చందమామ కథలు – విభిన్న కోణాలు

చందమామ కథల్ని కేవలం వినోదం కోసం, పిల్లల కోసం రాసిన కథలుగా చూడలేం. ప్రతి కథలోనూ ఎన్నో కనిపించని కోణాలు, సింహావలోకనం చేసుకునే కొద్ది గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యం గ బేతాళ కథలు , ఓ చక్కని case study ఇచ్చి , బేతాళుడి ద్వార ప్రశ్నలడిగించడం తద్వారా, ఓ పాఠకుడిగా మనకు కూడా ఆ ప్రశ్నలకు ఏం సమాధానం ఉంటుందో  ఊహించటానికి స్కోప్ కల్పిస్తారు. విక్రమార్కుడి ద్వారా జవాబు చెప్పించడంతో , ఆ కథ విశ్లేషణ పూర్తవుతుంది. ప్రస్తుతం ఎన్నో management క్లాస్సుల్లో ఈ పద్ధతిని ఎంతో మంది అవలంబిస్తున్నారు. ముందు ఓ case study ని విద్యార్థులను అధ్యయనం చేయమని, తరవాతి క్లాసు లో విశ్లేషించమని అడుగుతుంటారు. చందమామ కథల్లో ఇలాంటి పద్ధతి మనం చిన్నప్పుడే చూసామని ఎవరికీ తెలియదేమో..?

చందమామ లో ఇంకో రకం కథలు.. ఇంద్రజాల కథలు.. వీటిల్లో ఎన్నో కిటుకులు… సైన్సు కి సంబంధిచిన విషయాలు ఆసక్తికరమైన కథల రూపంలో మిళితం చేసి ఏ. సి. సర్కార్ అందించే వారు. నాకు గుర్తున్న ఓ కిటుకు.. గుడ్డు ని వినేగార్ లో వేస్తే కరిగి మైనం లాగా flexible అవుతుంది అని తెలియచెప్పే కిటుకు ఓ మేజిక్ కథ లోనిదే.

పత్రిక చివర లో ఉండే పురాణ కథలు… వీర హనుమాన్, మహా భారతం, రామాయణం లాంటి కథల ద్వార మనం మన ఇతిహాసాల్ని సరళమైన భాష లో అర్థం చేసుకోటానికి ఉపయోగపడేవి. మన cultural heritage ని మరిచిపోకుండా ఈ కథలు దోహద పడేవి.

నాకు అత్యంత ప్రీతీ పాత్రమైనవి సింగిల్ పేజీ కథలు.. ఇవి ఓ రెండు నిమిషాల్లో సరదాగా చదివేయోచ్చు. వీటిల్లో అన్ని రకాల వర్గాలు ఉండేవి… చమత్కారం, నీతి, management లాంటి సీరియస్ విషయాలను కూడా.. నొప్పి తెలియని సూది ప్లస్  తీపి మందు లాగా చిన్న పిల్లల్లోకి చొప్పించే ఆ ప్రక్రియ చూస్తే.. ఇప్పుడు తెలుస్తోంది… చందమామ కథలలో ఎంతటి మహత్తు ఉందో… ఆ కథల ప్రభావం ఎంతటిదో.. ఎన్నో తరాలను ఓ బాలల పత్రిక ప్రభావితం చేయగలిగింది అంటే.. ఎంతో ఆశ్చర్యం కలుగక మానదు. ఎన్నో సందర్భాలలో నేను చెప్పాల్సిన విషయాన్ని విశదీకరించాల్సినప్పుడు , ఈ కథల సహకారాన్ని తీసుకుంటుంటాను .

ఇక మనందరికీ నచ్చేది fantasy.. ఓ ఊహ లోకంలో విహరించాలి అన్న కోరికను నిజం చేసే సీరియల్ కథలు … “విచిత్ర కవలలు” లాంటి కథలు.. వీటిని రచించే వారు.. దాసరి సుబ్రహ్మణ్యం గారని… వారు సామాన్యమైన జీవితాన్ని గడిపేవారని ఈ బ్లాగ్ లోకం లోకి అడుగు పెట్టాక కానీ తెలియలేదు.. వారి ఊహా పుత్రికలయిన ఈ కథలు.. సీరియల్గా వచ్చేపుడు… వచ్చే నెల సంచిక ఎప్పుడు వస్తుందా అని ఉత్కంటత తో వేచి చూసేట్లు చేసేవి..

ఇలా ఎన్నో కోణాలు.. ఎన్నో విశేషాలు.. చందమామ బాలల పత్రిక కాదు.. ఎన్నో తరాలకు తరగని సిరి సంపద అనే చెప్పాలి..ఆ కథలకు నిజంగా హ్యాట్సాఫ్.

Advertisements
This entry was posted in కథలు. Bookmark the permalink.

3 Responses to చందమామ కథలు – విభిన్న కోణాలు

 1. SIVARAMAPRASAD KAPPAGANTU says:

  చందమామ జ్ఞాపకాలు బాగున్నాయి కాని, విచిత్ర సోదరులు ధారావాహిక చందమామలో రాలేదు. విచిత్ర కవలలు అనే ధారావాహిక వచ్చింది. కాని ఆ కథ దాసరి గారు వ్రాయలేదు.

  దాసరి సుబ్రహ్మణ్యం గారు వ్రాసిన అద్భుత జానపద ధారావాహికలు
  1 తోక చుక్క
  2 మకరదేవత
  3 కంచుకోట
  4 ముగ్గురు మాంత్రికులు
  5 జ్వాలాద్వీపం
  6 రాకాసి లోయ
  7 పాతాళ దుర్గం
  8 శిధిలాలయం
  9 రాతి రథం
  10 యక్ష పర్వతం
  11 మాయా సరోవరం
  12 భల్లూక మాంత్రికుడు

  పై ధారావాహికలలో మొదటి పదకొండిటికి చిత్రాగారు బొమ్మలు వేసారు.

  ఈ ధారావాహికలు ఇతర చందమామ కథల గురించి మరింత సమాచారం ఈ కింది లింకు సహాయంతో పొందవచ్చు.

  http://manateluguchandamama.blogspot.com

  • mhsgreamspet says:

   @ శివరామప్రసాద్ గారు
   సమాచార లోపానికి క్షంతవ్యుడిని. మీరు ఇచ్చిన విలువైన సమాచారానికి ధన్యవాదాలండి.
   రామకృష్ణ

 2. Ramakrishna.All stories in chanmama cultivates moral & human values in children from childhood .which is lacking now a days.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s