ఆ వూరి మాణిక్యాలు- కట్టమంచి రామలింగా రెడ్డి

చిత్తూర్ శత వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భం గా.. ఆ మట్టిలో ఉద్భవించిన ఒకానొక మాణిక్యం.. కీ. శే.. రామలింగా రెడ్డి గారిని ఓ సారి గుర్తు చేసుకుందాము. విద్యావేత్త, స్వాతంత్ర   సమర యోధుడు, కవి, తెలుగు భాషపై పట్టు ఉన్న దార్శనికుడు ఐన రామలింగా రెడ్డి గారు చిత్తూర్ పొలిమేరలు (షుగర్ ఫ్యాక్టరీ ఉన్న తిరుపతి రోడ్డు వైపు) లో ఉన్న కట్టమంచి లో జన్మించారు. మనకు సుపరిచితమైన పీ. సి. ఆర్. పా ఠశాల (ఇప్పుడు కళాశాల) లో చదువుకుని, తరవాత చెన్నై , యు. కే లో ఉన్నత చదువులు చదివి,  విద్యా రంగం లో తనదైన ముద్ర వేసారు. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వ్యవస్థాపక ఉపకులపతి గా, ఆ కళాశాలకు అనతి కాలం లోనే దిశానిర్దేశాల రూపకల్పన చేసి, గుర్తింపు తీసుకొచ్చారు. విద్య రంగంలో  తన దార్శనికతకు విశ్వ వ్యాప్తంగా తనకు ఖ్యాతి వచ్చింది. తన తర్వాత ఆంధ్ర విశ్వ విద్యాలయానికి ఉపకులపతి గా వచ్చిన మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధా కృష్ణన్ గారు కూడా చిత్తూర్ జిల్లా వాస్తవ్యులే. నాకు తెలిసి ఇంకొకరు వేణుగోపాల రెడ్డి అని ఈ జిల్లా నుండే ఇంకొకరు ఆ విశ్వ విద్యాలయానికి ఉపకులపతి గా పని చేసారు.

అటు తమిళనాడు ఉన్నా, ఇటు కర్ణాటక  వున్నా.. తెలుగు భాష లో తనకంటూ ఓ గుర్తింపు ని నిలుపుకున్నారీ ప్రాంత వాసులు. అసలు ఈ వూరి పేరు కూడా తమిళం నుండి వచ్చిందే.. చిత్ (అంటే చిన్న) + వూరు అన్న అర్థం తో వచ్చిందే ఈ వూరి పేరు. భాష లో యాస వున్నా.. ఇక్కడి విద్యాధికులు తెలుగు లో పట్టు సాధించారు. అందుకేనేమో… మనకు ఈ భాషా పరిమళాలను అస్వాదింప చేసిన మన  తెలుగు మేస్టార్లు… కృష్ణప్ప, దామోదరం, రామకృష్ణ గార్లు ఆ భాష ని మన తరాలకు అందచేయటంలో కృతకృత్యులయ్యారు.

కాలక్రమం లో ఎన్నో మార్పులు వస్తున్నా .. ఈ వూరు లో ఇప్పటికీ నాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసే ప్రదేశాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి.. ఇక్కడ మార్పు కొంచం నెమ్మది గా జరగటం కూడా ఒక విధంగా మంచిదేనేమో.. ఎందఱో గొప్ప వాళ్లనిచ్చిన వూరు..ఎన్నో చారిత్రక ఘటనలకు మూగ సాక్ష్యమైన ఈ ప్రాంతం  ఇప్పటికీ  ఓ sleepy town గానే మిగిలి ఉంది… నిశ్చలంగా….  నిర్మలంగా ..

Advertisements
This entry was posted in నాడు-నేడు. Bookmark the permalink.

One Response to ఆ వూరి మాణిక్యాలు- కట్టమంచి రామలింగా రెడ్డి

  1. The 1st speaker of loksabha freedom fighter Dr.Ananthasayanamiyyengar was a member of chittoor Advocates Association.&composite Madras state Legislative council chairman sri.R.B.RamakrishnamaRaju was a native of karvetnagar and member of chittoor Advocates Association.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s