ఎనిమీ కొట్టు విధంబెట్టిదనిన..

మన  గిరిమ్పేట మునిసిపల్ హై స్కూల్ కి పేటెంట్ పొందదగ్గ ఓ సంప్రదాయం వుంది. ఎందుకంటే… ఈ సంప్రదాయం నేను వేరే ఏ స్కూల్ లోనూ చూడలేదు. ఆ సంప్రదాయమే.. ఎనిమీ కొట్టడం..స్కూల్ అన్నాక కూసింత గొడవలు ఉండటం సహజం కనుక.. అప్పట్లో.. మనకు ఎవరు నచ్చక పోయినా… వెంటనే వారికి “ఎనిమీ” చెప్పేసే వాళ్ళం. అంటే… ఆ క్షణం నుంచి అతనితో మనం శత్రుత్వం తో ఉంటామన్న మాట. ఎనిమీ కొట్టినపుడు (వాక్య దోషం కాదు. ఎనిమీ కొట్టడం అనే అనేవాళ్ళం) కొన్ని రూల్స్ ఉంటాయి.. అవేమంటే…

  • ఎనిమీ తో పొరపాటున కూడా మాట్లాడకూడదు… పక్కన కూర్చో కూడదు.
  • ఎనిమీ పేరు పొరపాటున కూడా ఉచ్చరించ కూడదు.
  • శత్రుత్వం ముగించాలంటే… ఒకరి పేరు ఒకరు చెప్పుకోవాలి. ఎవరు ముందు పేరు చెప్పాలి అనే విషయం పై చాల సార్లు కలతలు మళ్లీ చెలరేగి ఎన్నో సార్లు ఎనిమీ అనే డెడ్ లాక్ అంతం కాని సందర్భాలు కోకొల్లలు

ఇలా మన  వాళ్ళల్లో చాల నిష్ఠ గా ఈ ఆచారాన్ని పాటించే వాళ్ళు. ఈ ఆచారం నియమ నిష్ఠ ల తో పాటించే వాళ్ళల్లో ఆద్యుడు మన లవ కుమార్. నేను ఎవరితో ఎనిమీ కొట్టిన, మరిచిపోయి మాట్లాడేసే వాడిని. కాని లవ మాత్రం తు. చ. ఈ ఆచారాన్ని పాటించేవాడు. ఓ సారి తను నాతో ఎనిమీ కొట్టిన సందర్భం. అదే సమయం లో ఓ సారి, ఓ క్లాసు లో తను లిటరరీ activity లో నన్ను స్పీకెర్ గా ఆహ్వానించాల్సి  వచ్చింది. పైన ఉదాహరించిన రూల్ : 2  ప్రకారం నా పేరు చెప్పకూడదు… ఎలా.. ఎలా…దానికో ఉపాయం ఆలోచించాడు లవ. ఆ రోజు ఉదయమే మధ్యవర్తి ద్వార.. శత్రుత్వం ముగించాలని అనుకుంటున్నట్లు కబురు పంపించాడు. ఇద్దరు ఒకరి పేరు ఒకరు చెప్పాక.. క్లాసు లో నన్ను నా పేరు తో సంభోదిస్తూ ఆహ్వానించాడు. క్లాసు అయ్యాక.. మళ్లీ ఎనిమీ కొట్టాడు లవ. ఇలా ఉండేవి మా ఎనిమీ గొడవలు.
అబ్బాయిలు, అమ్మాయిలూ  అనే తారతమ్యం లేకుండా.. అందరూ ఈ ఎనిమీ సంప్రదాయాన్ని ఆచరించే వాళ్ళం. ప్రతి ఒక్కరు .. ఎవరి ఎనిమీలు ఎవరో.. గుర్తు పెట్టుకోడం.. దాని ప్రకారం మసలుకోవటం జరిగేది. ఎవరికీ ఎక్కువ ఎనిమీలు ఉన్నారు అన్న విషయం పై చర్చ కూడా అప్పుడప్పుడూ జరిగేది..
గమ్మత్తు గ ఉంది కదూ మన సంప్రదాయం.. మరి పేటెంట్ కి అప్లై చేద్దామా..?

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

3 Responses to ఎనిమీ కొట్టు విధంబెట్టిదనిన..

  1. SIVARAMAPRASAD KAPPAGANTU says:

    బాగున్నది ఆచారం. మా స్కూల్లో ఐతే “పచ్చి” కొట్టేసుకునే వాళ్ళం.. కుడి చేతి మొదటి-రెండో వెళ్ళు క్రాస్స్ చేసి “పచ్చా” “పండా” అని అడగటం, ఆవతలివాడి ఆ రెండు వెల్ల మధ్య తన వేలు పెట్టి వాటిని విడతీస్తూ “పచ్చీ” అని అరుస్తూ వెళ్ళిపోవటం తో వైరం మొదలు. ఆవతలి వాడిలో అప్పటికే గొడవ ఎందుకులే అనుకునే సందర్భాలు లేకపోలేదు. అప్పుడు ఆ రెండు వెళ్ళు కలిపి నొక్కి “పండు” అనటంతో ఆ వైరం మర్చిపోయి స్నేహంగా ఉండటం. ఇది మా స్కోల్లో ఆచారం, అద్భుతంగా క్రమం తప్పకుండా ఆచరించే వాళ్ళం. భలేగా గుర్తుచేశారు.

  2. The tradition of our school should be maintained by getting patent rights.so apply for it quickly.

  3. chinni says:

    ఎనిమీ పేరు పొరపాటున కూడా ఉచ్చరించ కూడదు..fine.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s