మైత్రి వనం లో విరిసిన మరిన్ని సుమాలు

మన బాల్య మిత్రులు మన స్కూలు రోజుల తరవాత అందరం మన వూళ్ళో కలిసి దాదాపు గా ఒకటిన్నర ఏళ్ళు అయ్యింది. సుమారు గా అరవై మంది ముప్పై ఏళ్ళ తరవాత కలిశాము ఆ రోజు. ఈ మధ్య కాలం లో ఇంకొందరు మన నెట్ వర్క్ లోకి వచ్చారు. మనతో పదవ తరగతి వరకూ చదువుకున్న సురేష్ ప్రస్తుతం నాసిక్ లో ఉద్యోగం లో ఉన్నాడు. ఈ మధ్య నే ఎన్నో ఏళ్ళ తరవాత రవికుమార్ కూడా మన బృందం లో చేరాడు. తను ఎనిమిదవ తరగతి లో మన స్కూలు వచ్చాడు. పగడ మాను వీధి లో కే. కే. ఇంటి పక్కన ఉండేవాడు. రెండు రోజులు గా మన అందరి తోను మాట్లాడుతూ, ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వున్నాడు. తను కూడా హైదరాబాద్ లో ఉండటం తో, ఇప్పుడు, హైదరాబాద్ లో మన మిత్రుల సంఖ్య ఎనిమిది కి పెరిగింది.

ప్రతి ఏడు .. మనలో బాగా బిజీ గ ఉన్నవారు, విదేశాల్లో ఉంటూ మన వూరికి వచ్చేవారికి కుదిరేటట్లుగా మన gettogether  ఏర్పాటు చేయాలనీ అందరు అనుకున్నాము. ఆ క్రమం లో భాగంగానే, గత సంవత్సరం విజయకృష్ణ ఇండియా వచ్చినపుడు జూన్ లో అందరం రెండవ సారి కలిశాం. ఈ సంవత్సరం జూన్ లో మళ్లీ కలవాలి అని ప్రస్తుతానికి అనుకున్నాము. ఈ సారి, ఎప్పుడూ సినిమా షూటింగ్ లతో బిజీ గా ఉండే స్వర్ణ కోసం గాని, యు. కే. లో ఉండే మిత్రుడు పీ. ఎస్. బాబు ఇండియా వచ్చినపుడు గాని కలవాలని అనుకుంటున్నాము. మన స్కూల్ లో కొద్ది రోజులు చదువుకున్నా, మన స్కూల్ స్మృతులను ఆనందంగా, ఆత్మీయంగా ఆస్వాదిస్తున్న మన బ్లాగు మిత్రులు కూడా వీలు చేసుకుని రావటానికి ప్రయత్నం చేసేటట్లుగా, మనం అందరం మళ్ళీ కలిసే తేది ని ప్లాన్ చేద్దాము. ఈ విషయం లో మన మిత్రులు అందరూ, సలహాలు ఇవ్వగలరని మనవి.

ఇలా కలవటం లో ఏముంది అని ఎవరైనా  విస్మయం చెంద వచ్చు. కాని మనం కలిసినప్పటి నుండి, ప్రతి ఒక్కరూ అందరి తోను తమ సంతోషాలు, దుఃఖాలు పంచుకుంటూ.. వసుధైక కుటుంబం లా వుంటున్నారు. యాంత్రిక జీవనం లో, మానవీయ విలువలు మృగ్య మౌతున్న తరుణం లో ఇలా మన వాళ్లకి ఇంత మంది నిజమైన concern చూపిస్తూ వుంటే.. ఎంతో ఓదార్పు.. ప్రోత్సాహం..  కొన్ని అనుభూతులకు వెల కట్టలేం..

Advertisements
This entry was posted in నాడు-నేడు. Bookmark the permalink.

3 Responses to మైత్రి వనం లో విరిసిన మరిన్ని సుమాలు

 1. SIVARAMAPRASAD KAPPAGANTU says:

  “…..ఆస్వాదిస్తున్న మన బ్లాగు మిత్రులు కూడా వీలు చేసుకుని రావటానికి ప్రయత్నం చేసేటట్లుగా….”

  అద్భుతమైన ఆలోచన. రాగలిగిన అదృష్టవంతులు ఎందరో కదా.. నాకు ఎలిమెంటరీ స్కూల్ స్నేహితులు అంతటితో ఆగిపొయ్యారు. అంటే వాళ్ళు హైస్కూలుకు వేరే స్కూళ్ళకు వెళ్ళిపొయ్యారు. ఆ తరువాత హైస్త్కూల్ ఫ్రెండ్స్ కాలేజీలో నాతొ కలసి ఉన్నది ఒక్కడు. కాబట్టి నా స్నేహితుల జట్టు చాలా పెద్దది. అందరినీ కలవాలంటే దాదాపుగా అందరూ విజయవాడలోనే ఉన్నారు. వీళ్ళకి తోడూ, ఉద్యోగరీత్యా స్నేహితులైన వాళ్ళు, హాం రేడియో ద్వారా స్నేహితులైన వాళ్ళు, ఇప్పుడు బ్లాగుల ద్వారా స్నేహితులు…ఇలా ఎంత మందో! కాని విజయవాడ వెళ్ళినప్పుడల్లా అందరినీ కలవటం కుదరటం లేదు. మీరు ప్లాన్ చేస్తున్నట్టుగా, మాలో కొంత మందిమి అన్నా కలిసి ప్రయత్నిస్తే, అదేదో కథలో చలం గారు వ్రాసినట్టుగా భలేగా ఉంటుంది.

 2. Dr. Vijayakrishna says:

  Ram,
  Good to know about this.
  Vijay

 3. This year also p.s.Babu4m u,k is not visiting india as he is visiting u.s along with his wife&daughter in the next month,where his brother&family is staying.Babu’s mother will visit uk in the last week of may.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s