పద్మభూషణుడు ఖయ్యాం కి పాటల హారతి

మీరెప్పుడైనా ఓ పండు వెన్నెల రాత్రి, డాబా మీది కెళ్ళి, ఆకాశాన్ని అలంకరించిన చుక్కల్ని చూస్తూ, ఎక్కడినుండో వీచే పవనాన్ని తాకుతూ, గో గంటల గల గలలు వింటూ కలిగే అనుభూతి పొందాలనుకొన్నారా? పున్నమి రాత్రి, గోదారి వడ్డున నడుస్తూ, దూరం నుండి వినిపిస్తున్న వేణు గానాన్ని ఆస్వాదించాలనుకున్నారా ? బాధ్యతలు.. పనులు.. ఇక ఇలాంటి అనుభూతులకు టైం ఎక్కడిది అంటారా..? మరేం పర్లేదు. మీకా కోరిక తీరాలంటే స్వర శిల్పి ఖయ్యాం గారి పాటలు వినండి.

సంతోషకరమైన విషయం ఏంటంటే ..    ఈ సంవత్సరం పద్మ భూషణ్ పొందిన వారిలో ఒకరు మన బాలు గారైతే, ఇంకో విశిష్ట మైన కళాకారుడు , నాకు ఎంతో ఇష్టమైన ఖయ్యాం గారు. ఖయ్యాం పాటలు వింటుంటే … జలతారు వెన్నెల ప్రవహిన్చినట్లు అనిపిస్తుంది.  ఖయ్యం అంటే గుర్తు రాక పోతే… కభి.. కభి పాట స్వరకర్త అంటే , అతను గుర్తు రాక మానరు.

నాకు నచ్చిన ఖయ్యాం స్వరపరిచిన పాటలు మీ కోసం

1. చాందిని  రాత్   మే  ఏక్  బార్  తుజ్హే  దేఖా  హై– ‘దిల్ ఎ నాదాన్’ (తెలుగు లో వయసు పిలచింది) చిత్రం లోని ఈ పాట రాజేష్, జయప్రద ల పై చిత్రీకరించారు. ఈ పాట వింటుంటే, వెన్నెల్లో విహరించినట్లే ఉంటుంది. లతా, కిషోర్ పాడారీ పాటని.2. కభి   కభి  మేరె  దిల్  మే– 

‘కభి కభి’ లోని లతా ముకేష్ పాడిన ఈ పాటని ఇష్ట పడని వాళ్ళు ఉండరేమో. ultra  silky  smooth song ఇది.  ఈ పాట కి ముందు అమితాబ్  వ్యాఖ్యానం ఉంటుంది ఎంతో గంభీరంగా. అందులో   गुजर रही है जिंदगी कुछ इस तरह , जिसे किसी सहारे की आरज़ू भी नहीं అనే వాక్యాలు ఎంతో touching  గ ఉంటాయి.
3. మొహబ్బత్  బడే కాం కి చీజ్ హై..’త్రిశూల్’ లో కిషోర్, లతా, జేసుదాస్ పాడిన అరుదైన పాట ఎంత మధురం గా ఉంటుందో..
4. దిల్  చీజ్  క్యా  హై ఆప్ మేరి జాన్ లీజియే– ‘ఉమ్రావ్ జాన్’ లో ఆశ పాడిన పాట5. హజార్ రాహే ముడ్ కే దేఖి.. ‘థోడిసి బెవఫాయి’ అన్న సినిమా లోని ఈ పాట లతా కిషోర్ పాడారు. 

6. అంఖో  మే  హమ్  నే  ఆప్కే సప్నే సజాయే హై … ‘థోడిసి బెవఫాయి’ లోని ఈ ఇంకో పాట కూడా ఎంతో బాగుంటుంది

7. దిఖాయే  దియే  యు… ‘బజార్’  చిత్రం లో లతా పాడిన పాట

8. ఆయె  దిల్  ఎ  నాదాన్… ‘రజియ’ సుల్తాన్ లో లతా పాడిన పాట

9. ఆజారే … ఆజారే. మేరి దిల్ భర్ ఆజా.. ‘నూరి’ చిత్రం లో లతా, ముకేష్  పాడిన ఈ పాట ని ఎవరు మరువ గలరు?

 

Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

One Response to పద్మభూషణుడు ఖయ్యాం కి పాటల హారతి

  1. oh.. sweet sharing.. all songs.. I like very much. chandhinee raath hai.. parichayam cheyalanukunnaa.. inthalo.. mee.. paatala parichayam.. super. khayyam… madhura swaraala.. ghani. thankyou..very much..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s