక గానే ఉంటుంది.. అందుకే ఎప్పటి లాగే ఈ సంవత్సరమూ అన్ని రుచులతో కొద్ది సేపట్లో ముగియ బోతూంది. క్రికెట్లో చేధించే లక్ష్యం ఎక్కువ గ ఉన్నప్పుడు, సెషన్ బై సెషన్ ఆడుతూ లక్ష్యాన్ని సమీపించాలని అంటారు. బహుశ , ఈ డిసెంబర్ 31 కూడా ఒక సెషన్ లాగా తీసుకొని, ఇంకో సెషన్ కి సమాయత్తం కావాలి అనుకుంటాను. అందరి లాగే, మన మైత్రి వనం లో కూడా ఈ సంవత్సరం లో ఉండి వెళ్ళిన వెలుగు నీడలను ఓ సారి స్పృశించుకుందాము.
ఆనంద బాష్పాలు
1 . మన అందరి రెండో మీటింగ్. స్టేట్స్ నుండి జూన్ లో విజయ కృష్ణ వచ్చాడు. మనం 2008 లో మొదటి సారి కలిసినప్పుడు, విజయ్ అక్కడ మన అందరిని కలవాలని ఎంత తపించాడో మన అందరికి తెలుసు. అందుకే తను జూన్ లో ఇండియా వస్తూనే, జూన్ 20 న కలవాలని ప్లాన్ చేసాము. రెండో సారి కూడా, ఎంతో మంది అదే ఉత్సాహం తో అందరినీ కలవటానికి వచ్చారు. ఇంత తక్కువ వ్యవధిలో రెండో సారి కలుసుకున్న మిత్ర బృందం మనదేనోమో! విజయ్, సుజాత, వారి పిల్లలు శ్రావణి, వంశీ కూడా వచ్చి అందరిని కలవటం, మన వాళ్ళలో మమేకం కావటం ఎంతో ఆనందాన్నిచ్చింది. అలాగే, విజయ, తన భర్త డా.. జగన్నాథ్ గారు, ప్రమీల, తన భర్త దామోదరం గారు, వైజాగ్ నుండి శ్రీదేవి , తన కుటుంబ సభ్యులు, రావటం మన మీటింగ్ కి మరింత శోభనిచ్చింది.
2. july లో బ్లాగు మొదలు పెట్టాము. ముఖ్యం గ, మన అందరిని ఎప్పటికి ఇలా కలుసుకుంటూ ఉండాలనే తపన తో మొదలైందీ బ్లాగు. కాని, ఇలా బ్లాగు మొదలు కావటం తో, మన స్కూల్ లో చదివిన పూర్వ విద్యార్థులు ఎక్కడో ఉంటూ, మనతో టచ్ లోకి రావటం ఎన్నడూ ఊహించలేదు. మన గురించి వారి వారి బ్లాగులలో (హిమబిందువులు, గోదావరి, త్రిష్ణ) చక్క గ ప్రస్తావించడం వారి విశాల దృక్పథానికి తార్కాణాలు. వారికి మన అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుం దాము.
కన్నీళ్లు
1. పైన వున్న ఫోటో లో నించున్న వాళ్ళలో మొదటి వరసలో వున్నా మూడో వ్యక్తి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు లేడు అన్నది ఎంతో బాధాకరమైన నిజం. June 20 న కలిసిన మన మిత్రుడు శ్రీధర్ రెడ్డి జూలై 3 న accident కి గురై, జూలై 15 న తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయాడు. ముందే బ్లాగు మొదలు పెట్టినా, తన మరణం తో ఈ బ్లాగుని ముందుకి తీసుకెళ్లాలన్న సంకల్పం గట్టిపడింది. తన కి అర్పించిన అశ్రు నివాళి ఈ బ్లాగు కి తొలి తెలుగు టపా. ఓ 20 రోజుల ముందు తను మాట్లాడిన మాటలు చెవుల్లో గింగురు మంటుండగా , తను మన మధ్య లేడన్న నిజం చాల రోజులు బాధ పెట్టింది. మన మిత్రులందరూ, తనని ఆఖరి సారి చూడటానికి వెళ్లారు. ఇదే అతి దుఃఖ భరిత క్షణం.
2. ఈ వార్త మన ఫ్రెండ్స్ లో చాల మందికి తెలియక పోవచ్చు. స్వర్ణ తన బాబు తో కార్ లో సినిమా కి వెళ్తూ, కార్ ఆక్సిడెంట్ కి గురైంది జూలై లో. దేవుడి కృప తో, చాల miraculous గ తప్పించుకున్నారు. కార్ ని స్వర్ణ repair కి తీసికెళ్తే, మెకానిక్ అడిగాడట…”madam ఈ కార్ లో ఉన్నవారు ఎవరైనా బతికారా” అని. తనే అందులో ఉన్నానని చెప్పే సరికి, మెకానిక్ నిర్ఘాంత పోయాడట.
3. మన సూరి నవంబర్ లో ఇంటికి వెళ్తూ, మురుగన్ గుడి దగ్గర, మోటర్ bike నుండి పడ్డాడు. పక్కనే divider కి తగల కుండా స్కిడ్ అయ్యి .. తను కాలు, తల పై గాయాలతో స్పృహ తప్పాడు… ప్రస్తుతం కోలుకుంటూ ఉన్నాడు.. తను క్షేమంగా ఉండటం… ఆ దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోక తప్పదు.
ఇలా ముగిసింది ఓ సంవత్సరం. అందరికి అంతా మంచే జరగాలని, ఏది జరిగినా ఎదుర్కునే స్థైర్యాన్ని అందరికి ఉండాలని కోరుకుంటూ… 2011 కి స్వాగతం చెబుదాం.
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
SRRao
శిరాకదంబం
నా బ్లాగ్లో రాసానని చెప్పాలని ఇటు వచ్చానండీ. చూసారా. థాంక్స్ అండీ.
Happy New Year మీ అందరికీ. ఓ వ్యాఖ్య వీలున్నప్పుడూ అక్కడ కూడా పడేయండి మరి…:)
బాగుందండీ మీ ఆనందభాష్పాలు ..కన్నీళ్లు .మనలోని వ్యక్తులను తలుచుకుంటే చాలా భాధగా ఉంటుందండీ .మీ మైత్రివనం గూర్చి చెప్పడం అంటే మమ్మల్ని గూర్చి చెప్పడమే కదా అక్కడ మీ అందరి చిన్ని చిన్ని అడుగుల్లో మేము చిన్ని చిన్ని అడుగులు వేసిన వాళ్ళమే కదా.
అన్నట్లు స్వల్ప వ్యవధిలో కలిసినవారు మీరే కాదండోయ్ 🙂 మా ఏలూరు స్నేహితులం జూలై లో ఒకసారి,పోయిన వారం అంటే డిసెంబర్ లో కూడా విజయవాడలో కలిసాం….తరుచు కలుస్తుంటాం తల్లులు పిల్లలు సహా 🙂 బాగా రాసారు .అభినందనలు .
Dear friends.,The year2010 passed out with some joys &sorrows.I hope we all can say good bye to 2010&welcome to 2011 with fond hope of happy& prosporous newyear2011.
andariki happy new year . devudi daya valla 2011 antha manchiga undalani korukuntunna.head master gariki kudi pakkana unna mastergari peru ? 4th c masterla unnaru.
thanks andi. meeku, mee family ki kuda happy new year ani. photo lo head master lerandi. mugguru teachers (high school) charli babu, ramakrishna (nenu kaadandoi) and pushparaj (PET) sir unnaru.
ramakrishna
chusthaki head masterla unnaru ayane anukunna ,miru cheppina tharuvatha observe cheste ayana kaadu .chittor velli memu unna illu ,school chudalani undi.velladaniki try chesthamu.