మనసుని కదిలించే పాట

దుఃఖం – మనిషి జీవన యానం తో ముడి పడిన విడదీయలేని ఉత్కృష్టమైన emotion . మిగతా అన్నిemotions లోను కల్తీ, నటన, కృత్రిమత్వం ఉండొచ్చేమో కాని, చెమర్చిన కళ్ళలో ఉబికే కన్నీరు అత్యంత స్వచ్చమైనది. ప్రతి ఒక్కరూ, ఏదో ఒక సందర్భం లో ఈ ఫీలింగ్ ని అనుభవించాల్సిందే. ఆ సంఘర్ష ణ ని పొందాల్సిందే.    “అఘాతమగు జలనిధి లోనే ఆణి ముత్యమున్నటులే,  శోకాల మడుగున దాగి సుఖమున్నదిలే’ అని శ్రీ శ్రీ గారన్నారు. ఎంత నిజం..?


 

ఇలాంటి emotion   ని ఎంతో చక్కగా మాటల మాలిక లో అల్లిన పాట..మనసు కవి ఆచార్య ఆత్రేయ రాసినది …. “అంతు లేని కథ” లో ఉంది. ఆ పాటలోని సాహిత్యం  దుఃఖమనే ఫీలింగ్ కి సజీవ రూపం కల్పిస్తుంది. ఎస్. జానకి పాడారీ పాటని.

 

పాట పల్లవి

“కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు
రాళ్ళలో ఉన్న నీరు కళ్ళ కెలా  తెలుసు…
నాలో ఉన్న మనసు నాకు కాక ఇంకెవరికి తెలుసు..”

ఇందులోని మొదటి చరణం నాకు బాగా నచ్చినది.

“తానే మంటై వెలుగిచ్చు దీపం చెప్పదు తనలో చెలరేగు తాపం
నే వెళ్ళు దారి ఓ ముళ్ళ దారి…
రాలేరు ఎవరు నాతో చేరి..”

Advertisements
This entry was posted in పాటలు, సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

One Response to మనసుని కదిలించే పాట

  1. D S KRISHNAN says:

    ee pata introvertsku, mariyu manalni apaartham chesukonnappudu manchi feel mariu relief istundi

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s