ఓ “వంట” నేర్చుకుందాం..

 
“Necessity is the mother of invention”  అని నొక్కి వక్కాణించారు  పెద్దలు. కొన్ని ఆపత్కాల పరిస్థితులలో కొన్ని నేర్చుకోవటం అనివార్యం అవుతుంటుంది. అలాగా నేర్చుకున్నదే ఈ వంట.. (“వంట” అని మరీ పెద్ద మాట వాడేసానేమో…?)
 
ఇక పాయింటు కోద్దాం. ఇవ్వాళా చెప్పబోయే వంట వార్పూ హేమిటంటే Micro-oven లో అన్నం వండటం ఎలా  అన్న విషయం పై.. ఈ వంట విధి విధానాల గురించి చర్చిద్దాం..
ముందు apron, gloves, వీలైతే నెత్తిన ఓ క్యాపు పెట్టుకోండి.. (వంట ఎలాగున్నా buildup బాగుండాలి అన్నది వంట- వార్పూ లో ముఖ్య సూత్రం..) ఓ Micro-oven friendly (అంటే “నిప్పులోన కాలదూ.. నీటిలోన నానదూ.. పాత్ర సత్యమూ..” అన్న టైపన్న మాట) బౌల్ తీసుకుని, ఓ గ్లాసుడు బియ్యానికి “ఖరేఖ్టు” గా రెండు గ్లాసుల నీళ్ళు పోసి బౌల్ లో మిక్స్ చేయాలి. తరవాత మైక్రో ఓవెన్ లో బౌల్ ని పెట్టి , డోర్ మూసాక, timer ని మళ్ళీ   “ఖరేఖ్టు” గా పద్దెనిమిది నిమిషాలకు సెట్ చేయాలి. రైస్ కి  Gelatinization temperature అనేది (స్టార్చి ఉండటం వలన) ఉండటం వలన, ఈ టైం కొంచం అటూ ఇటూ అయినా అన్నం మాడటం, అందరి దగ్గర అక్షింతలు వేయించుకోవటం  .. లేదంటే మిమ్మల్ని మీరే తిట్టుకోవటం లాంటి వైపరీత్యాలు జరగవచ్చు. కాబట్టి timer  విషయం లో జాగ్రత్త గా ఉండండి. 18 నిమిషాలు అన్నాను కదా ఓవెన్ ఆన్ చేసి నిద్రపోకండి. పదిహేనో నిమిషం నుండి ఓ కన్ను అటు పడేయండి.. ఎందుకంటే.. “ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ..”.
పద్దెనిమిదో  నిమిషం తరవాత.. “ఘుమ ఘుమ” (??) లాడే అన్నం మీ ముందు రెడీ..ఏదైనా టీ. వీ వంట వార్పూ షో లో anchor గా ఉండే వారికి తినిపించారనుకోండి  ..  వాళ్ళు రెండు పలుకులు నోట్లో వేసుకొని.. తన్మయత్వం తో , అర్ధ నిమీలిత నేత్రాలతో ” ఆహా.. వోహో,, అద్భుతం..” అనడం ఖాయం.
 
ఈ నా ప్రయోగం నాకు ఎంతో ఉపయోగకరం గా ఉండి..”నేనూ మైక్రో ఓవెన్ వాడాను… నా అన్నం నేను వండుకొన్నాను” అని ప్రపంచానికి గర్వం గా చెప్పేలా చేసింది. మన క్లాస్మేట్స్ లో వంట లో ఘటికులైన విజయ, ప్రమీల ఇది చదివి..” వోస్ ఇంతేనా  ..” అని అనకుండా.. “పర్లేదు.. ఈ మాత్రం నేర్చుకున్నాడు” అని మా లాంటి వర్ధమాన వంటగాళ్ళను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.
 
గమనిక: ఈ ప్రయోగం మీరు ఏదైనా ఎడారి (పోఖరాన్ లాంటి) లో అణు పరీక్షలు  చేసినట్లో, సముద్ర తీరాన రాకెట్ టెస్ట్ చేసినట్లే .. ఎవరూ చూడని సమయం లో ఈ వంట పైన చెప్పిన పద్ధతి లో వండి, ముందు మీరు తినండి. ఉంటే.. బాగుంటే… పది మందికి తినిపించండి..  అప్పుడు “ఈ వంట మనదేనని చాటిద్దాం” అని “తెలుగు వీర లేవరా…” అన్న పాటలో లాగ పాడుకోవచ్చు.
   
Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

3 Responses to ఓ “వంట” నేర్చుకుందాం..

 1. D S KRISHNAN says:

  vanta emiee brahma vidya kaadu sodara! nala vidya! mahilalu ala buildup istoo vuntaru
  cooker ayina, oven ayiana. kumpati ayina ade sutrame!

  freindsku andariki srikhara subhakankshalu

 2. chinni says:

  good…ee nela rojullo hentha pragathi saadhisthaaroo…annamloki hemkoora chesi thinalo kooda cheppandi …thinaleni vaallu BOUNTY choksthinochha:-)

 3. JNS,first of all,u are indebted 2 u jayanthi,leaving u all these 18 years for not inviting u for cooking.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s