“మా పసలపూడి కథలు”- ఈ కథలలో ఏదో మహత్తు ఉంది!!

పుస్తక పఠనం చాలా కాలం తరవాత ప్రారంభించాను…  అలా చేయల్సోచ్చిన పుస్తకం వంశీ గారి “మా పసలపూడి కథలు” లోని మహత్తు అలాంటిది మరి! వంశీ గారంటే ఎప్పటినుండో ఓ ప్రత్యేక అభిమానం… తన  మంచు పల్లకి సినిమా నుండి నిన్నటి “సరదాగా కాసేపు” వరకు తనని ఫాలో అవుతూనే వున్నాను. ముఖ్యంగా , కళాతపస్వి విశ్వనాధ్  గారి శంకరాభరణం విడుదల ఐన రోజుల్లో , ఆ చిత్రం రూపొందించిన విధానం గురించి అప్పట్లో వంశీ గారి కలం నుండి వెలువడిన ఓ పుస్తకం నేను చదివాను. అప్పటినుండి అతని కథలలో కనిపించే రచనా  శైలి, చిత్రాలలో అందించే కోనసీమ మార్కు హాస్యాన్ని ఆస్వాదించటం మొదలయింది.  స్వాతిలో అడపా దడపా చదివిన కథలు మినహాయించి, చదువు, బాధ్యతల భారం లో కొంత కాలంగా కథా పఠనం దూరమయింది.


మన క్లాస్మేట్  స్వర్ణ దగ్గర ఈ పుస్తకం కనపడేసరికి… నా లోని పాఠకుడు ఒక్క సారి వొళ్ళు విరుచుకున్నాడు.. తనని రిక్వెస్ట్ చేసి , మళ్లీ ఇస్తానని (ఎందుకంటే సాక్షాత్ వంశీ గారి నుండి తను ఆ పుస్తకం అందుకుంది మరి.. ) చెప్పి తీసుకొచ్చి… ఇదిగో ఈ రోజే చదవటం మొదలెట్టాను.


కథలన్నీ పసలపూడి చుట్టూ అల్లుకున్నవి… వివిధ కాలాల్లో అప్పటి స్థితి గతులను ప్రతిబింబిస్తూ రాసినవి. గోదావరి అందాలూ వినటమే కాని, అక్కడి నైసర్గిక స్వరూపం అంతగా పరిచయం లేకపోయినా.. ఆ వూరి పేర్లు.. అందులోని పాత్రల పేర్లు పూర్తి తెలుగుతనాన్ని ప్రతిబింబిస్తుంటే.. ఆ నేపధ్యం లో విభిన్న పాత్రల మధ్య అల్లిన మానవీయ బంధాలు చదువుతుంటే.. … తొలకరి చినుకులకు తడిసిన నేల వాసనని ఆఘ్రాణి౦చినట్లు  వుంది.    కథల ఫార్మాట్ కూడా 5-6 పేజీలకు మించకుండా..  ఆద్యంతం పఠనాసక్తిని sustain  చేసే విధం గా చక్కగా వుంది. ఇప్పటికి చదివిన మొదటి నాలుగు కథలలో నేను ఫీల్ అయ్యిన కథ.. “రామభద్రం చాలా మంచోడు” .. అందులో రామభద్రం వయసు మీద పడుతున్నా, ఏ ఈడు వారితో  ఆ ఈడు వారి లాగ, ఏ మనస్తత్వం వారితో వారికి తగినట్లుగా ఉంటూ, వారి వెతలని తీరుస్తూ వారిలో మమేకమైపోయే మనిషి. తను అందరికి నామ మాత్రపు వడ్డీతో ఏ పత్రాలు లేకుండా కేవలం నమ్మకం తో ఆర్ధిక సహాయం చేసే మనిషి. తను చనిపోయాక, తన ద్వారా సహాయం పొందిన వారందరూ.. అతని అబ్బాయికి బాకీ తీర్చటం… ప్రస్తుత కాలం లో వాస్తవికతకు దగ్గర కాకున్నా.. ఒక మంచి మనిషి తన చుట్టూ వున్న మనుషులలో కూడా తన చేతలతో మంచితనాన్ని ఎలా పెంపొందించ గలడో  చెప్పే కథ..


వంశీ గారి కథలలో వర్ణన కి పెద్ద పీట వేస్తారు.  తన వర్ణనలతో, మనల్ని ఆ ప్రదేశాలకు తీసుకెల్తారు.. ఆ పాత్రలు  కూడా మనం రోజూ కలిసే వ్యక్తుల లాగ అగుపించడం, మనం వాళ్ళలో ఒకరి గా అనిపించడం వుంటుంది. కథలలో చివరగా సున్నితమైన చిన్న  మెలిక పెట్టటం (“వాళ్ళ బంధం”, “రామభద్రం…”  కథలలో ముఖ్య పాత్ర మరణం, “కోరి రావులు గారి బస్ కండక్టర్ ” లో అందరికి  సాయ పడే భద్రం చివర్లో కనిపించకుండా పోవటం..) తో, హృదయాన్ని  ఎక్కడో సుతి మెత్తగా ఓ ఆవేదనా తరంగం స్పృశిస్తుంది…


బాపు బొమ్మలతో, రమణ గారి వ్యాఖ్యానాలతో.. ఈ పుస్తకం ఇక కొద్ది రోజులు నాకు మీ లాంటి నేస్తమే..  ఈ నేస్తం నాతో పంచుకునే ఇంకొన్ని పసలపూడి కథలను మన “గిరిమ్పేట వెతల ” ద్వారా మీతో పంచుకుంటూ వుంటాను..

This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

2 Responses to “మా పసలపూడి కథలు”- ఈ కథలలో ఏదో మహత్తు ఉంది!!

  1. SIVARAMAPRASAD KAPPAGANTU says:

    బాపు బొమ్మలు ఈ పుస్తకానికి ఒక ప్రత్యెక ఆకర్షణ, నిడుతనాన్ని ఇచ్చినాయి.

  2. sanjeev says:

    పసలపూడి కథల్లో నాకు బాగా నచ్చేది nativity , కథల్లో అంశం మనం రోజు మనుష్యులలో చూసేవే కాని సరిగ్గా గమనించనివి , నిజంగానే వాటిల్లో ఏదో మహత్తు ఉంది…మా టీవీ లో అనుకుంటా ఇప్పుడు అవి సీరియల్ గా వస్తున్నాయ్..

    BTW nice post 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s