ఈ పాట కన్నడ లోనే బాగుంటుంది

“ఎదుట నిలిచింది చూడు… జలతారు వెన్నెలేమో…” అని వాన film లో సిరివెన్నెల పాట మొదట సారి మన ఫ్రెండ్స్ తో మన వూర్లో చూసాను. సెకండ్ షో కి వెళ్ళాము నేను, మధు, ప్రసన్న… నాకు మాగన్ను గ నిద్ర పడుతున్నా.. ఈ పాట వచ్చిన ప్రతీ సారి మెలుకువ వచ్చి అలాగే చూస్తూ వుండి పోయాను. కమలాకర్ చక్కని మ్యూజిక్ (తను ప్రాణం లో కంపోస్ చేసిన “నిండు నూరేళ్ళ సావాసం…” కూడా బాగా వుంటుంది. ) ఇచ్చాడని మెచ్చుకున్నా మనసులోనే.  తరవాత తెలిసింది ఆ పాట ఒరిజినల్ ట్యూన్ మనో మూర్తి అనే ఓ యు. ఎస్. నుండి వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ “ముంగారు మళె” (తొలకరి వాన)  అనే ఓ కన్నడ సినిమా కి చేసారని. ఆ పాట కన్నడ లో విన్నాక,  అది కన్నడ లోనే బాగుందని అనిపించింది. చిత్రీకరణ కూడా కన్నడ మాతృక లోనే బాగుంది.

ఇక పోతే కన్నడ లో నచ్చటానికి కారణం, కమలాకర్ పల్లవి ని యధా తధం గ తెలుగు లో తీసుకున్నా,  చరణాలు మాత్రం ఇంకో ట్యూన్ లో చేసారు. పాట జలపాతం లా పల్లవి లో సాగి, చరణం వచ్చేసరికి ఒక్క సారి సెలయేరు లా గంభీరంగా మారటం ఎందుకో ఆ పాటకి సూట్ కాలేదు అనిపించింది. కానీ కన్నడ లో వింటే , పల్లవి లోని వడి ని, చరణం లో కూడా కొనసాగించాడు. పైగా సోను నిగం ఈ పాట లో ఓ ప్రేమికుడు పలికించాల్సిన ఆరాధనా భావాన్ని, ఆర్తి ని బాగా పలికించారు.

ఈ పాట సాహిత్యం కన్నడ లో ఇలా ఉంటుంది.

పల్లవి

అనిసుతిదే  యాకో  ఇందు
నీనేనే   నన్నవలేన్దు
మాయదా  లోకదిన్ద
ననగాగే  బందవలిందు
ఆహా  ఎంత  మధుర  యాతనే
కొల్లు  హుడుగి  ఒమ్మే  నన్న , హాగే  సుమ్మనే (ఇక్కడ ‘సుమ్మనే’ అని సోను నిగం పలికే తీరు అమోఘం..)

ఇలా మొదలయ్యే పల్లవి ని స్మూత్  గ మొదటి చరణం next plane లోకి తీసుకెళ్తుంది. చరణం ఏంటంటే

సురియువ  సోనేయు  సూసిదే  నిన్నదే  పరిమళ
ఇన్న్యార కనసులు  నీను  హోదరే  తలమల
పూర్ణ  చందిరా  రజా  హాకిద
నిన్నయ  మొగవను  కండ  క్షణా …
నా  ఖైది  నీనే   సేరెమనే
తబ్బి  నన్న  అప్పికొ  ఒమ్మే …. హాగే  సుమ్మనే

ఓ చిరు జల్లు పడే సమయంలో వినాలనిపించే పాట ఇది. ఈ పాట చిత్రీకరణ లో నది లో తేలియాడుతూ (ఏ సపోర్ట్ లేకుండా) హీరో ని చూపించే షాట్ చాల creative గ అనిపించింది. పల్లవి లో వాడిన “మధుర  యాతనే” అన్న పదాన్ని తెలుగు లో పాట sad వెర్షన్ లో “మధురమైన యాతనేదో  తరుము తొందిలా  …”  అని వాడారు.

కన్నడ లో ఈ పాట నచ్చటానికి కారణాలైన పల్లవికి దీటైన చరణాలు, చక్కటి ట్యూన్, సోను ని(గళ)మ్ లో జీవం పోసుకున్న భావం … పాట చిత్రీకరణ  లోని నవ్యత… ఈ పాటని ఎన్ని సార్లు విన్నా, చూసినా మళ్ళీ వినాలి, చూడాలి అనిపించేటట్లు చేస్తుంది. అందుకే ఈ దశాబ్దం లో ఎక్కువ గా నేను విన్న పాట ఇదే..


Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

2 Responses to ఈ పాట కన్నడ లోనే బాగుంటుంది

 1. Raj says:

  నాకు ఈ పాట కన్నడలోనే మొదట పరిచయం అయ్యింది. మీరన్నట్లు తెలుగులో అంత బాగా రాలేదు. ఇదే పాట female version కూడా కన్నడలో అర్థవంతంగా ఉంటుంది. ఈ పాటే కాక “ಮುಂಗಾರು ಮಳೆಯೇ” అన్న పాట కూడా బాగా నచ్చింది.

  • mhsgreamspet says:

   @raj
   మీరు చెప్పిన రెండో పాట కూడా చాల బాగుంటుంది. కాని ఆ పాట నిడివి చాల తక్కువ గ ఉండటం తో అప్పుడే అయిపోయిందే అనే feeling కలుగుతుంది. thanks for your comments
   రామకృష్ణ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s