హోలీ అనగానే గుర్తొచ్చే చిత్రం

సిల్సిలా… ఆ చిత్రం కథా వస్తువు , సంగీతం, సాహిత్యం పరంగా … వీటన్నిటి కంటే ముఖ్యంగా అమితాభ్  పాడిన “రంగ్ బర్సే… భీగే చునరి వాలి రంగ్ బరసే..” అన్న హోలీ పండుగ ని ప్రతిబింబించే గీతం గుర్తొచ్చే చిత్రం.

ఈ చిత్రానికి శివ్ (పండిట్ శివ్ కుమార్ శర్మ) .. హరి (పండిట్ హరిప్రసాద్ చౌరాసియ) అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ ఇద్దరు నిష్ణాతులు సంతూర్, వేణువు ని మిళితం చేసి అందిచిన సంగీత రస గుళికలు ఈ చిత్ర గీతాలు అని చెప్పొచ్చు. చిత్రం లోని అన్ని గీతాలు నచ్చిన అరుదైన చిత్రం  ఇదేనని చెప్పవచ్చు..

ఇందులో బాగా నచ్చిన పాట “देख एक ख्वाब तो यह सिलसिले हुवे …” అన్న గీతం. ఇది  నా all time favourite గీతం అని చెప్పొచ్చు. చాల మంది ఈ పాట ముందు వచ్చే అమితాభ్ వ్యాఖ్యానం విని వుండరు.. ఆ వ్యాఖ్యానం కూడా ఈ పాటకి ఎంతో బాగుంటుంది . రంగు రంగుల పూల మధ్య అమితాభ్ , రేఖ ల పై రమణీయం గా చిత్ర్రేకరించిన ఈ పాట చిర కాలం గుర్తుండి పోయే గీతం.

తరవాత చెప్పుకోవాల్సిన పాట..“यह कहा आ गए हम यूही साथ साथ चलते ..” అన్న లతా పాడిన పాట.. మధ్య మధ్య లో అమితభ్ గళం లో వచ్చే స్వగతాలు , ఓ ప్రేమికుని వ్యధని  ప్రతిధ్వనిస్తూ వుంటుంది.

ఇవి కాక ఎక్కువ గా వినని ఇంకొన్ని  మంచి గీతాలు ఇందులో వున్నాయి..
“नीला आसमान सो गया ..’ ఈ పాట లతా, అమితాభ్ విడి విడి గా సోలో గా పాడారు. లతా పాడిన పాట వింటూ వుంటే.. అలా ఆ నీలి ఆకాశంలో తేలియాడినట్టే వుంటుంది.

‘ पहली -पहली  बार  देखा  ऐसा  जलवा  हो  ऐसा  जलवा ..”, ఇది కొంచం ఫాస్ట్ బీట్ ఉన్న లతా కిషోర్ పాడిన పాట.

‘सर  से  सरके…  सरके  चुनरिया …लाज  भरी  अंखियों  में ” – ఇది కిషోర్, లతా పాడిన ఇంకో యుగళ గీతం. ఈ రెండు పాటలు కూడా విన సొంపుగా వుంటాయి.
ఇవన్ని ఒక ఎత్తయితే… జనబాహుళ్యం పొందిన పాట మాత్రం ” రంగ్ బరసే..” అన్న హోలీ గీతమే… హోలీ పండుగ నాడు.. ఈ పాట వినిపించని చోటు (ముఖ్యంగా ఉత్తర భారతం లో) వుండదు ఈనాటికీ..
కాని హోలీ పాటలలో .. నాకు నచ్చిన పాట మాత్రం ” షోలే” లో ” होली  के  दिन दिल  खिल  जाते  हैं  रंगों  में  रंग  मिल  जाते  हैं ” అన్న కిషోర్, లతా పాటే.. ముఖ్యం గా ఈ పాట హై పిచ్ లో వెళ్తూ ఓ మూడ్ ని క్రియేట్ చేస్తుంది.. ఎందుకంటే.. తదుపరి సీన్ లో గబ్బర్ సింగ్ వచ్చే సీన్ కి ఇది ఏదో జరగబోతుందన్న ఉత్కంఠతను ఏర్పరుస్తుంది. ఈ సినిమా చూస్తే ఇప్పటికీ.. ఆ పాట వచ్చే టపుడు నెక్స్ట్ సీన్ ఎప్పుడు వస్తుందా అన్న excitement  వస్తుంది.

Advertisements
This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s