హైవే పై ఓ రోజు…

హైవే పై వాహనాలు మితిమీరిన వేగంతో దూసుకేళ్తున్నాయి. ఇంతలో  పొందికగా ట్రాఫిక్ రూల్స్ ని పాటిస్తూ ఆ హైవే  పై వస్తోందో కారు. ట్రాఫిక్ పొలిసులు  ఆ బండిని ఆపి, అభినందన పూర్వకంగా చూసారు. అందులోని డ్రైవర్ ని చూస్తూ, ” సార్, ట్రాఫిక్ వారోత్సవాల్లో భాగంగా, ట్రాఫిక్ రూల్స్ ని పాటించే డ్రైవర్స్ ని ఈ రోజు సత్కరిస్తున్నాము. అందులో మీరు నూరవ వ్యక్తి.. మీరు మా డిపార్టుమెంటు తరపున పది వేలు బహుమతి గా పొందారు. కాష్ తీసుకోండి “ అంటూ డబ్బును అందించారు. ” బై ది బై , ఈ డబ్బును ఎలా ఖర్చు చేస్తారు సార్” అని నవ్వుతూ అడిగాడో పోలీసు.

“ఏముంది.. ఇంత వరకూ లైసెన్సు తీసుకోలేదు.. ఈ డబ్బుని లంచం గా ఇచ్చి నా లైసెన్సు తెచ్చుకుంటాను” అన్నాడా డ్రైవర్ యధాలాపంగా .

“సార్… వీడి మాటల్ని నమ్మకండి. తాగితే వీడు చెప్పేవన్నీ అబద్ధాలే.. “ అన్నాడు పక్కన కూర్చున్న వ్యక్తి.

“ఒరే వెధవల్లారా.. మీరు ఇలాగే ఇంకాసేపు మాటలాడుతూ వుంటే… మనం బండి కొట్టుకేళ్తున్నామని అనుమానం వచ్చేస్తుంది. అసలే పోలీసులు.. త్వరగా బండి కదల్చండి” అరిచాడు.. వెనక కూర్చున్న ఇంకో వ్యక్తి.

ఇంతలో కారు డిక్కీ లో ధడేల్.. ధడేల్ మనే శబ్దాలు రావటం మొదలయ్యాయి.
“ఒరేయ్.. ఏంటి బండి ఆగింది.. ఈ చందనపు చెక్కలతో… ఊపిరి ఆడటం లేదు… మనం స్టేట్ బోర్డర్ దాటేశామా.. చెప్పండి..” అంటూ లోపలనుండి ఓ అరుపు వినపడింది.

(ఓ మిత్రుడు చెప్పిన కథ ఆధారంగా…)

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

5 Responses to హైవే పై ఓ రోజు…

  1. none says:

    LOL superb

  2. Manasa says:

    🙂 🙂

  3. Iam here2save them4m the cluches of the police.so inform them about me.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s