మూడు నిమిషాల్లో సైకాలజి పాఠం

సిగ్నల్ దగ్గర ఎర్ర లైటు వెలగటం తో కీచుమంటూ ఆగింది కారు. ఇంకో మూడు నిమిషాలు ఆగాలి కదా అని నిట్టూరుస్తూ పక్కనే అప్పుడే వచ్చి ఆగిన కారు లోకి యధాలాపం గ చూసాను. ఓ ఐదేళ్ళ అబ్బాయి, డ్రైవ్ చేస్తున్న వాళ్ళ నాన్న. వారిని చూస్తూనే ఓ బుట్టలో బొమ్మలు పట్టుకొని వారి ముందు కి దూసుకొచ్చాడో యువకుడు. ఆ బొమ్మల్ని చూస్తూనే ఆ పిల్లవాడి మొహం ఆనందంతో విప్పారింది. వెంటనే ఆ బొమ్మ తీసివ్వాల్సిందే అంటూ మారాం చేయసాగాడు. తప్పదన్నట్లుగా తన నాన్న డీల్ మొదలెట్టాడు.


“బాబు, ఆ బొమ్మ ధర ఎంత…”


“జత 120 రూపాయలు.. ఇది ఎండ ఉంటె చాలు నడుస్తుంది .”


“చాల ఎక్కువ చెపుతున్నావే…”


“పోనీ మీరెంత ఇస్తారు….?”


ఇలా బంతి తన కోర్టు లో పడేసరికి… కాసేపు తటపటాయింపు … మరి తక్కువ చెపితే తిడతాడేమో.. ఎక్కువ చెపితే… మోసపోతామేమో అనే సంశయం ద్యోతకమైంది ఆయన మొహంలో… కొన్ని క్షణాల  తరవాత…


“నలభై ఇస్తాను…”


“ఎంతా… నలభయ్యా…” నమ్మలేనట్లు గ మొహం పెట్టి… ” దీని కొన్న ఖరీదే 50 రూపాయలు… మరీ అంత తక్కువా…పోనీ అరవై కి ఇస్తాను.. నాకు పది రూపాయలు లాభం చాలు..” చాల ఫ్రాంక్ గ చెపుతున్నట్లు చెప్పాడా బొమ్మల అబ్బాయి…


ఇంత తక్కువ కి ఇస్తున్నాడంటే… ఇంకా తక్కువే దాని వెల అయ్యింటుంది… దానిని కొనటం అనవసరం  అని నిశ్చయానికోచ్చేసాడు  ఆ ఆసామి. లిప్త పాటులో  అతనిని చదివేసాడు ఆ బొమ్మల అబ్బాయి.. ఆ బొమ్మని ఆడించడం మొదలెట్టాడు… అది చూస్తూనే ఆ పిల్లాడిలో కొత్త ఉత్సాహం.. “నాన్న తీసివ్వు…” అని స్వరం పెంచాడు.

 

తటపటాయిస్తున్న ఆ తండ్రి ని ” ఏంటి సార్.. బాబు అంతలా ప్రాధేయ పడుతున్నాడు… బొమ్మని తీసుకోండి.. ఇంత పెద్ద కారు ఉన్న మీకు ఇది ఓ లెక్కా…?” అంటూ తన వైపు నుండి కూడా యధాశక్తి ఒత్తిడి పెంచాడు ఆ వ్యాపారి.


కుడితి లో పడ్డ ఎలకలా తయారైంది ఆ తండ్రి పరిస్థితి. తను తటపటాయించే  కొద్దీ , పిల్లాడి స్వరం ఆరున్నొక్క రాగం లోకి మారటం…  ఆ వ్యాపారి ఆ బొమ్మల్ని ఆడిస్తూ ” బొమ్మల్ని  తీసుకోండి… దీనికి నేను గ్యారంటీ…” అని చెప్పటం…మొదలైంది.


ముగ్గురూ వారి వారి లక్ష్య సాధన లో తమ శక్తి మేర ప్రయత్నిస్తున్నారు. బొమ్మని తీసుకోకుంటే .. పిల్లాడు ఊరుకోడని అర్థమైంది ఆ తండ్రికి. తన స్ట్రాటజీ మారిపోయింది.


“సరే… ఇది ఎలా పని చేస్తుందో చెప్పు…” అనగానే అ వ్యాపారి ఓ  డెమో మొదలెట్టేసాడు. డెమో అయ్యింది.


“ఎండ లేక పోతే… ఇది పని చేయదు కదా… అప్పుడెలా..?” డౌట్ వచ్చింది అతనికి.


” ఏం పరవాలేదు సర్… లైటు వెలుగు లో కూడా ఇది పని చేస్తుంది…” చెప్పాడా వ్యాపారి..


“నిజంగా పని చేస్తుందా…నాకలా అనిపించడం లేదే…”


ఇంతలో పచ్చ లైటు వెలిగింది..


అంతే.. రామబాణం లా దూసుకెళ్లింది కారు ఇంతలో..


బొమ్మ చేతికోస్తున్దనుకున్న పిల్లాడి మొహం లో ఒక్క సారిగా ఉప్పెన లా పొంగిన దుఖం, నమిలి పారేయాలన్న  కోపం…


“అరెరే ఎంత ప్రయత్నించినా అమ్మలేక పోయానే. పర్లేదు… ఇంకో

కారు దొరక్క పోతుందా..” అన్న అన్వేషణ లో వెనుతిరిగిన ఆ వ్యాపారి..


“హమ్మయ్య…” అన్న రిలీఫ్ ఆ తండ్రిలో..


అంతా ఆ  మూడు  నిముషాల లో జరిగిపోయింది…


ఒకరు emotional బ్లాక్ మెయిల్ చేస్తే, ఒకరు ambush మార్కెటింగ్ కి ప్రయత్నిస్తే, ఇంకొకరు “wait and watch” స్ట్రాటజీ అవలంబించారు.

అందులో చివరికి “కాపిటలిస్టే” గెలిచాడు ఆ ముగ్గురి psychological war లో అనుకున్నా మనసులో.


Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

3 Responses to మూడు నిమిషాల్లో సైకాలజి పాఠం

  1. D S KRISHNAN says:

    i enjoyed transaction analysis of the incident . i really enjoed. we come across many such incidents, be it commercial, or social,or even in our own families. Let not the capitalist rule atleast our families,. Let LOVElist dominate the Scene.

  2. kiran kumar says:

    very nice ex plan

  3. sj rao says:

    brief information about psychology, thanks

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s