కర్షకుడు అంటే…?

ఐదవ తరగతి లో   ట్యూషన్ వెళ్తున్న రోజులు ..ఓ రోజు క్లాసు లో తెలుగు లో పదాలు, అర్థాలు బోర్డ్ మీద రాసారు. క, ఖ పక్క, పక్కనే కాబట్టి, మొదట కర్షకుడు- రైతు అని, తరవాత ఖరము- గాడిద అని రాసారు. మనం తొందరలో… కర్షకుడు- గాడిద అని రాసేసుకున్నాము. అందరు త్రీ ఇడియట్స్  లో   చతుర్ రామలింగం లాగ బట్టీ పట్టేసాము. టీచర్ అందరిని తెలుగు పదాల అర్థాలు అడగడం మొదలెట్టింది. కర్షకుడు అంటే ఎవరు అని అడిగేసరికి… క్లాసు లో ఎవరికీ గుర్తు రాలేదు. ఇంకేముంది… మనం చెయ్యి ఎత్తేసాం.. చెప్పు అని మేడం  అనేసరికి… “కుంకల్లారా… మీకు తెలియనిది నాకు తెలుసు చూడు…” అని అందరి వేపు చూసి, ఓ సారి  కాలరు సవరించుకుని “గాడిద” అన్నాను. కొంత సేపు స్థాణువై   పోయింది మేడం  …. అంతే … తరవాత తెరలు తెరలుగ పగలబడి నవ్వసాగింది.. నాకు అర్థం కాలేదు. మేడం నవ్వడమే కాదు… పక్కనున్న ఇంకో టీచెర్ ని పిలిచి, విషయం చెప్పే సరికి, ఇద్దరూ కోరస్ గ నవ్వ సాగేరు.  ట్యూషన్ అయ్యాక , ఇంటి దగ్గర థర్డ్ అంపయర్    మా అన్నయ్య దగ్గర రెఫెర్ చేస్తే, తనూ నవ్వి, తరవాత clarify చేసాడు.

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

2 Responses to కర్షకుడు అంటే…?

  1. PADMAJA says:

    meeru telisi cheppina porapatuga cheppina meening adi kakapoyina varidddaru chese pani matram samaname. IDDARU KASTAPADI PANICHESEVALLE.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s