సరదాగా నవ్వుకోండి..

నవ్వు నాలుగు విధాల గ్రేటు అన్నారు కదా.. చిన్నప్పుడు చదివిన కొన్ని జోక్స్ ఇప్పటికీ నాకు అప్పుడప్పుడూ గుర్తొస్తూ నవ్వొస్తూ ఉంటుంది.. అలా గుర్తొచ్చే జోక్స్ కొన్ని మీ కోసం…

టీచర్ :” పిల్లలూ.. ప్రతి రోజూ మీరు కనీసం ఒక్క మంచి పని అయినా చేయాలి”
విద్యార్థులు:”మంచి పని అంటే ఏమి చేయాలి టీచర్?”
టీచర్ : “ఏముంది. ఎవరైనా ముసలి వారుంటే,.. వారిని రోడ్డు ని దాటించటం లాంటివన్న మాట..”
********
మరుసటి రోజు
టీచర్: “ఏంటి మీరందరూ ఇంత ఆలస్యంగా క్లాసు కి వచ్చారు?”
విద్యార్థులు: ” మీరు మంచి పని చేయమన్నారు కదా? అందుకే అందరం కలిసి ఓ ముసలావిడని రోడ్డు దాటించి వచ్చేసరికి ఇంత ఆలస్యమైంది..”
టీచర్: “భేష్.. మంచి పని చేసారు.. కాని ఒక్క ముసలావిడని దాటించడానికి ఇంత మందికి  ఇంత సేపా..?
విద్యార్థులు: “ఏం చేయాలి టీచర్… ఆ ముసల్ది ఆ రోడ్డు దాటనని తెగ మొండికేసింది. అందుకే బలవంతంగా దాటించే సరికి ఇంత సేపు అయ్యింది..”
—————————————————


కొడుకు: “అమ్మా. మనిషి కోతి నుండే పుట్టాడని చదివాను… నిజమా…?
అమ్మ: “ఏమో బాబు.. మీ నాన్న తరపు బంధువుల గురించి నాకంతగా తెలియదు..”
———————————————–

జ్యోతిష్యుడు : “చూడు నాయనా.. నువ్వు ఇంకో పది సంవత్సరాలు కష్టాలు పడతావు..”
జ్యోతిష్యం  చెప్పించుకునే వ్యక్తి: “తరవాత..?”
జ్యోతిష్యుడు: “ఆ కష్టాలకు అలవాటు పడి పోతావు..”
———————————————————
టీచర్: “రామూ… నువ్వు ఆవు మీద రాసిన వ్యాసం సోము రాసిన వ్యాసం లాగే ఉంది.. కాపీ కొట్టావా?
రాము: “లేదు టీచర్.. ఇద్దరం ఒకే ఆవు మీద వ్యాసం రాసుకొచ్చాము. అందుకే ఒకేలా ఉన్నాయి”

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s