వెన్నెల+తేనె=జేసుదాస్ గానం

“సుర్మయి అఖియోం మే నన్హ మున్న ఏక సప్నా  దే జారే..” లాంటి జోల పాడినా, “హరివరాసనం విశ్వ మోహనం  …. ఆరాధ్య పాదుకం”  అంటూ అయ్యప్ప భక్తీ గీతం ఆలపించినా,  “తుజో మేరె  సుర్ మే సుర్ మిలాలే… సంగ్ గాలే…”  అంటూ ప్రేమ గీతం పాడినా… ఆ కంఠం లో అదే కోమలత, లాలిత్యం తొణికిసలాడుతుంది. తనదంటూ ఓ శైలిని కలిగిన ఆ స్వర సంపన్నుడు జేసుదాస్ గారి జన్మ దిన సందర్భం గా, శుభాకాంక్షలందజేస్తూ తన పేరు వినగానే నాకు వినపడే కొన్ని గీతాలు ఇవే…

సునైనా … సునైనా… ఆజ్  ఇన్నజారోం  కో తుం దేఖో …ఆర్ మై తుమ్హే …” అనే “సునైన” చిత్రం లోని  పాట ఓ అంధురాలైన అమ్మాయికి బాహ్య  ప్రపంచం  లోని అందాలను చూపించే ప్రయత్నం లో పాడే పాట ఎంతో హాయి గ ఉంటుంది. ఈ పాట ని స్వరపరిచిన రవీంద్ర జైన్ (తనే గీత రచయిత కూడా..) కూడా చూపుకి నోచుకోక పోయినా తను తన సంగీతం, సాహిత్యం తో ఈ లోకాన్ని చూపున్న వాళ్లకు చూపించటం ఎంతో గొప్ప కదా..

హిందీ పాటలలో రవీంద్ర జైన్ , జేసుదాస్ ల combination లో ఎన్నో హృద్యమైన గీతాలు ఇంకా ఎన్నో వచ్చాయి. “చిత్చోర్” లో “గోరి తేరా గావ్ బడా ప్యారా…”  అన్న పాట ఎంతో జన ప్రాచుర్యం పొందిందో, ” తుజో మేరె సుర్ మే..” , “జబ్ దీప్ జలే ఆనా..” , “ఆజ్ సే పెహ్లే..” లాంటి గీతాలు కూడా అంతే బాగుంటాయి.

వీరి combination లో “దాదా” చిత్రం  లో “దిల్ కే టుకడే…  టుకడే కర్ కే … ముస్కురాకే చల్ దియే..జాతే జాతే ఏ తో బతా జా… హం జియేంగే  కిస్కే లియే…”  అనే పాట ఓ మరపు రాని పాట. అలాగే “నయ్య” చిత్రం లో “ఓ గోరియా రే.. ఓ గోరియ రే.. తేరి ఆనే సే సజ్ గయి హమ్రి ఏ టూటి పూటి నావ్..” ఎంత సుమధురంగా  ఉంటుందో..

“ససురాల్” చిత్రం లో “సున్ సున్ గావ్ కి గోరి…సున్ కర్ ..”  పాటలో వచ్చే కొన్ని వాయిద్యాలు వింటుంటే ఆ సంగీతం ఇంకో ప్రపంచం లో విహరింప జేస్తుంది.

“మేఘసందేశం” లో “ఆకాశ దేశాన ఆషాఢ మాసాన… మెరిసేటి ఓ మేఘమా..” , స్వయంవరం లో “గాలి వాన లో… వాన నీటిలో.. పడవ ప్రయాణం..” లాంటి పాటలో ఆవేదనను కూడా ఎంతో చక్క గ ఆవిష్కరించ గలిగిన స్వర మాంత్రికుడాయన.

ఇలా చెప్పుకుంటూ పోతే.. అసలు ఇష్టం లేని గీతాలను ఎంపిక చేయటం సులభం అనిపిస్తుంది.. ఎందుకంటే అతని ప్రతి గీతమూ ఓ అణిముత్యమే కనుక.

Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

One Response to వెన్నెల+తేనె=జేసుదాస్ గానం

  1. చూడబోతే మీ బ్లాగ్లో నేను వ్యాఖ్యల కన్నా లింక్స్ నే ఎక్కువ ఇస్తున్నట్లు ఉందండీ…:)
    ఇది క్రితం ఏడు నేను రాసిన టపా: http://trishnaventa.blogspot.com/2010/01/blog-post_10.html

    http://samgeetapriyaa.blogspot.com/2010/12/hymns-from-rig-veda.html

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s