బాపట్ల లో కనుమరుగైన నాటి ఆనవాళ్ళు కొన్ని

బాపట్ల … ఈ పేరు వింటేనే ఆ వూరితో బంధం ఉన్న వాళ్లకి గుర్తొచ్చేవి గడియార స్థంభం, భావనారాయణ   స్వామి గుడి, బాదం పాలు, బల్ల రిక్షాలు, చంద్ర కళ పార్కు, సూర్యలంక బీచు..

ఈ మధ్య నేను ఆ వూరు వెళ్లి, టైం స్కేల్ పై  ఓ పాతిక సంవత్సరాలు వెనక్కి వెళ్ళాను.  వూరి చరిత్రలో భాగమైన గడియార స్థంభం ప్రస్తుతం లేదు.. అ స్థంభం దగ్గర ఎన్నో సార్లు రాత్రుళ్ళు పది గంటల టైం లో కలాకండ్, పకోడా తినటానికి వచ్చేవాళ్ళం. ముఖ్యం గా పరీక్షల సమయం లో ఇక్కడికి మా మిత్ర బృందం అందరు రావటం పరిపాటి.. అలాగే , పక్కనే ఉన్న షాపు లో బాదం పాలు తాగటం ఎప్పుడు మరవము. ఈ స్థంభం మా వాళ్ళకు ఎన్నో అనుభూతుల మూగ సాక్ష్యం. ఇప్పుడు అది కనపడక పోయే సరికి, ఏదో imperfect picture చూస్తున్న భావన కలిగింది.

అప్పట్లో, బయట చిరుతిళ్ళు అంటే.. మిర్చి బజ్జి (మధ్యలో సన్నటి గీటు పెట్టి, అందులో ఉల్లి, నిమ్మరసం తో స్టఫ్ చేసే వాళ్ళు) లాంటివి  ఉండేవి.. కాని ఇప్పుడు ఎక్కడ చూసినా.. పానీ పూరి, భెల్ పూరి తోపుడు బళ్ల సాంప్రదాయం వచ్చేసింది.

నాటి జ్ఞాపకాలకు కొన్ని వూపిరులూదిన బళ్ల రిక్షాలు ఇప్పటికి వాడుక లో వుండటం కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. ఈ బళ్ల మీద కూర్చుని, ఓపెన్ ఎయిర్ ని ఆస్వాదిస్తూ చుట్టూ  పరిసరాలను చూస్తూ వెళ్ళే నటి రోజులు ఓ సారి కంటి ముందు ప్రత్యక్ష మయ్యాయి. ఇలాంటి బళ్ళు ఈ మధ్య కాలం లో ఇంకెక్కడా చూడలేదు.

పద్దెనిమిదో శతాబ్దం  లో కట్టిన ఆంజనేయుని గుడి, ఇంకా పాతదైన భావనారాయణ స్వామి గుడి వెళ్తే, అప్పటి జ్ఞాపకాలు వొక్క  సారి ముప్పిరిగొన్నాయి.

రైల్వే స్టేషన్ దగ్గరున్న చంద్రకళ  పార్కు , గ్రంథాలయం ఇప్పటికీ  అలాగే వుంది.

ఆ జ్ఞాపకాల వీధులలో కాసేపు విహరిన్చేసరికి… ” ఏవీ నాడు కురిసిన హిమ సమూహములు…” అంటూ మనసు నిట్టూర్చేసింది.

Advertisements
This entry was posted in నాడు-నేడు. Bookmark the permalink.

7 Responses to బాపట్ల లో కనుమరుగైన నాటి ఆనవాళ్ళు కొన్ని

 1. పాత జ్ఞాపకాలు తట్టి లేపారండి. నేను బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ లో చదువుకున్నాను..ఆ ఓపెన్ రిక్షాలు భలే ఉండేవి. మేము ప్రతి ఆదివారం హాస్టల్ నుంచి clock tower కి ఏదో పనో కల్పిచుకుని వచ్చేవల్లము.

 2. గడియార స్థంభం లేదా? ఎందుకు తీసేశారు? గుండెలవిసిపోయే సమాచారం! వచ్చే నెల బాపట్ల వెల్ల పోతున్నాను .
  పుట్టిన దగ్గరనుంచి చూస్తున్న బాపట్ల స్మృతి చిహ్నం లేదంటే ఊహించుకోవటమే బాధ గ ఉంది!

 3. గడియార స్థంభం తీసేసారా.. బాపట్ల వెళ్లి చాలా రోజులయ్యింది..ఎవరూ అనను కూడా అనలేదే!
  బాపట్ల అంటే గడియార స్థంభం…గడియార స్థంభం అంటే బాపట్ల..అలాంటిది ఇప్పుడు అది లేదంటే ఏంటో వినటానికే బాగోలేదు.

 4. lakshmana says:

  I am from bapatla. Yes bapatla clock tower is recently removed. New flyover is constructing at market railway gate for to get rid of railway gate distrubance to other side people. This is one of the big project at bapatla. Becuase of that all sharaf(gold shops) road and gold shops are removed.

 5. induram says:

  బాపట్ల కు ప్రాణప్రదమైనవి భావనారాయాణస్వామి గుడి, గడియార స్తంభం, ఆంజనేయస్వామి గుడి మరియు సముద్రతీరం. ఇప్పుడు గడియార స్తంభం లేకపోవటం చాలా బాధగా వుంది. రోడ్ల విస్తరణ అయినాక మరల గడియార స్తంభం పునర్నిర్మించి బాపట్ల అభిమానులకు ఆనండాన్ని కలుగచేయవలసినఢిగా కోరుచున్నాను.

 6. బాపట్ల లోచదువుకున్నాను..ఆ ఓపెన్ రిక్షాలు భలే ఉండేవి. మేము ప్రతి ఆదివారం హాస్టల్ నుంచి clock tower కి ఏదో పనో కల్పిచుకుని వచ్చేవల్లము.ఇప్పుడు గడియార స్తంభం లేకపోవటం చాలా బాధగా వుంది

 7. అవును. వివాహిత మంగళ సూత్రం లేకుండా ఒక్క క్షణం కుడా ఉండలేనట్టే, బాపట్ల పట్టణం లో గడియార స్థంభం లేక పోవడం కూడా ఒక్క క్షణం కుడా ఊహిన్చలెము. గడియార స్తంభం అర్ధరహితం గా మానవులచే నిర్దాక్షిణ్యం గా కూల్చబదితే, ప్రకృతి సిద్ధం గా భావనారాయణ స్వామి వారి గోపురం కూలిపోవడం దురదృష్టకరం.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s