ఎద లోతులో… ఏ మూలనో…

పద్మశ్రీ బుక్ స్టాల్ – వింటూనే ఎద లోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు మిమ్మల్ని ముసురుకుంటున్నాయా…? మనం చదివే రోజుల్లో అందరికి సుపరిచితమైన పేరు.. ప్రతి జూన్ నెల లోను ఇక్కడికి వెళ్ళందే మనం స్కూలు కి వెళ్ళలేము. ఎందుకంటే  మన అన్ని టెక్స్ట్చి బుక్స్త్తూ, నోట్ పుస్తకాలు ఇక్కడే కొనే వాళ్ళం. అప్పట్లో చిత్తూర్ కి తలమానికమైన పుస్తక భాండాగారం ఈ పద్మశ్రీ బుక్ స్టాల్. మన టెక్స్ట్ బుక్స్ తో పాటు… పంచాంగం, పెద్ద బాల శిక్ష, చిన్నయ సూరి వ్యాకరణం, నిఘంటువులు లాంటి ఎన్నో ఉపయుక్తకరమైన పుస్తకాలు, ఎన్నో ఇక్కడ దొరికేవి. వీటన్నింటి తో పాటు, నాకిష్టమైన రష్యన్ తెలుగు పుస్తకాలు   కూడా ఇక్కడ దొరికేవి. ప్రతి పుస్తకం మీద పద్మశ్రీ ముద్ర ఉండేది. ఆ సీల్ ని ఓ సారి చూడాలని ఉంది కదూ.. అందుకే నా దగ్గర ఇంకా నిక్షిప్తమైన ఓ రష్యన్ పుస్తకం ” చిట్టి జంతువులు” కవర్ పేజీ పైన ఈ రోజుకీ భాసిల్లుతున్న ఆ బుక్ స్టాల్ సీల్ ని చూడండి.. మళ్ళీ నాటి రోజుల్లోకి ఓ సారి వెళ్ళిపోండి.


ఈ షాపు అప్పటి బస్సు స్టాండ్ వెనక మద్రాస్ ఫోటో స్టూడియో పక్కన ఉండేది. కిటికీలు పచ్చటి రంగుతో ఉండేవి. కొంచం elevated floor  పైన ఉండేదీ షాపు. ఎప్పుడు రద్దీ గా ఉండేదీ అంగడి.

కొన్ని తెలుగు నవలలు కూడా దొరికేవి. అప్పట్లో ఆంధ్ర భూమి లో “తులసి దళం” సీరియల్ గా వచ్చేది. చాల అబ్బురం గ చదివే వాడిని. ఓ సారి పద్మశ్రీ లో ఈ నవలని పుస్తక రూపం లో చూసాను. నాన్న దేనికనో ఇచ్చిన ఇరవై (అనుకుంటా..) రూపాయలు పెట్టి ఆ నవల ని కొనుక్కోచ్చేసాను. అంత డబ్బు పోసి ఎందుకు తెచ్చావు అని  నాన్న వేసిన  అక్షింతలు ఇప్పటికీ గుర్తే.

ప్రస్తుతం ఈ షాపు లేదు.. అటు వెళ్తుంటే ఆ నాటి షాపు … ఆ షాపు ముందు ఉండే హడావిడి అంతా ఇప్పటికీ  కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది
Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

2 Responses to ఎద లోతులో… ఏ మూలనో…

  1. D S KRISHNAN says:

    avunu padma ante naaku istame green kitiki lopala anthati pusthaka bhandagarama anipimchedi . Kannan college physics lecturer appadappudu akkada kanipiste ado loga anipimchedi , naaku green kitiki ramakrishna anagane naa okka sariga ollu gagurpodichindi. eesitelo comments posting naaku dadapu alavataipoyindi.

  2. Then Physics lecturer Prasad in an adopted son of propriter of padmasree& co.,so he used2be presant there.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s