మినీ కథ

అప్పారావు పాత కాలం మనిషి.. తనో  విభాగం అధిపతి. అప్పుడప్పుడే కార్యాలయాల్లో కంప్యూటర్లు వస్తున్నాయి.. కంప్యూటర్ అంటే అది గణితం తెలిసిన వాళ్లకు, ఇంజినీర్లకు  మాత్రమే కొరుకుడు పడే యంత్రమనే అభిప్రాయం ఉన్న రోజులు అవి ..

అందర్లోనూ తను సీనియర్ కాబట్టి.. ముందు తన డిపార్టుమెంటుకే కంప్యూటర్ రావాలని అప్పారావు తన పై అధికారులతో పోట్లాడి మరీ కంప్యూటర్ని తెప్పించాడు.. పాత డొక్కు typewriter  తో తంటాలు పడుతున్న టైపిస్టు నాగరాజు కి మహాదానందమైపోయింది కంప్యూటర్ రాగానే.. తనకి కొద్దో గొప్పో.. wordperfect software వచ్చు అప్పట్లో..   ప్రతి రిపోర్ట్ ని 5-10 సార్లు  దిద్ది , దిద్దిన ప్రతి సారీ ఆ 20 పేజీల రిపోర్ట్ని ఆ typewriter పై  టైపు చేయటం ఎంత నరకమో … ఇప్పుడు ఆ నరకానికి స్వస్తి పలకవచ్చు అనే ఆలోచన మదిలో మెదిలే సరికి , నాగరాజు ఊహల్లో తేలిపోయాడు.

కంప్యూటర్ అమర్చాక.. బాస్ ఇచ్చిన రిపోర్ట్ ని కంప్యూటర్ పై టైపు చేయటానికి నాగరాజు  ఉపక్రమించబోయాడు..

“ఆగండి…” అంటూ అప్పారావు అరిచాడు.. పెళ్లి సీన్లో కట్నం ఇవ్వటం లేదని ఆలస్యంగా తెలుసుకున్న అబ్బాయి తండ్రి అడ్డుపడే టైపులో ..

ఏమిటంటూ చూసాడు నాగరాజు విస్తుపోతూ….

“ఏం లేదు… కంప్యూటర్ కొత్తది కదా.. ఎక్కువగా  వాడితే పాడై పోద్ది.. ఆ పాత typewriter పైనే టైపు చేయి” అని పురమాయించాడు. నిస్సహాయం గా నాగరాజు మళ్ళీ తన పాత మిషను ముందు ఉస్సూరుమంటూ కూర్చున్నాడు..

కష్టపడి టైపు చేసి .. ఓ రోజు తరవాత రిపోర్టు ఇచ్చాడు.. చేతి దురద ఎక్కువున్న అప్పారావు.. ఆ రిపోర్టు ని ఖండ ఖండాలుగా correction చేసి… మళ్ళీ టైపింగ్ కి ఇచ్చాడు..

ఇలా ఓ పది రోజులు… ప్రూఫుల  మీద ప్రూఫులు అయ్యాయి..

ఎట్టకేలకు.. పదవ రోజు తాను అనుకున్న విధంగా రిపోర్టు రూపుదిద్దుకుంది అని ఓ అభిప్రాయానికి వచ్చాడు అప్పారావు .. నిజం చెప్పాలంటే తరవాతి రోజే రిపోర్టు పంపటానికి చివరి రోజు కాబట్టి అలా నిర్ణయానికి వచ్చాడు కాని లేకుంటే.. ఇంకో ఐదు ప్రూఫులైనా టైపు చేయించేవాడు నాగరాజు చేత..

ఆ రోజు.. నాగరాజు ఇచ్చిన రిపోర్టు చూస్తూ ” బాగుందోయ్ నాగరాజు.. ఇందులో ఏమాత్రం తప్పులు లేవు.. ఇదే ఫైనల్ రిపోర్ట్” అన్నాడు.

“హమ్మయ్య..” అంటూ నిట్టూర్చాడు నాగరాజు… ఎందుకంటే.. పది రోజులుగా కొట్టిన రిపోర్ట్ నే  టైపు కొడుతూ.. నిద్రలో కలలో కూడా ఆ రిపోర్ట్ లోని పదాలు… వాక్యాలు వెంటాడటం మొదలయ్యింది తనకి …

వెనకకి తిరిగి తన సీట్లోకి ఆనందంగా వెళ్ళబోతున్న నాగరాజు కి బాస్ కంఠం సుతి మెత్తగా వినబడింది..

“రిపోర్ట్ లో తప్పులేమీ లేవు కదా ..  ఇప్పుడు ఈ రిపోర్ట్ ని కంప్యూటర్ లో టైపు చేయ్యవోయ్  నాగరాజు.. కంప్యూటర్ లో చేసినట్లు ఉంటుంది.. ”

(పాత్రలు కల్పితమే కానీ……)


Advertisements
This entry was posted in కథలు. Bookmark the permalink.

2 Responses to మినీ కథ

  1. anagha says:

    పాపం ….నాగరాజుగారు .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s