మన వూరికి వందేళ్ళు.. మన బ్లాగుకి వంద టపాలు..

వచ్చే ఏప్రిల్ ఒకటి కి, చిత్తూర్ జిల్లా అవతరించి వందేళ్ళు అవబోతోంది. ఆ భూమి చరిత్ర లో మనమూ భాగమైనందుకు ఆనందిస్తూ.. వందేళ్ళ ఘనమైన చరిత్ర అందించిన  ఆ భూమికి శుభాభినందనలు తెలుపుదాము.. ఈ వందేళ్ళలో ఎందఱో విద్యావేత్తలు, సంస్కర్తలు, ప్రముఖులు, తెలుగు కళామ తల్లి ముద్దు బిడ్డలు, తెలుగు సాహిత్యానికి సోబగులద్దిన కవులు, రచయితలు… వారితో పాటు మనమూ ఆ చరిత్రలో భాగం అయ్యాము .. పెరిగిన నేల మట్టి వాసనా, బాల్యాన్ని పంచుకున్న మన నేస్తాల జ్ఞాపకాలు, ఏ దేశమేగినా మన నేల తల్లి పై మమకారం.. ఎన్నటికి మనల్ని వీడలేని బంధాలు..

అన్నట్లు ఇది మన బ్లాగు కి వందవ టపా.. ఇందులో మన కథలు, వెతలు, స్మృతులు గడిచిన ఎనిమిది నెలలుగా అందరితో పంచుకుంటూ వందవ మైలు రాయి దాటాము..  మన బ్లాగు కి సహకరాన్నందించిన సంకలినులు కూడలి, మాలిక, హారం, జల్లెడ, సంకలినిలకు కృతజ్ఞతలు.. వారి సహకారం తో మన ఎంతో మందికి చేరువయ్యాము. అలాగే మన గురించి చక్కటి అభిప్రాయాలని వ్యక్త పరిచిన ఇతర బ్లాగర్లందరికీ (ముఖ్యంగా చిన్ని, అనఘ, తృష్ణ, శంకర్ గార్లకు)  కూడా కృతజ్ఞతా సుమాంజలులు.

Advertisements
This entry was posted in నాడు-నేడు. Bookmark the permalink.

3 Responses to మన వూరికి వందేళ్ళు.. మన బ్లాగుకి వంద టపాలు..

 1. SHANKAR.S says:

  “వందో పోస్ట్” మైలు రాయికి చేరుకున్నందుకు అభినందనలండీ. మీ స్కూల్ పూర్వ విద్యార్ధుల స్నేహం ఇలాగే కలకాలం పదిమందికీ స్ఫూర్తినిచ్చేదిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
  మీ పోస్ట్ లో నాకూ చోటిచ్చినందుకు ధన్యవాదాలు.

 2. Dr. Vijayakrishna says:

  Ram,
  Happy 100 years to Chittoor.
  Thank you very much for organizing this website.
  Vijay

 3. Chittoor District has been formed by ertwhile British rulers by including a part of kadapadist& by excluding tiruttani&showlingoor in tamilnadu on 1st April.1911..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s