అందమైన జీవితం… ఓ గుజారిష్

స్వేచ్చ … డబ్బు కంటే ఎక్కువగా మనిషే కోరుకునే ఓ వరం. పసి పిల్లాడి కి  ఇష్టం లేని పాలు తాగడం నుండి స్వేచ్చ.. బతుకు చట్రం లో ఇరుక్కున్న ఓ బడుగు జీవి కి బాధ్యతల నుండి స్వేచ్చ… చదువులు, పోటి ప్రపంచం నుండి ఓ విద్యార్ధి కి స్వేచ్చ.. ఇలా మనిషి మనిషి కీ ఈ స్వేచ్చ యొక్క నిర్వచనం మారుతూ వుంటుంది. సహకరించని శరీరం నుండి ఆత్మ కి విముక్తి కలిగించమని న్యాయ స్థానాన్ని వేడుకునే ఓ దుర్బలుడి కథే “గుజారీష్” అనే హిందీ చిత్రం కథ. “బ్లాక్” అనే ఉదాత్త కథాంశాన్ని తెరకెక్కించిన సంజయ్ లీల భన్సాలి అంతే గొప్ప కథని తన సంతకముండే వెండి తెర కాన్వాస్ మీద చిత్రీకరించారు ఈ కథని.

కథలోకి వస్తే.. మెడ వరకు చచ్చుబడి పోయి కేవలం నూట ఎనభై డిగ్రీలు తల తిప్పగలిగే ఓ ఐంద్రజాలికుడు తనకి మరణం ప్రసాదించమని న్యాయ స్థానాన్ని కోరుతాడు. ఈ పోరాటం లో అతనికి ఓ ఆత్మీయురాలు, తల్లి, తన కోసం అయిష్టం గ న్యాయ పోరాటం  చేసే ఓ స్నేహితురాలు, డాక్టర్, తన బాధని అర్థం చేసుకున్నా అంగీకరించలేని జడ్జి, ప్రతివాది, తన ఇంద్రజాల విద్యని నేర్చుకోటానికి వచ్చే ఓ శిష్యుడు ఇతర పాత్ర దారులు.
 

నాకు నచ్చిన విషయం ఏంటంటే.. ప్రతికూల పరిస్థితులను ఆశావహం గ ఎదుర్కునే పోరాట తత్వం కల ఓ యువకుడు  ఇతరులకు ఓ రేడియో ప్రోగ్రాం ద్వారా ఆశ ను నూరి పోయడం, ప్రతి విషయాన్నీ చిరు నవ్వుతో స్వీకరించటం. ఓ సన్నివేశం లోఅందరు నిద్ర పోతుంటే.. వర్షం కురిసే సమయం లో చూరు నుండి నుదిటి పై పడే వర్షపు చుక్కలను తప్పించుకోటానికి ఎంతో నిబ్బరం గ పోరాడి అలసి అచేతనావస్థ కి వెళ్ళే దృశ్యం చూస్తే కళ్ళు చెమర్చక మానవు.
తను మరణాన్ని కోరుకుంటే… ఆ కోరికను బల పరిచే వారు .. తనకి జన్మ నిచ్చిన తల్లి, తనని ప్రాణం కంటే మిన్న గ చూసుకునే ఓ నర్స్ కావటం అసహజం గ అనిపించే ఓ వాస్తవం… ఎందుకంటే.. ఎంతో ఇష్ట పడే వాళ్ళు… తమ బాధని చూడలేరు.. వారి విన్నపం లోని వాస్తవికతను గుర్తించ గలిగేదీ  వారిని ఇష్టపడే వాళ్ళే.

విచారణ సమయం లో ప్రతివాదికి ఓ ఇంద్రజాలం  చూపిస్తానంటూ, అతడిని ఓ ఇరుకైన పెట్టె లో కూర్చోపెట్టి తాళం వేసి రెండు నిముషాలు ఉంచుతాడు హీరో. శ్వాస ఆడక అతడు గగ్గోలు పెడుతుంటే, చూస్తూ ఊరుకుంటాడు. పరిస్థితి విషమించే సమయం లో పెట్టెని తెరుచుకుని బయట పడి, ఆ లాయర్ హీరో పై మండిపడతాడు. శరీరానికి సహకరించని ఓ పెట్టెలో రెండు నిమిషాలు ఉన్నందుకే, స్వేచ్చ కోసం అతడు అంత తపిస్తే.. ఎన్నో ఏళ్ళు గ కదలలేని శరీరం నుండి  తను స్వేచ్చ కోసం ఎంత తపిస్తున్నదీ అర్థం చేసుకోమంటాడు. అప్పుడు ఒకసారి, మనం కూడా ఆ న్యాయవాది లాగా అతని కోరిక లోని నిబద్ధతని ఆ క్షణం లో అర్థం చేసుకుంటాము.
 

ఒక సిక్స్ పాక్ హీరోని మంచానికే పరిమితం చేయటం, ఎంతో ప్రజ్ఞ గల హీరొయిన్ ని పాటలు, నృత్యాలకు వాడక పోవటం దర్శకుని సాహసానికి గీటురాయి అని చెప్పొచ్చు. చిత్రం చూస్తున్నంత సేపు, నాకు హృతిక్ రోషన్, ఐశ్వర్య రాయ్ అసలు కనపడలేదు చిత్రం లో. కేవలం వారి పాత్రలే కదలాడాయి.
ఊహించినట్టు గానే ఈ చిత్రం అంతగా ఆడ లేదు.. ఓ వాన పాట, ఓ ఫైటు, హృతిక్, ఐశ్వర్యల  నృత్య కౌశలాన్ని  చూపించే రెండు యుగళ గీతాలు … ఇలాంటివి ఏవీ లేకుండా సినిమా ఆడాలంటే ఎలా చెప్పండి?

 


 


Advertisements
This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

2 Responses to అందమైన జీవితం… ఓ గుజారిష్

  1. Mercy killing not possible with prevailing constitution law provisiions in india&till amended suitably.

  2. D S KRISHNAN says:

    i oppose mercy killing , though there may be difficulties
    to the patient, and the care takers, as life’.s life lives with life

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s