పాతబడే కొద్ది పచ్చబడే జ్ఞాపకం- కాణిపాకం

కాణి పాకం అంటే ఈ రోజు అందరికి తెలిసిన పుణ్య క్షేత్రం..స్వతస్సిద్ధంగా ఉద్భవించిన వినాయకుడి ఆలయం ఉన్న వూరు.  తిరుమల లో దర్శనం అయ్యాక , తిరుగు ప్రయాణానికి ముందు మిగిలిన టైం లో చూసి వచ్చే పుణ్య క్షేత్రం.. ఈ  మధ్య రెండు , మూడు సార్లు వెళ్ళాను ఈ గుడి కి. నేను ముప్పై సంవత్సరాల ముందు, మా వూరి నుండి, నా క్లాస్స్మేట్ నందాతో సైకిల్ పై వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళే పుణ్య క్షేత్రం ఇదేనా అని ఆశ్చర్య పోయాను. కాణిపాకం చుట్టూ పక్కల ఉన్న ప్రజలు  ఎన్నో తరాలుగా పవిత్రంగా భావిందే  గుడి ఇది.  రెండు వర్గాలు గాని, వ్యక్తుల మధ్య కానీ ఏదైనా తగవు వచ్చినపుడు, ఇరు పార్టీలు ఇక్కడికొచ్చి ప్రమాణం చేస్తే తప్పు చేసిన వారికి శిక్ష పడుతుంది అని ఓ గట్టి నమ్మకం. ఆ నమ్మకం ఇప్పటికీ అక్కడి ప్రజలలో బలంగా ఉంది. ..

అప్పట్లో, గుడిలో మామూలు రోజుల్లో ఏ మాత్రం రద్దీ ఉండేది కాదు. కోనేరు లో కాళ్ళు కడుక్కొని, నేరుగ వెళ్లి స్వామి దర్శనం చేసుకుని, బయటకు వచ్చాక, నా కళ్ళు అప్రయత్నం గ ప్రసాదం కౌంటర్ వైపు మళ్ళేవి. ఎందుకంటే, నాకిష్టమైన పులిహోర దొరికేది అక్కడే కాబట్టి. ఓ సారి నేను, నందా  వెళ్ళే సరికి కాస్త ఆలస్యమైంది. ఎందుకైనా మంచిదని, ప్రసాదం ముందే తీసుకుందామని వాడి తో అన్నాను. కాని తను, “తప్పు రా. దర్శనం అయ్యాక తీసుకుందాం” అన్నాడు. అలాగే దర్శనం చేసుకుని వచ్చి ,  ప్రసాదం కౌంటర్ దగ్గరకేళ్ళేసరికి , “ఇప్పుడే పులిహోర ఐపోయింది” అన్నారు. అంతే… ఆ క్షణం లో నా కంటికి శక్తి ఉండి వుంటే.. నా చూపులకు నందా   మసై పోయి ఉండేవాడు.  దారి పొడవునా, సైకిల్  తొక్కుతూ వాడిని తిడుతూనే ఉన్నాను పులిహోర దొరకనందుకు. ఇది జరిగిన కొద్ది రోజుల తరవాత,  ఓ రోజు నంద నన్ను “ఈ రోజు మా ఇంటికి నువ్వు అర్జెంటు గ రావాల్రా” అని తీసుకెళ్ళాడు. ఏంటా అని వెళ్ళాను. వాళ్ళ మమ్మీ , ” రా బాబు.. భోంచేద్దూ  గాని”  అన్నారు. కూర్చున్నాక , నా ప్లేట్ లో ఘుమ ఘుమ లాడే పులిహోర..  నంద నా వైపు నవ్వుతూ చూస్తున్నాడు. అంతే… వాడి ఆప్యాయత కి కరిగి పోయాను. కాణిపాకం గుర్తొస్తే… టౌన్ నుండి అద్దె సైకిల్ మీద ఆ గుడి వెళ్ళేపుడు వచ్చే ప్రతి మలుపు.. ప్రతి landmark నా స్మృతి పథం లో మెదులుతూ ఉంటుంది. ఈ జ్ఞాపకాలు పాతబడే కొద్ది పచ్చబడుతున్నాయి


Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

3 Responses to పాతబడే కొద్ది పచ్చబడే జ్ఞాపకం- కాణిపాకం

 1. తెలుగు అభిమాని says:

  చాలా బాగుంది.

 2. I visited kanipakam 1st time during1980.when we are in 10th class with kondanna master&10th class tution mates .During that time i tried click photos with click3 camera.but almost all photos are taken as sagarasangam photo grapher. I enjoyed this trip a lot.

 3. D S KRISHNAN says:

  nenu kuda eetivalane knipakam poyi vachhanu . mana pramanala kanipakamena idi
  anipinchinidi.populaton,disposable income perginataruavata ekkadiki poyina janame janam, kaakhilu, thopullu kanipakamlo kuda chhoosina taruvata krithrima vatavaranam
  nenu prasantata pondalekha poyanu bahusa naa weakness emo a momentlo

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s