ఈ పుస్తకం ఎంతో అపురూపం

వ్యక్తిత్వ వికాసానికి మనం ప్రస్తుతం  నమ్ముకుంటున్న ఈ టెక్నాలజీలు ఎంత వరకు ఉపయోగపడతాయో చెప్పలేను కాని.. పుస్తక పఠనం మాత్రం మనిషి వ్యక్త్తిత్వాన్ని  (ముఖ్యం గా విద్యార్ధి దశ లో) ఎంతో ప్రభావితం చేస్తాయన్నది నిజం… 1970 -80  ప్రాంతం లో విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ తో పాటు, చందమామ, బొమ్మరిల్లు లాంటి పుస్తకాలు విషయ పరిజ్ఞానం, భాషపై అవగాహన మంచి కథలనే తీపి గుళికల రూపంలో  ఇచ్చేవి. వీటి తో పాటు, ఇంకో వర్గపు పుస్తకాలు కూడా ఆ రోజుల్లో దొరికేవి. అవే రష్యన్ ప్రచురణలు. ఆ దేశం లోని నాగరికతని ప్రతిబింబిస్తూ.. అక్కడి బాలల కోసం రాసిన పుస్తకాలను, ప్రగతి ప్రచురణాలయం మాస్కో వారు తెలుగు లో అనువదించి, ప్రచురించే వారు. వీటి వేల కూడా కేవలం ముప్పై పైసల నుండి రెండు రూపాయల దాక వుండేది.  నాన్న ఈ పుస్తకాలను తేచ్చారంటే.. ఆ రోజు నాకు పండగే.. మంచి కాగితం పై చక్కటి బొమ్మలతో… సువాసనలు వేదజల్లెటివీ పుస్తకాలు. రెండు రోజులు, వాటి వాసనతోనే గడిపేసే వాడిని… పుస్తకం చదవకుండా.. పద్మశ్రీ బుక్ స్టాల్ లో ఈ పుస్తకాలు దొరికేవి.
నా జీవిత చక్రం లో నాతో పాటు తిరుగుతూ, కాలాన్ని ఎదిరించి … ఈ రోజుకీ నాతో నిలిచిపోయిన ఓ పుస్తకం… ” కొమ్ముల గొర్రె పిల్ల”… దీనిని ఉప్పల లక్ష్మణ రావు తెలుగు లో కి అనువదించారు. అసలు రచయిత కిర్గిజ్ రిపబ్లిక్ లో ఉండేవారు. అక్కడి చిన్న పిల్లల కోసం రాసిన పుస్తకం ఇది. ఇలా మన కు అందటం అపురూపమే కదా..

కొమ్ముల గొర్రె పిల్ల

ఈ కథ  అజీజ్ అనే చిన్న పిల్ల వాడి చుట్టూ తిరుగుతుంది. తను ఓ గొర్రెల కాపరి కొడుకు. తండ్రి అన్న, అతను చేసే పనులన్న అజీజ్ కి ఎంతో ఆరాధనా పూర్వక భావం వుంటుంది. తను గొర్రెలని  చూసుకుంటూ, నాన్నకి తను పెద్దవాడిని అయ్యానని తెలపటానికి, ఓ రౌడి గొర్రె ని మచ్చిక చేసుకోబోయి గాయపడతాడు. తన నాన్న అజీజ్ ని కోలుకునేట్లు చేయటం, తరవాత, ఆ గొర్రె పొగరుని  వాడి నాన్న అణచడం జరుగుర్తుంది. ఈ నేపధ్యం లో, ఓ చిన్ని కొమ్ముల గొర్రె పిల్ల ని  అజీజ్ మచ్చిక చేసుకుంటాడు. దానిని విపరీతంగా గారాం చేస్తాడు, తండ్రి వారిస్తున్నా వినకుండా.. ఆ గొర్రె పిల్ల పెద్దదై బాగా బలిష్టం గా తయారై, అన్ని గొర్రెల తో పోట్లాడుతూ వుంటుంది.
ఓ సారి సుల్తాన్ అనే తన మిత్రుడి దగ్గరకి గొర్రె తో పాటు వెళ్తాడు అజీజ్. సుల్తాన్ దగ్గరున్న ఓ ముసలి పొట్టేలు తో తన గోర్రేపిల్లని తల్పదేతట్లు చేస్తాడు. ఆ క్రమం లో ఆ కొమ్ముల గొర్రె పిల్లకి కొమ్ములు విరిగిపోతాయి. తన అపురూపమైన గొర్రె పిల్ల ని రక్త మోడుతుంటే చూసి అజీజ్ కి ఎంతో బాధ కలుగుతుంది .
అజీజ్ కి భంగ పాటు కలిగినా.. వాడి నాన్న వోదార్పుతో శాంతిస్తాడు..
ఈ కథ లో అజీజ్ పాత్రని నాకు అన్వయించుకుంటూ అందులోని ప్రతి సన్నివేశాన్ని ఆస్వాదించే వాడిని. ఆ కథ కి గీసిన చిత్రాలు కూడా ఓ ప్రత్యేకమైన శైలి లో ఉంటాయి.  ఈ పుస్తకం ఇప్పటికీ నాకు అపురూపమే..
Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

4 Responses to ఈ పుస్తకం ఎంతో అపురూపం

  1. The books published by erstwhile soviet union Republic of Rassia are very cheaper in price. subscription4three years was 20/ but those books are very attractiv &worthful.

  2. krishnamohna says:

    madhura smruthulu aa books. my childhood twisted with that books.
    please scaned copy unte pampandi
    meku runapadi untanu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s